EPAPER

Telangana Nominated posts: తెలంగాణలో నామినేటెడ్ పోస్టులు, 34 కార్పొరేషన్ ఛైర్మన్లకు పదవులు

Telangana Nominated posts: తెలంగాణలో నామినేటెడ్ పోస్టులు, 34 కార్పొరేషన్ ఛైర్మన్లకు పదవులు

Telangana Nominated posts: ఎట్టకేలకు తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ మొదలైంది. దాదాపు 34 మందిని వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్లగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మొత్తం 54 పోస్టులకు తొలి విడతలో 34 మంది పేర్లతో జాబితాను విడుదల చేసింది.


మార్చి 15నే ఇందుకు సంబంధించిన జీవో విడుదలైంది. కాకపోతే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆగిపోయింది. ఈలోగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కురియన్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఆమోద ముద్ర వేసే అవకాశముందంటూ తొలుత వార్తలు వచ్చాయి.

తాజాగా కొత్తగా జీవో విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. మరికొన్ని పదవులకు పెండింగ్‌లో పెట్టినట్టు సమాచారం. మొత్తానికి లోకల్ బాడీ ఎన్నికల ముందే నామినేటెడ్ పదవులు భర్తీ అయ్యాయి. చాలా మంది ఆశావహులు లోక్‌సభ ఎన్నికలకు ముందు నామినేటెడ్ పదవులకు దరఖాస్తు చేసుకున్నారు. పార్టీలో చురుగ్గా పని చేసి సేవలందించిన వారికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదవులను అప్పగించినట్టు తెలుస్తోంది.


ALSO READ: బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు, అలాంటి నేతలు మాకొద్దు..

జననేత డాక్టర్ వైయస్ఆర్ జయంతి నాడు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలందరికీ సోమవారం పండుగ రోజనే చెప్పాలి. ఆయన జయంతిని పురస్కరించుకుని నామినేటెడ్ పదవుల భర్తీ‌కి శ్రీకారం చుట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

తెలంగాణ సీడ్స్ స్టేట్ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్-అన్వేష్‌రెడ్డి

తెలంగాణ ఆగ్రో డెవ‌ల‌ప్మెంట్ ఛైర్మ‌న్-కాసుల బాల‌రాజు

తెలంగాణ కో-ఆప‌రేటివ్ ఆయిల్ సీడ్స్ ఫెడ‌రేష‌న్ ఛైర్మన్-జంగా రాఘ‌వ‌రెడ్డి

తెలంగాణ కో-ఆప‌రేటివ్ యూనియ‌న్ లిమిటెడ్ ఛైర్మన్-మానాల మోహ‌న్‌రెడ్డి

తెలంగాణ వేర్ హౌజ్ కార్పోరేష‌న్ ఛైర్మన్ -రాయ‌ల నాగేశ్వ‌ర్‌రావు

తెలంగాణ ముదిరాజ్ కో-ఆప‌రేటివ్ సోసైటి లిమిటెడ్ ఛైర్మన్‌గా-జ్ఞానేశ్వ‌ర్ ముదిరాజ్

తెలంగాణ ఫిష‌రీస్ కార్పోరేష‌న్ ఛైర్మన్‌గా -మెట్టు సాయి‌కుమార్

తెలంగాణ గ్రంధాలయ పరిషత్ ఛైర్మన్ – రియాజ్

తెలంగాణ ఫారెస్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్- పొడెం వీరయ్య

తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్- కాల్వ సుజాత

తెలంగాణ పోలీసు హౌసింగ్ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్-ఆర్. గురునాథ్‌రెడ్డి

జంట నగరాల సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్ ఛైర్మన్- గిరిధర్‌రెడ్డి

తెలంగాణ మినిమమ్ వేజెస్ అడ్వయిజరీ బోర్డు ఛైర్మన్ – జనక్ ప్రసాద్

తెలంగాణ ఇరిగేషన్ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్- విజయబాబు

తెలంగాణ హాండీక్రాప్ట్ అభవృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ -సత్యనారాయణ

తెలంగాణ ఖనిజ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్- అనిల్

తెలంగాణ పరిశ్రమల ఇన్‌ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ ఛైర్మన్- నిర్మల జగ్గారెడ్డి

తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్- అనితా ప్రకాష్‌రెడ్డి

తెలంగాణ టెక్నాలజీ సర్వీసు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్- మన్నె సతీష్‌కుమార్

తెలంగాణ పట్టణ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్టక్చర్ అభివృద్ధి కో-ఆపరేషన్ ఛైర్మన్-చల్లా నరసింహారెడ్డి

శాతవాహన పట్టణ అభివృద్ధి అథారిటీ ఛైర్మన్‌-నరేందర్‌రెడ్డి

కాకతీయ పట్టణ అభివృద్ధి అథారిటీ ఛైర్మన్‌-వెంకట్రామిరెడ్డి

తెలంగాణ రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్- రామిరెడ్డి మల్‌రెడ్డి

తెలంగాణ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్-పటేల్ రమేష్‌రెడ్డి

తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ ఛైర్మన్- ఫహీమ్

తెలంగాణ ఉమెన్ కో-ఆపరేటివ్ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్-బండ్రు శోభారాణి

తెలంగాణ వికలాంగుల అభివృద్ధి కో-ఆపరేషన్ ఛైర్మన్-వీరయ్య

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్- శివసేనారెడ్డి

తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఛైర్మన్- అలేఖ్య పుంజల

తెలంగాణ ఎస్సీ కో-ఆపరేటివ్ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్- ప్రీతమ్

తెలంగాణ బీసీ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్- శ్రీకాంత్

తెలంగాణ ఎస్టీ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్- బెల్లయ్య నాయక్

తెలంగాణ గిరిజన్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్- తిరుపతి

తెలంగాణ వెనుకబడిన కులాల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్- జైపాల్

Related News

Secunderabad To Goa Trains: సికింద్రాబాద్ టూ గోవా రైలును ప్రారంభించిన కిషన్ రెడ్డి

Bhatti Vikramarka: అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్కూల్స్ ఏర్పాటు చేస్తా: భట్టి విక్రమార్క

Cyber Crime: సైబర్ నేరాలకు పాల్పడుతున్న నిందుతులు అరెస్ట్.. రూ.1.61 కోట్ల నగదు సీజ్‌

Where is KCR and Kavitha: కవిత, కేసీఆర్‌కి ఏమైంది ? బీఆర్ఎస్‌లో ఆందోళన

Vegetable Prices: సామాన్యుడిపై మరో భారం.. సెంచరీ చేరువలో ఉల్లి, టమాట

Heavy Rain: బిగ్ అలర్ట్.. నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Minister Seethakka: వారి మరణానికి కారణం మీరు కాదా..? : ప్రధాని మోదీకి మంత్రి సీతక్క కౌంటర్

×