Xiaomi భారతదేశంలో Redmi 13 5Gని జూలై 9న విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.

విడుదలకు కొద్ది రోజుల ముందు, ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ధరను ఓ టిప్‌స్టర్ ఎక్స్‌లో లీక్ చేశారు.

డివైస్‌లో క్రిస్టల్ గ్లాస్ డిజైన్, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 యాక్సిలరేటెడ్ ఎడిషన్ ప్రాసెసర్ ఉంటుందని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది.

టిప్‌స్టర్ ప్రకారం హ్యాండ్‌సెట్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో లాంచ్ కావచ్చు.

అందులో 6GB + 128GB, 8GB + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి.

ఇందులో బేస్ మోడల్ ధర రూ. 13,999 నుండి ప్రారంభమవుతుంది.

ఫస్ట్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌పై రూ. 1,000 క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంటుంది.

ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో వస్తున్నప్పటీకి ప్రీమియం ఫీచర్లు ఉంటాయి. దీనిలో అతిపెద్ద డిస్‌ప్లే ఉంటుంది.

 ఇది పంచ్-హోల్ నాచ్ డిజైన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్ కలిగి ఉంటుంది.

Redmi 13 5Gలో Qualcomm స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది.