EPAPER

Next Week Launching Mobiles: స్మార్ట్‌ఫోన్ల జాతర.. వచ్చేవారం లాంచ్ కానున్న ఫోన్ల లిస్ట్ ఇదే.. మొత్తం ఎన్నంటే..?

Next Week Launching Mobiles: స్మార్ట్‌ఫోన్ల జాతర.. వచ్చేవారం లాంచ్ కానున్న ఫోన్ల లిస్ట్ ఇదే.. మొత్తం ఎన్నంటే..?

Upcoming Phones Launching Next Week: వచ్చే వారం పలు స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు తమ ఫోన్లను రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. కనీసం 7 స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ కానున్నాయి. CMF, Samsung, Redmi, Tecno, Motorola, Oppo వంటి బ్రాండ్‌ల నుంచి వేర్వేరు ధరల విభాగాలలో వచ్చే వారం లాంచ్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


Nothing Sub Brand CMF Phone 1

భారతదేశంలో వచ్చే వారం లాంచ్‌ కాబోతున్న కొత్త ఫోన్లలో CMF Phone 1 ఒకటి. నథింగ్ సబ్-బ్రాండ్ CMF మొదటి ఫోన్ జూలై 8న లాంచ్ కాబోతుంది. ఇది 6.7 అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP డ్యూయల్-రియర్ కెమెరా సిస్టమ్, Dimensity 7300 SoC ప్రాసెసర్‌తో వస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 5000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.20,000 ధర లోపు వచ్చే అవకాశం ఉంది


Redmi 13 5G

Redmi 13 5G స్మార్ట్‌ఫోన్ జూలై 9న గ్రాండ్ లెవెల్లో లాంచ్ కానుంది. Redmi 13 5G అనేది Redmi 12 5Gకి అప్‌గ్రేడ్ వెర్షన్. కాగా ఈ ఫోన్ 6.79-అంగుళాల 120Hz డిస్‌ప్లే, 108MP డ్యూయల్-రియర్ కెమెరా సిస్టమ్, స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 AE ప్రాసెసర్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఇందులో అతి పెద్ద బ్యాటరీ ఉంటుందని అంటున్నారు. అలాగే ఈ ఫోన్ దాదాపు రూ.12,000 ధరతో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read: అల్లాడించే మ్యాజిక్ ఫోన్.. డీప్‌ఫేక్ డిటెక్షన్ టెక్నాలజీతో హానర్ వచ్చేస్తుంది.. ఇక సూస్కో మావా!

Tecno Spark 20 Pro 5G

Tecno Spark 20 Pro 5G జూలై 9న భారతదేశంలో విడుదల కానుంది. అయితే ఈ ఫోన్ గురించి పెద్దగా వివరాలు ఇంకా తెలియలేదు. కానీ అంచనా ప్రకారం.. ఈ ఫోన్ 16GB RAM + 256GB స్టోరేజ్‌తో వస్తుందని భావిస్తున్నారు. దీని బేస్ వేరియంట్ రూ. 12,000లోపు ధర కలిగి ఉంటుందని అంటున్నారు. ఇది పెద్ద డిస్‌ప్లే, 108MP ప్రధాన కెమెరాను కలిగి ఉన్నట్లు సమాచారం.

Samsung Galaxy Z Fold 6

వచ్చే వారం విడుదలవుతున్న ప్రధానమైన స్మార్ట్‌ఫోన్లలో Galaxy Z Fold 6 ఒకటి. ఈ ఫోల్డబుల్ ఫోన్ జూలై 10న లాంచ్ కానుంది. ఇది 7.6-అంగుళాల 120Hz మెయిన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 6.3-అంగుళాల 120Hz కవర్ స్క్రీన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్ శక్తినిస్తుంది. ఇది ట్రిపుల్-రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.

Samsung Galaxy Z Flip 6

Galaxy Z Flip 6 జూలై 10న అన్‌ప్యాక్ చేయబడిన Galaxy Z Fold 6తో లాంచ్ అవుతుంది. ఈ మొబైల్ 6.6 అంగుళాల 120Hz ప్రధాన డిస్‌ప్లే, 3.4 అంగుళాల 120Hz కవర్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. 4000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది 50MP డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ని కలిగి ఉండే అవకాశం ఉంది.

Motorola G85

Also Read: సంచలన ఆఫర్.. రియల్‌మీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఇంకా చాలా ఉన్నాయి!

మోటోరోలో కంపెనీ మార్కెట్‌లో తన హవా చూపిస్తోంది. వరుసగా ఫోన్లను రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటుంది. వచ్చే వారం అంటే జూలై 10న కంపెనీ Motorola G85 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తుంది. ఇది 6.67-అంగుళాల 120Hz p-OLED డిస్ప్లే, 50MP డ్యూయల్ కెమెరాలు, స్నాప్‌డ్రాగన్ 6s Gen 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఇది 33W ఫస్ట్ చార్టింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది. దీని ధర సుమారు రూ.20,000 ఉండవచ్చని అంచనా.

Oppo Reno 12 5G series

Reno 12 5G సిరీస్‌లో Reno 12 5G, Reno 12 Pro 5G వంటి మోడల్స్ ఉన్నాయి. ఈ రెండూ 120Hz రిఫ్రెష్ రేట్‌తో పెద్ద AMOLED స్క్రీన్‌లను కలిగి ఉంటాయి. డైమెన్సిటీ 7300-ఎనర్జీ SoC ద్వారా శక్తిని పొందుతుంది. ప్రో మోడల్‌లో OISతో సోనీ LYT-600 ప్రధాన లెన్స్‌ను కలిగి ఉంటుంది. రెండింటిలోనూ సూపర్ VOOC ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది.

Tags

Related News

Google Storage : గూగుల్‌ స్టోరేజీ నిండిపోయిందా? – ఇలా చేస్తే డబ్బులు కట్టకుండానే స్టోరేజీ పెంచుకోవచ్చు!

Oppo : రియల్ మీ, సామ్ సాంగ్, వివోలను వెనక్కి నెట్టేసిన ఒప్పో..

Linkedin Jobs : డ్రీమ్ జాబ్​ కోసం ఎదురుచూస్తున్నారా? – ​ లింక్డ్ ఇన్ ప్రొఫైల్​లో ఇలా చేస్తే చాలు!

Oura Ring 4 : స్మార్ట్‌ రింగారే – 6 రంగులతో 12 సైజుల్లో… తక్కువ ధరకే, సూపర్ ఫీచర్స్​తో!

Disable Slow Charging : అయ్యో.. స్మార్ట్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ సరిగ్గా ఎక్కట్లేదా!

Whats app Videocall update : వాట్సాప్ లో ఇకపై మరింత గోప్యత.. ఆ అప్డేట్ తెచ్చేసిన మెటా

Apple Festival Sale 2024 : అదిరిపోయే డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్స్ తో ఆపిల్ సేల్ ప్రారంభం.. ఆఫర్స్ ఎలా ఉన్నాయంటే!

Big Stories

×