EPAPER

Jon Landau Death: ఇండస్ట్రీలో విషాదం.. టైటానిక్, అవతార్ మూవీల నిర్మాత కన్నుమూత

Jon Landau Death: ఇండస్ట్రీలో విషాదం.. టైటానిక్, అవతార్ మూవీల నిర్మాత కన్నుమూత

Jon Landau Death: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం జరిగింది. ప్రముఖ హాలీవుడ్ నిర్మాత తాజాగా కన్నుమూశారు. హాలీవుడ్‌లో టైటానిక్, అవతార్‌ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల నిర్మాత జోన్ లండౌ 63 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న జోన్ లండౌ లాస్ ఏంజిల్స్‌లో మరణించారు. ఆయన జూలై 5న మృతి చెందగా.. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రముఖ సినీ ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం తెలియజేస్తున్నారు.


కాగా జోన్ లండౌ 1980లో ప్రొడక్షన్ మేనేజర్‌గా కెరీర్ ప్రారంభించాడు. అతను ‘హనీ ఐ ష్రంక్ ది కిడ్స్’, ‘డిక్ ట్రేసీ’లో సహ నిర్మాతగా పని చేశాడు. వీటితో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ‘టైటానిక్’ సినిమాతో పూర్తి నిర్మాణ బాధ్యతల్ని అందుకున్నాడు. ప్రముఖ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ తెరకెక్కించిన ఈ సముద్రపు విపత్తు సినిమా యావత్ సినీ ప్రియుల్ని కట్టిపడేసింది.

బాక్సాఫీసు వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. కనీ వినీ ఎరుగని రీతిలో కలెక్షన్లు రాబట్టి నిర్మాతకు లాభాల పంట పండించింది. అంతేకాకుండా బాక్సాఫీసు వద్ద $1 బిలియన్లను దాటిన మొదటి చిత్రంగా నిలిచింది. ఇదే గాక ఈ సినిమా 14 ఆస్కార్స్ నామినేష‌న్స్‌లో చోటు సంపాదించగా అందులో ఉత్తమ చిత్రంతో సహా 11 ఆస్కార్‌లను గెలుచుకుని హాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.


Also Read: ఇండస్ట్రీలో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న లేడీ ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్

ఆ సమయంలో టైటానికి సినిమాకు గాను ఆస్కార్ అవార్డులు లభించడంతో నిర్మాత జోన్ లండౌ మాట్లాడుతూ.. ‘‘నేను నటించలేను, కంపోజ్ చేయలేను, విజువల్ ఎఫెక్ట్స్ చేయలేను.. అందుకే సినిమాలు నిర్మిస్తున్నాను. దర్శకుడు కెమెరూన్‌తో కలిసి అవార్డును అందుకోవడం చాలా ఆనందంగా ఉంది’’ అని తెలిపాడు. అయితే అక్కడి నుంచి కెమెరూన్ – జోన్ లండౌల భాగస్వామ్యం కొనసాగింది.

దీంతో 2009లో వీరిద్దరి భాగస్వామ్యంలో ‘అవతార్’ మూవీ తెరకెక్కింది. ఒక సైన్స్ ఫిక్షన్ ఇతిహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సంచలనాత్మక 3డి టెక్నాలజీతో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా చూసి ప్రేక్షకులు పరవసించిపోయారు. దీంతో ఇది టైటానిక్ కలెక్షన్లను బద్దలు కొట్టింది. ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా మిగిలిపోయింది. ఇక గతేడాది ‘అవతార్’ ఫ్రాంచైజీలో రెండో పార్ట్ విడుదలై విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేసి అబ్బురపరచింది. ఈ ఫ్రాంచైజీలో మూడో పార్ట్ 2026లో, నాలుగో పార్ట్ 2030లో రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఇదివరకే వెల్లడించారు.

Tags

Related News

OG: బాబాయ్ కంటే ముందు ఓజీ క‌థ నేను విన్నా – వరుణ్ తేజ్

Jani Master: కొరియోగ్రాఫర్ జానీకి భారీ షాక్.. నేషనల్ అవార్డు రద్దు!

Srinu Vaitla : బ్రూస్ లీ డిజాస్టర్ సినిమా కాదు, ఆ సినిమా మంచి లాభాలను తీసుకువచ్చింది

Priyamani: ఇప్పటికీ టార్గెట్ చేస్తూ.. నరకం చూపిస్తున్నారు.. హీరోయిన్ ఎమోషనల్..!

OG Update: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఓజీ’ నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

Harudu Glimpse: కమ్ బ్యాక్ కోసం సిద్ధమయిన హీరో వెంకట్.. ‘హరుడు’ నుండి గ్లింప్స్ విడుదల

Posani: ఎన్ – కన్వెన్షన్ కూల్చడం కరెక్టే.. పోసాని షాకింగ్ కామెంట్..!

×