EPAPER

USA Presidential Elections 2024: ఎన్నికల బరి నుంచి తప్పుకొనేదే లేదు..దేవుడు చెప్తే తప్పా..జో బైడెన్

USA Presidential Elections 2024: ఎన్నికల బరి నుంచి తప్పుకొనేదే లేదు..దేవుడు చెప్తే తప్పా..జో బైడెన్

Joe Biden Statement USA Presidential Elections: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ఆరోగ్యంపై వస్తున్న ఆరోపణలపై కొట్టివేశారు. నవంబర్ 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అధ్యక్ష రేసు నుంచి దేవుడు మాత్రమే నన్ను తప్పించగలడని ఏబీసీ నిర్వహించిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.


ఇటీవల రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన చర్చలో బైడెన్ తడబడిన సంగతి తెలిసిందే. మధ్య మధ్యలో ఆగి మాట్లాడడంతో ఆయన ఆరోగ్యంపై డెమొక్రాట్లలో తీవ్ర ఆందోళన నెలకొంది.దీనికి సమాధానంగా ఆ రోజు తాను అలసిపోయానని, అస్వస్థతకు గురయ్యానని బైడెన్ చెప్పుకొచ్చారు. అయితే ఈ చర్చ తర్వాత తనను పోటీ నుంచి తప్పుకోవాలని డెమోక్రటిక్ పార్టీ వారెవరూ అడగలేదని, అలా దేవుడు చెబితేనే తప్పుకుంటానని ప్రకటించాడు.

మరోవైపు బైడెన్ వైదొలగాలని డెమొక్రాట్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆయన తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అటు సర్వేల్లోనూ ఆయనకు ప్రజాదరణ పడిపోయింది. విరాళాలు ఇచ్చే దాతలు సైతం బైడెన్ తప్పుకుంటేనే తమ ఆర్థిక సహకారం కొనసాగుతుందని చెబుతున్నారు. ఒత్తిళ్లు పెరుగుతున్నా.. బైడెన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రపంచాన్ని నడిపిస్తున్నానని, అమెరికా అధ్యక్ష పదవికి తనకంటే మరెవరికీ యోగ్యత లేదన్నారు.


Also Read: బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయిన తెలంగాణ వాసులు

గత పాలనలో ఎన్నో విజయాలు సాధించానని బైడెన్ చెప్పుకొచ్చారు. ఈ విజయాలు ట్రంప్ తో గంటన్నర పాటు జరిపిన చర్చతో వమ్ము కావన్నారు. కోవిడ్ సమయంలో అమెరికాను గట్టెక్కించి ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలిపానని బైడెన్ తెలిపారు. ప్రస్తుతం నా అనారోగ్యంపై చర్చిస్తున్నారని.. కానీ కోటిన్నర కొత్త ఉద్యోగాలు సృస్టించడానికి తన వయసు అడ్డురాలేదన్నారు.

Tags

Related News

Continent Turns Green: అక్కడ మొక్కలు మొలిచాయంటే.. భూమి అంతమైనట్లే, శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది ఇదే!

Conflict: మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..?

Dominica Citizenship: ‘ఎవరైనా రావొచ్చు’.. తక్కువ ధరకే పౌరసత్వం విక్రయిస్తున్న దేశం ఇదే..

Elon Musk Brazil: బ్రెజిల్‌లో ట్విట్టర్ ఎక్స్ ఆగని కష్టాలు.. తప్పుడు బ్యాంకులో ఫైన్ చెల్లింపులు!

India’s Iron Dome: ఇండియాపై శత్రువులు మిసైల్ దాడి చేస్తే పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్ తరహా యాంటి మిసైల్ టెక్నాలజీ మన దగ్గర ఉందా?

Trump Advice To Israel: ‘ఇరాన్ అణు స్థావారాలపై వెంటనే దాడి చేయండి’.. ఇజ్రాయెల్ కు ట్రంప్ సలహా

Israel India Iran: ‘దాడి చేయవద్దని ఇండియా ద్వారా ఇరాన్‌కు ముందే హెచ్చరించాం’.. ఇజ్రాయెల్ అంబాసిడర్

×