EPAPER

New HIV Injection: హెచ్‌ఐవీకి ఇంజెక్షన్‌ వచ్చేసింది.. రెండేళ్లలో వ్యాధి నుంచి విముక్తి..

New HIV Injection: హెచ్‌ఐవీకి ఇంజెక్షన్‌ వచ్చేసింది.. రెండేళ్లలో వ్యాధి నుంచి విముక్తి..

Uganda Medical Scientists Discover New HIV Injection: HIV కేసులు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో అగ్రస్థానంలో ఉంది. 2004 నుంచి HIV కి సంబంధించిన యాంటీ రెట్రోవైరల్ మందులను ఉచితంగా సరఫరా చేస్తుంది. వీటిమీదనే హెచ్‌ఐవీ బాధితులు ఆధారపడుతున్నారు. కాని ఇవి ఉపశమనానికి మాత్రమే.. హెచ్‌ఐవీ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి కారణం HIVని తగ్గించే శాస్వత మందులు లేకపోవడం.


అయితే తాజాగా ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ వ్యాధితో బాధపడుతున్నవారికి పూర్తి ఉపశమనం లభించింది. హెచ్‌ఐవీ ఇన్ ఫెక్షన్స్ తగ్గించే సూది మందు పరీక్షలు విజయవంతం అయినట్లు ఉగాండలోని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఇంజక్షన్ ను సంవత్సరానికి రెండు సార్లు అంటే ఆరు నెలలకొకసారి తీసుకోవాల్సి ఉంటుంది. తద్వార HIV అనేది పూర్తిగా తగ్గుముఖం పడుతున్నట్లు దక్షిణాఫ్రికా, ఉగాండాలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ లో తేలింది.

ఈ ఇంజక్షన్ వల్ల హెచ్‌ఐవీ బారినుండి కాపాడవచ్చని స్పష్టమైంది. అయతే ఈ ‘లెన్‌కావిర్’ ఇంజెక్షన్ రోజూవారీ మందులు కంటే మెరుగైనదా? లేదా అనే అంశంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఈ మూడు ఔషదాలు ‘ప్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ డ్రగ్స్ అని శాస్త్రవేత్తలు తెలిపారు. 2,134 మంది యువతలో ‘లెన్‌కావిర్’ ఇంజెక్షన్ ను తీసుకోగా వారిలో ఏ ఒక్కరికి హెచ్‌ఐవీ సోకలేదు. వందకి వంద శాతం ఈ ప్రయోగం సక్సెస్ అయింది. ట్రువడ (ఎఫ్‌/టీడీఎఫ్‌) డ్రగ్స్ ని 1,068 మంది యువతులు తీసుకోగా.. వారిలో 16 మందికి HIV సోకినట్లు నిర్ధారించారు. ఈ ఇంజక్షన్ ను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉగాండ శాస్త్రవేత్తలు తెలిపారు.


Also Read: ఐదేళ్ల తర్వాత రష్యాలో మోదీ పర్యటన

ఇదిలా ఉంటే గతేడాది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.3 మిలియన్ HIV కేసులు నమోదయ్యాయి. అయితే 2010లో నమోదయిన కేసుల కంటే గతేడాది తక్కువగానే నమోదయ్యాయి. UNA IDS 2025, 2030 నాటికి ఎయిడ్స్‌ను సమర్థవంతంగా తొలగించడం అనే లక్ష్యంతో ఈ ఇంజక్షన్ తయారు చేసినట్లు గిలీడ్‌ సైన్సెస్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

 

Related News

Elon Musk: ట్రంప్ ర్యాలీలో మస్క్ మామ డ్యాన్స్.. ఇలా తయారయ్యావేంటి సామి

Continent Turns Green: అక్కడ మొక్కలు మొలిచాయంటే.. భూమి అంతమైనట్లే, శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది ఇదే!

Conflict: మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..?

Dominica Citizenship: ‘ఎవరైనా రావొచ్చు’.. తక్కువ ధరకే పౌరసత్వం విక్రయిస్తున్న దేశం ఇదే..

Elon Musk Brazil: బ్రెజిల్‌లో ట్విట్టర్ ఎక్స్ ఆగని కష్టాలు.. తప్పుడు బ్యాంకులో ఫైన్ చెల్లింపులు!

India’s Iron Dome: ఇండియాపై శత్రువులు మిసైల్ దాడి చేస్తే పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్ తరహా యాంటి మిసైల్ టెక్నాలజీ మన దగ్గర ఉందా?

Trump Advice To Israel: ‘ఇరాన్ అణు స్థావారాలపై వెంటనే దాడి చేయండి’.. ఇజ్రాయెల్ కు ట్రంప్ సలహా

×