మెగ్నీషియం లోపమా.. ఈ ఆహారాలు తింటే చాలు

కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదన్న సందేహం అందరికీ ఉంటుంది.

మోతాదుకు మించి తీసుకోకూడదు. కానీ రోజుకో కప్పు కాఫీ మెగ్నీషియం లోపాన్ని తగ్గిస్తుంది.

శరీరం ఫిట్ గా ఉండాలంటే.. మెగీషియం ఉండాలి.

మెగ్నీషియం లోపముంటే.. ఆకలి వేయదు. వికారం, వాంతులు వస్తాయి.

హార్ట్ బీట్ లో హెచ్చుతగ్గులతో పాటు కండరాలనొప్పి, కళ్లు మసకగా కనిపించడం వంటి లక్షణాలుంటాయి.

ఆకుకూరలు, అవకాడో, అరటిపండు, రాస్ బెర్రీ, ఫిగ్స్ వంటి పండ్లను తినాలి.

బ్రోకలీ, క్యాబేజీ, పచ్చి బఠానీలు, మొలకల్లో కూడా మెగ్నీషియం బాగా ఉంటుంది.

బ్రౌన్ రైస్, ఓట్స్, సీ ఫుడ్స్‌లో మెగ్నీషియం లభిస్తుంది.

సబ్జా గింజలు, ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా-3 కొవ్వు, ఆమ్లాలతో కూడిన ఆహారాలు మెగ్నీషియం లోపాన్ని నివారిస్తాయి.

ఒక కప్పు కాఫీ.. లేదా డార్క్ చాక్లెట్ మెగ్నీషియం లోపాన్ని తగ్గిస్తాయి.