EPAPER

Alcaraz beat Tiafoe: వింబుల్డన్ టోర్నీ, చెమటోడ్చిన డిఫెండింగ్ ఛాంపియన్ అల్కరాస్

Alcaraz beat Tiafoe: వింబుల్డన్ టోర్నీ, చెమటోడ్చిన డిఫెండింగ్ ఛాంపియన్ అల్కరాస్

Alcaraz beat Tiafoe: వింబుల్డన్‌ టోర్నమెంటులో పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. సీనియర్లకు జూనియర్లు ఝలక్ ఇచ్చిన సందర్భాలు లేకపోలేదు. తాజాగా పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాస్ మూడో రౌండ్‌లో చెమటోడ్చి నెగ్గాడు. దాదాపు ఐదు సెట్ల వరకు మ్యాచ్ సాగడం ఈ టోర్నీలో ఇదే తొలిసారి.


వింబుల్డన్ ఢిపెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాస్‌ మూడో రౌండ్‌లో అతి కష్టంమీద గెలిచాడు. అమెరికా కు చెందిన టియోఫోతో మ్యాచ్‌ జరిగింది. ఇరువురు ఆటగాళ్లు కొదమసింహాల మాదిరిగా తలపడ్డారు. మ్యాచ్ మొదలు ప్రతీ సెట్ ఇరువురు ఆటగాళ్ల మధ్య దోబూచిలాడింది. దాదాపు గంటలపాటు మ్యాచ్ సాగడం విశేషం. చివరకు అల్కరాస్ ముందు టియోఫో చివరి సెట్‌లో తలవంచాడు. కాకపోతే కండరాలు పట్టేయడం వంటి సమస్య అమెరికా ఆటగాడ్ని వెంటాడింది.

తొలిసెట్ టైబ్రేక్‌లో గెలుచుకున్న టియోఫో, రెండోసెట్‌ను అల్కరాస్‌కు అప్పగించాడు. మూడో సెట్‌ను అతి కష్టం మీద గెలుచుకున్నాడు అమెరికా ఆటగాడు. నాలుగో సెట్ గెలిస్తే సరిపోయేది. ఆ మ్యాచ్ టై బ్రేక్ దారి తీసింది. అందులో అల్కరాస్ తన అస్త్రాలను ప్రయోగించాడు. బలమైన ఏస్‌లు సంధించాడు.


దీంతో ఫస్టాప్ అంతా అల్కరాస్‌దే పైచేయి అయ్యింది. మెల్లగా టియోఫో పుంజుకున్నప్పటికీ.. అల్కరాస్ సెట్‌ను కైవసం చేసుకున్నాడు. అదే సమయంలో అమెరికా ఆటగాడి తొడ కండరాలు పట్టేసింది. ఇక ఫైనల్ సెట్‌లో అల్కరాస్‌కు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయాడు. కాకపోతే బలమైన ఏస్‌లు టియోఫో సంధించినట్లయితే మ్యాచ్ మరో విధంగా ఉండేది. వీరి మ్యాచ్ అభిమానులకు మంచి ఆనందాన్ని కలిగించింది.

ALSO READ: తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం

ఇక మహిళల సింగిల్స్ విభాగంలో స్పెయిన్ అమ్మాయి పౌలాబదోసా నాలుగో రౌండ్ లో అడుగుపెట్టింది. మూడో రౌండ్‌లో అన్ సీడెడ్ బదోసా, రష్యాకు చెందిన 14వ సీడ్ క్రీడాకారిణి కసత్‌కీనా‌ని ఖంగు తినిపించింది. తొలి సెట్ నుంచి వీరిద్దరు తలపడ్డారు. ఎవరి సర్వీస్‌లను వాళ్లు గెలుచుకోవడంతో తొలి సెట్ టై బ్రేక్ కు దారి తీసింది. అందులో పైచేయి సాధించింది బదోసా. సెకండ్‌లో కాస్త ధీమాగా ఆడింది. దీంతో మూడో సెట్‌కి దారితీసింది. ఇందులో బదోసా విజృభించింది. కీలక సమయంలో బ్రేక్ సాధించి విజయాన్ని సొంతం చేసుకుంది.

 

Tags

Related News

Ind vs Ban: హైదరాబాద్‌లో భారత్-బంగ్లాదేశ్‌ మ్యాచ్.. నేటి నుంచి టికెట్ల విక్రయం

Ms Dhoni: RCBపై కోపంతో ధోనీ… TV పగలగొట్టేశాడు..క్లారిటీ ఇదే?

Rashid Khan: పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్‌..ఒకే రోజూ 4 గురికి !

T20 World Cup: నేడు మహిళా టీ20 ప్రపంచకప్‌లో ఇండియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌

Telangana BIG TV Cricket League : తమన్ ఊచకోత.. 34 బంతుల్లో సెంచరీ

Babar Azam: ప్రమాదంలో పాకిస్థాన్‌ టీం..బాబర్ ఆజం వార‌సుడు వచ్చేస్తున్నాడు..?

Azharuddin: HCAలో భారీ అక్రమాలు..అజారుద్దీన్‌కు ఈడీ నోటీసులు !

Big Stories

×