EPAPER

BCCI Rs 125 crore for categories: బీసీసీఐ ఫ్రైజ్ మనీ.. 125 కోట్లు, నాలుగు కేటగిరీలకు..

BCCI Rs 125 crore for categories: బీసీసీఐ ఫ్రైజ్ మనీ.. 125 కోట్లు, నాలుగు కేటగిరీలకు..

BCCI Rs 125 crore for categories: టీమిండియా ఆటగాళ్లు బీసీసీఐ ఇస్తామన్న 125 కోట్లు ఇచ్చేసిందా ? 15 మంది ఆటగాళ్లకే ఇచ్చిందా? అక్కడికి వెళ్లిన టీమ్ మొత్తానికి ఇచ్చిందా? అలాగైతే ఆ డబ్బును ఎలా డివైడ్ చేస్తోంది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.


వెస్టిండీస్ వేదికగా టీమిండియా టీ 20 ప్రపంచకప్ గెలిచింది. దాదాపు 23 ఏళ్ల తర్వాత కప్ గెలవడంతో బీసీసీఐ ఆటగాళ్లకు భారీగానే నజరానా ప్రకటించింది. టీమిండియాకు 125 కోట్లు ఇస్తున్నట్లు స్టేట్‌మెంట్ చేశారు బీసీసీఐ కార్యదర్శి జై షా. దీంతో ఆటగాళ్లు ఫుల్‌ఖుషీ. విండీస్ నుంచి ఆటగాళ్లు ఇండియాకు రావడం వాళ్లను సన్మానించడం జరిగిపోయింది. అసలు కథ ఇప్పుడే మొదలైంది.

125 కోట్లను ఎలా పంచుతారనేది అసలు మేటర్. దీన్ని నాలుగు కేటగిరిలుగా విభజించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 15 మంది ఆటగాళ్లు, కోచ్ రాహుల్ ద్రావిడ్‌లకు ఒక్కొక్కరికి ఐదేసి కోట్ల రూపాయల చొప్పున ఇవ్వనున్నారు. రిజర్వ్ ప్లేయర్స్ ఒకొక్కరికీ తలా కోటి చొప్పున ఇవ్వనున్నట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.  మిగతా రెస్టాప్ కోచింగ్ గ్రూప్‌కు 2.5 కోట్లు, బ్యాక్ రూమ్ స్టాప్‌కు ఒకొక్కరికీ రెండు కోట్లు రూపాయలు ఇవ్వనున్నారట.


ఓపెనర్ జైశ్వాల్, వికెట్ కీపర్ సంజుశాంసన్, స్పిన్నర్ చాహాల్ వంటి ఆటగాళ్లు ఒక్క మ్యాచ్ ఆడలేదు. కానీ ఒకొక్కరికీ ఐదేసి కోట్లు ఇవ్వనుంది. రిజర్వ్ ఆటగాళ్లు నలుగురు ఉన్నారు. శుభ్‌మన్ గిల్, రింకూసింగ్, ఫాస్ట్ బౌలర్ ఆవేష్‌ఖాన్, ఖలీల్ అహ్మద్‌లకు కొటి చొప్పున ఇవ్వనున్నారు.

ALSO READ: రెండో టీ20లో భారత్ ఘన విజయం..

కోచింగ్ గ్రూప్ బ్యాటింగ్- విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్- దిలీప్, బౌలింగ్- పరాస్ మాంబ్రే రెండున్నర కోట్లు ఇవ్వనుంది. ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీలోని సభ్యులకు ఒకొక్కరికీ కోటి చొప్పున ఇవ్వనున్నారు. బ్యాక్‌రూమ్ స్టాప్‌లో ముగ్గురు ఫిజియోథెరపిస్టులు, ముగ్గురు త్రో డౌన్ స్పెషలిస్టులు, ఇద్దరు మసాజర్లు, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌లకు ఒక్కొక్కరికి రెండేసి కోట్ల రూపాయల చొప్పున అందజేయనుంది. మొత్తానికి ఆ విధంగా 125 కోట్ల రూపాయలను అందరికీ డివైడ్ చేసింది బీసీసీఐ.

Tags

Related News

IPL 2025: ఐపీఎల్‌ రిటెన్షన్ రూల్‌పై కొత్త పంచాయితీ…చిక్కుల్లో ఓనర్లు?

Hardik Pandya: పాండ్యాకు 18 కోట్లు దండగే..ముంబై సంచలన నిర్ణయం ?

Ind vs Ban 1st T20: ఇవాళ బంగ్లా, టీమిండియా మధ్య టీ20..జట్లు, టైమింగ్స్ వివరాలు ఇవే !

Rohit Sharma: 2027 వరకు రోహిత్ శర్మనే కెప్టెన్..కాంగ్రెస్ ప్రకటన

Mohammed Shami: మహమ్మద్ షమీది దొంగ ప్రేమ..మాజీ భార్య హాసిన్ సంచలనం!

Ind vs Ban: హైదరాబాద్‌లో భారత్-బంగ్లాదేశ్‌ మ్యాచ్.. నేటి నుంచి టికెట్ల విక్రయం

Ms Dhoni: RCBపై కోపంతో ధోనీ… TV పగలగొట్టేశాడు..క్లారిటీ ఇదే?

×