EPAPER

Hero Vida V1 Electric Scooters: మహిళలకు స్కూటర్ గిఫ్ట్‌గా ఇవ్వాలంటే ఇదే బెస్ట్.. ధర తక్కువ మైలేజ్ ఎక్కువ.. ఫీచర్లు మాత్రం ఎక్స్‌లెంట్..!

Hero Vida V1 Electric Scooters: మహిళలకు స్కూటర్ గిఫ్ట్‌గా ఇవ్వాలంటే ఇదే బెస్ట్.. ధర తక్కువ మైలేజ్ ఎక్కువ.. ఫీచర్లు మాత్రం ఎక్స్‌లెంట్..!

Hero Vida V1 Electric Scooters: ఒక మనిషి రోజువారి జీవన విధానంలో స్కూటర్ అనేది ఓ భాగం అయిపోయింది. చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు, ఇంటి పనులు చూసుకునే అమ్మాయిలు, పిల్లలను స్కూల్‌కు డ్రాప్ చేసే మహిళలు ఎక్కువగా ఈ స్కూటర్‌పైనే ఆసక్తి చూపిస్తున్నారు. బైక్‌లపై పురుషులకు ఎంతటి ఆసక్తి ఉంటుందో.. అలాంటి ఆసక్తే మహిళలకు స్కూటర్లపై ఉంది. అంతేకాకుండా బైకులతో పోలిస్తే స్కూటర్లు గేర్‌లెస్ కావడంతో ఎక్కువగా వీటిపైనే మొగ్గు చూపుతున్నారు. అందువల్లనే స్కూటర్ల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుంది.


ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలు సైతం స్కూటర్ల పై ఆసక్తి చూపించే వారికోసం కొత్త కొత్త ఫీచర్లను అందిస్తూ ఆకట్టుకుంటున్నాయి. అందులో ముఖ్యంగా హీరో విడా వి1 ఎలక్ట్రిక్ స్కూటర్ ముందువరుసలో ఉంది. ఈ హీరో విడా లైనప్‌లో మొత్తం రెండు వేరియంట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అందులో హీరో విడా వి1 ప్లస్ ఒకటి కాగా.. మరొకటి విడా వి1 ప్రో వంటి మోడల్స్ ఉన్నాయి. ఈ రెండు వేరియంట్లు వాహన ప్రియుల్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి.

ఇందులో భాగంగానే వీటి ధర, ఫీచర్లు, మైలేజ్ వంటి విషయాల గురించి మాట్లాడితే.. ముందుగా విడా వి1 ప్లస్ వేరియంట్‌లో 3.44 కిలో వాట్ల బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఈ బ్యాటరీకి ఒక్కసారి ఫుల్‌గా ఛార్జింగ్ పెడితే దాదాపు 100 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఇక మరో వేరియంట్ విడా వి1 ప్రో విషయానికొస్తే.. ఇందులో 3.94 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఈ బ్యాటరీకి ఒక్కసారి ఫుల్‌గా ఛార్జింగ్ పెడితే దాదాపు 110 కి.మీ మైలేజీని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.


Also Read: హీరో విడా వి1 ప్లస్ స్కూటర్ లాంచ్.. తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లు

అయితే ఈ రెండు మోడళ్లు 6 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉన్నాయి. అలాగే ఇవి గంటకు 80 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి. ఈ స్కూటర్లు సుమారు 125 కిలోల బరువును కలిగి ఉంటాయి. ఈ రెండు వేరియంట్లలో ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్, ఎల్‌ఈడీ లైటింగ్, టర్న్ బై టర్న్ నావిగేషన్‌తో సహా మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

అంతేకాకుండా ఇవి నాలుగు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉన్నాయి. అందులో ఎకో మోడ్, రైడ్ మోడ్, స్పోర్ట్ మోడ్, కస్టమ్‌ మోడ్ వంటివి ఉన్నాయి. అలాగే ఈ విడా స్కూటర్స్ మొత్తం ఆరెంజ్, వైట్, రెడ్, సియాన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. ఇందులో సేఫ్టీ కోసం డిస్క్, డ్రమ్ బ్రేకులను అందించారు. అంతేకాకుండా 12 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను ఈ మోడల్స్ కలిగి ఉన్నాయి. ఈ స్కూటర్ల ధర విషయానికొస్తే.. వీటి ధరలు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల ఎక్స్ షోరూమ్ మధ్యలో ఉన్నాయి. అందువల్ల మంచి ధరలో అదిరిపోయే ఫీచర్లు గల స్కూటర్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది చాలా బెటర్ అని చెప్పొచ్చు.

Tags

Related News

GST: ఎల్ఐసీ ప్రపంచంలోనే 10వ అతిపెద్ద సంస్థ… కానీ,…

సికింద్రాబాద్ నుంచి గోవాకు రైలు.. ఎంజాయ్ పండుగో, ఎప్పటి నుంచంటే..

Indian Railways: సినిమా టికెట్ల తరహాలోనే రైలులో మీకు నచ్చిన సీట్‌ను బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Washing meshine Usage : ఆఫర్లో వాషింగ్ మెషీన్‌ కొంటున్నారా.. దుస్తులే కాదు ఇవి కూడా ఎంచక్కా ఉతికేయొచ్చు!

Railway Employees Diwali Bonus| రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. రూ.2029 కోట్ల దీపావళి బోనస్!

VIKALP Yojana: పండుగల వేళ ఈజీగా రైలు టికెట్ పొందే VIKALP స్కీమ్ గురించి మీకు తెలుసా? ఇంతకీ ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే?

India’s Slowest Train: 46 కి.మీ దూరం.. 5 గంటల ప్రయాణం, ఈ రైలు ఎంత నెమ్మదిగా వెళ్లినా మీకు విసుగురాదు.. ఎందుకంటే?

×