EPAPER

TG TET: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకనుంచి ఏడాదికి రెండు సార్లు టెట్

TG TET: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకనుంచి ఏడాదికి రెండు సార్లు టెట్

TG TET: టెట్ అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇక నుంచి ఆరు నెలకు ఒక సారి టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. జూన్, డిసెంబర్ నెలల్లో పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది.


టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ ఏడాదికి రెండు సార్లు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రతి ఏడాది జూన్ నెలలో ఒకసారి, డిసెంబర్ లో మరోసారి టెట్ నిర్వహించనున్నారు. ఒక అభ్యర్థి ఎన్ని సార్లైనా టెట్ పరీక్ష రాయవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే టెట్ ఉత్తీర్ణత సాధించిన వారికే డీఎస్సీ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది, టెట్ మార్కుల ఆధారంగా డీఎస్సీలో వెయిటేజీ ఇస్తారు.

గతంలోనే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యకేషన్ ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించింది. అంతే కాకుండా టెట్ గడువును జీవిత కాలానికి పెంచింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఒక్క సారి క్వాలిఫై అయితే, మరో సారి టెట్ రాయాల్సిన అవసరం ఉండదు. టెట్ మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ ఉండటంతో.. ఇప్పటికే టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు తమ స్కోర్ పెంచుకునేందుకు టెట్ వ్రాయవచ్చు.


ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహించనుండగా 2015 డిసెంబరు 23న ఇచ్చిన జీవో నెంబర్ 36ను సవరణ చేస్తూ శనివారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో నెంబర్ 18 జారీ చేశారు. ఏటా ఒకసారి టెట్ నిర్వహిస్తామని 2015 లో జీవో 36 చేసినా ఇప్పటి వరకు ఐదు సార్లు మాత్రమే పరీక్ష నిర్వహించారు. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2016, 2017లో టెట్ నిర్వహించారు.

అనంతరం 2018లో ఒక్కసారి కూడా టెట్ పరీక్ష జరగలేదు మళ్లీ 2022, 2023, 2024లో వరుసగా టెట్ నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2011, 2012లో రెండుసార్లు 2014లో ఒకసారి టెట్ జరిగింది. కానీ ఇప్పటి నుంచి డీఎస్సీ నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తారు. టెట్ కు 90 రోజుల సమయం పట్టనుండగా అంతకుముందే నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు.

Also Read: మద్యం బాటిళ్లతో అడ్డంగా బుక్కైన ప్రిన్సిపల్‌

నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ గతంలోనే టెట్ పరీక్ష ఏటా రెండుసార్లు నిర్వహించాలని ఆదేశించింది కొత్తగా బీఈడీ, డీఈడీ వంటి కోర్సులను పూర్తి చేసిన వారు మాత్రమే టెట్ రాసేవారు ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు పేపర్ లో క్వాలిఫై కావాలన్న నిబంధన ఉంది. దీంతో టీచర్లు కూడా టైట్ పరీక్షకు పోటీ పడుతున్నారు. దీంతో టెట్ కు హాజరయ్యే వారి సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో టీచర్ల పదోన్నతులు పొందేవారికి ఎక్కువ సార్లు టెట్ రాసుకునే వెసులుబాటు కలగనుంది.

Tags

Related News

Man on Charminar: చార్మినార్‌ పైకి ఎక్కిన వ్యక్తి… స్టంట్స్ చేస్తున్నాడా..?

Jaggareddy: నువ్వు ఢిల్లీ వెళ్లు… నేను మీ మామ ఫాం హౌస్‌ కు వెళ్తా.. హరీష్ రావుకు జగ్గారెడ్డి సవాల్

Cm Revanth: రూ.1500 కోట్లు ఉన్నాయి కదా.. పేదలకు రూ.500 కోట్లు ఇవ్వండి.. బీఆర్ఎస్‌కు సీఎం సెటైర్

KTR Reaction: గబ్బు మాటలు మాట్లాడుతున్నారని కోర్టులో పరువు నష్టం దావా వేశా: కేటీఆర్

Nukala Naresh Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత నరేష్‌రెడ్డి ఇక లేరు

Madhavaram Krishna Rao: కేసీఆర్ కి బిగ్ షాక్.. మూసీ ప్రక్షాళనలో రేవంత్ రెడ్డికి సపోర్ట్‌గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Hyderabad City: హైదరాబాద్ సిటీ ఇకపై నాలుగు కార్పొరేషన్లు, రేవంత్ సర్కార్ ప్లాన్

Big Stories

×