EPAPER

Hawaii Governor Comments: కీలక వ్యాఖ్యలు చేసిన బైడెన్ సన్నిహితుడు.. ఆ స్థానంలో కమలాను..

Hawaii Governor Comments: కీలక వ్యాఖ్యలు చేసిన బైడెన్ సన్నిహితుడు.. ఆ స్థానంలో కమలాను..

Joe Bbiden could decide within days – Hawaii Governor: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సన్నిహితుడు తాజాగా పలు వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బైడెన్‌కు అత్యంత సన్నిహితుడైన హవాయి గవర్నర్ జోష్ గ్రీన్ ఈ వ్యాఖ్యలు చేయడంతో తాజాగా కొత్త చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.


అయితే, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ పోటీపై స్వపక్షం నుంచే ఎదురీత ఎదురవుతుంది. బరి నుంచి వైదొలగబోనంటూ ఇప్పటికే బైడెన్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అయినా కూడా రేసు నుంచి పక్కకు జరగాలనే డిమాండ్లు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆయనకు సన్నిహితంగా ఉండే హవాయి గవర్నర్ జోష్ గ్రీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోటీలో ఉండాలా? లేదా ? అనే విషయంపై మరికొన్నిరోజుల్లో బైడెన్ తన నిర్ణయాన్ని వెల్లడిస్తారంటూ ఆయన పేర్కొన్నారు.

గ్రీన్ ఇటీవలే బైడెన్ సహా ఇతర డెమోక్రాటిక్ పార్టీకి చెందిన గవర్నర్లతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం ఆయన నుంచి ఈ తరహా ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని బైడెన్ భావిస్తే.. ఆ స్థానంలో కమలా హ్యారిస్ ను ఆయన ప్రతిపాదించే అవకాశం లేకపోలేదని అన్నారు.


Also Read: అమెరికాలో మరోసారి కాల్పులు..నలుగురు మృతి

‘గెలవడం సాధ్యం కాదని అధ్యక్షుడు భావిస్తే ఆయన పోటీ నుంచి వైదొలగనున్నారు. ఆయన సన్నిహిత వర్గాలు సైతం పోటీ నుంచి దూరం కావాలని డిమాండ్ చేస్తున్నాయి. అయినా అభ్యర్థిత్వంపై పునరాలోచిస్తారు. ఆ పదవికి తాను తగినవాడిని కాదని భావిస్తే ఆయన ఖచ్చితంగా పక్కకు జరుగుతారు. దీనిపై జోబైడెన్ త్వరలోనే తన నిర్ణయాన్ని వెల్లడిస్తారు’ అంటూ మీడియాతో పేర్కొన్నారు.

‘ప్రతి ఒక్కరి జీవితంలో క్లిష్ట సమయాలు ఉంటాయి. సొంతింట్లోనే పెద్దవాళ్లు అప్పుడప్పుడు వారి అభిప్రాయాలను వ్యక్తపరచడంలో తడబడుతుంటారు. అంతమాత్రాన వారి అనుభవం, తెలివితేటలు, కుటుంబంలో వారి పాత్రను విస్మరించలేం కదా. అందుకే నేను ఇప్పటికీ బైడెన్ కు మద్దతుగా నిలుస్తున్నా. పరోక్షంగా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ తో జరిగిన డిబేట్ లో బైడెన్ తడబడినంత మాత్రాన ఆయన సామర్థాన్ని అనుమానించాల్సిన అవసరంలేదు’ అని గ్రీన్ అన్నారు.

‘అదేవిధంగా వయసులో ట్రంప్ సైతం తక్కువేమీ కాదు. బైడెన్ కంటే కేవలం మూడేళ్లు మాత్రమే చిన్నవారు. అధ్యక్షుడికి వయసుతో సంబంధం లేదు. బాధ్యతలకు కట్టుబడి ఉండడం మాత్రమే ముఖ్యం. అర్ధరాత్రి లేచి వివిధ దేశాల మధ్య అగ్గిరాజేసే ట్వీట్లు చేసే అధ్యక్షుడు మనకు అవసరంలేదు. బైడెన్ తో అలాంటి సమస్యలేవీ తలెత్తవు’ అని జోష్ గ్రీన్ అన్నారు.

Also Read: కవ్వింపు చర్యలకు దిగుతున్న చైనా.. భారత్ సరిహద్దులో బంకర్ల నిర్మాణం

బైడెన్ పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తే ఆ స్థానంలో ఎవరు ఉండాలనే విషయం ఆయనకే వదిలేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ను ప్రతిపాదిస్తే మొత్తం డెమోక్రాటిక్ పార్టీ ఆనందిస్తుందన్నారు. ప్రస్తుతమైతే ఆమె కంటే మెరుగైన అర్హత కలిగిన వ్యక్తులెవరూ లేరన్నారు.

Tags

Related News

Continent Turns Green: అక్కడ మొక్కలు మొలిచాయంటే.. భూమి అంతమైనట్లే, శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది ఇదే!

Conflict: మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..?

Dominica Citizenship: ‘ఎవరైనా రావొచ్చు’.. తక్కువ ధరకే పౌరసత్వం విక్రయిస్తున్న దేశం ఇదే..

Elon Musk Brazil: బ్రెజిల్‌లో ట్విట్టర్ ఎక్స్ ఆగని కష్టాలు.. తప్పుడు బ్యాంకులో ఫైన్ చెల్లింపులు!

India’s Iron Dome: ఇండియాపై శత్రువులు మిసైల్ దాడి చేస్తే పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్ తరహా యాంటి మిసైల్ టెక్నాలజీ మన దగ్గర ఉందా?

Trump Advice To Israel: ‘ఇరాన్ అణు స్థావారాలపై వెంటనే దాడి చేయండి’.. ఇజ్రాయెల్ కు ట్రంప్ సలహా

Israel India Iran: ‘దాడి చేయవద్దని ఇండియా ద్వారా ఇరాన్‌కు ముందే హెచ్చరించాం’.. ఇజ్రాయెల్ అంబాసిడర్

×