EPAPER

AP Politics:ఏపీలో కాంగ్రెస్ బలోపేతంపై దృష్టి..రేవంత్ కు కీలక బాధ్యతలు

AP Politics:ఏపీలో కాంగ్రెస్ బలోపేతంపై దృష్టి..రేవంత్ కు కీలక బాధ్యతలు
  • ఏపీ కాంగ్రెస్ లో మళ్లీ చిగురిస్తున్న ఆశలు
  • మొన్నటి ఎన్నికలలో ప్రభావం చూపని వైఎస్ షర్మిల
  • 11 స్థానాలతో కుదేలయిన వైఎస్ఆర్ సీపీ
  • కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి ఇదే సమయం
  • భావిస్తున్న అధిష్టానం..ఆ దిశగా కసరత్తు
  • తెలంగాణ సీఎం రేవంత్ కే ఏపీ కీలక బాధ్యతలు
  • ఏపీలోనూ రేవంత్ కు అభిమానులు
  • రేవంత్ సలహాలు, సూచనలు తీసుకోవాలని రష్మిలకు సంకేతాలు

Congress High command focus on AP politics(AP news live):


మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి పునర్‌వైభవం తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి మళ్లీ పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా చేశారు. వచ్చీ రాగానే పాలనలో తనదైన ముద్రను వేసుకోగలిగారు. అందుకే పార్లమెంట్ ఎన్నికలలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏమీ లేదని తేలింది. సగానికి సగం సీట్లు కైవసం చేసుకుంది. బీఆర్ఎస్, బీజేపీ కలిసి చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ లో అనుకున్న 15 స్థానాలు రాబట్టలేకపోయింది. ఈ విషయాన్నిఅధిష్టానానికి వివరించి చెప్పడంలో సీఎం రేవంత్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. రేవంత్ రెడ్డికి రోజురోజుకూ అధిష్టానం వద్ద పలుకుబడి పెరిగిపోతోంది. ఇదంతా ఆయన పనితీరు. ప్రస్తుతసంక్షేమ పథకాలు వాటి అమలు తీరు పై రోజువారీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు రేవంత్ పై చాలా బాధ్యతలే ఉన్నాయి. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, కేబినెట్ విస్తరణ, లోకల్ ఎలక్షన్ల నిర్వహణ వంటి అంశాలతో పాటు అధిష్టానం రేవంత్ పై పెద్ద బరువే పెట్టనుంది.

షర్మిల ఫెయిల్


ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వైఎస్ వారసురాలిగా రాజకీయాలలో అడుగుపెట్టింది షర్మిల. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని ఏపీలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి పూనుకుంది. ఒకప్పుడు కాకలు తీరిన రాజకీయ నేతలంతా కాంగ్రెస్ లో ఉండేవారు. వైఎస్ ఆర్ సీపీ ని నమ్ముకుని జగన్ చెంతకు చేరారు. దాంతో ఏపీలో కాంగ్రెస్ తరపున పోటీచేసే చరిష్మా ఉన్న నేతలెవరూ లేకపోవడంతో చాలా చోట్ల డిపాజిట్ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్వయంగా ఆ పార్టీ చీఫ్ షర్మిల ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ చుక్కాని లేని నావ మాదిరిగా తయారయింది. పార్లమెంట్ ఎన్నికలలో ఓటమి చవిచూసిన షర్మిల అధిష్టానం దృష్టిలో నమ్మకం కోల్పోయింది. అందుకే కాంగ్రెస్ అధిష్టానం స్వయంగా రంగంలోకి దిగింది. ఏపీలో జులై 8న వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా జరిపిస్తోంది. వాడవాడలా వైఎస్ ఆర్ ఫ్లెక్సీలతో, కాంగ్రెస్ జెండాలతో సందడి చేస్తోంది. ఇటు తెలంగాణలోనూ వైఎస్ జయంతి వేడుకలు జరిపిస్తోంది.

జయంతి వడుకలకు రేవంత్

వైఎస్ జయంతి వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. వైఎస్ తో కలిసి పనిచేసిన మంత్రులు కూడా పాల్గొననున్నారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని కుదేలయిన వైఎస్ జగన్ పార్టీకి ధీటుగా వైఎస్ జయంతి వేదిక కాబోతోంది. వివిధ రాష్ట్రాలనుంచి కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొనాల్సిందిగా అధిష్టానం కబురుపెట్టింది. కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి ఇంతకుమించిన తరుణం లేదని అధిష్టానం భావిస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వైఎస్ జయంతి వేడుకలలో స్పెషల్ ఎట్రాక్షన్ గా మారనున్నారు. ఇకపై ఏపీలోనూ కాంగ్రెస్ బలోపేతంపై దృష్టి పెట్టాల్సిందిగా రేవంత్ పై పెద్ద బాధ్యతనే పెట్టబోతోంది అధిష్టానం. మొన్నటి సార్వత్రిక ఎన్నికలలోనూ రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ గా మారి అయా రాష్ట్రాలలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారు.

జాతీయ స్థాయిలో రేవంత్ ప్రచారం

రేవంత్ రెడ్డి ప్రచారాలు సత్ఫలితాలనే ఇచ్చాయి. ఇండియా కూటమి అనూహ్యంగా పుంజుకుంది. పైగా రేవంత్ రెడ్డి తన ప్రతి ప్రచారంలో మోదీ విధానాలను ఎండగడుతూ వచ్చారు. మోదీ ముస్లిం వ్యతిరేకి అని చేసిన ప్రచారం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారింది. మోదీని గెలిపిస్తే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తారని చేసిన ప్రచారం వైరల్ గా మారింది. మోదీ కలలు కన్న 400 సీట్లకు భారీ గా గండిపడింది. పైగా రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే మోదీకి పూర్తి స్థాయి మెజారిటీ రాకపోగా సంకీర్ణ ప్రభుత్వంతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో ఏపీ కాంగ్రెస్ ను సైతం గాడిలో పెట్టగల సామర్థ్యం కేవలం రేవంత్ కు మాత్రమే ఉందని అధిష్టానం భావిస్తోంది. వైఎస్ రష్మిలకు రేవంత్ రెడ్డి సలహాలు, సూచనలు తీసుకోవాలని అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. రేవంత్ రెడ్డికి ఏపీలోనూ చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇక రేవంత్ ఏపీలో తన రాజకీయ గురువైన చంద్రబాబు పైనే అస్త్రాలు సంధించాల్సి ఉంటుంది ముందు రోజుల్లో. ఏది ఏమైనా రేవంత్ పై అధిష్టానం పెద్ద బాధ్యతనే పెట్టబోతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

 

Tags

Related News

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

×