EPAPER

Who is Keir Starmer: బ్రిటన్ కొత్త ప్రధాని.. ఎవరీ కైర్ స్టార్మర్?

Who is Keir Starmer: బ్రిటన్ కొత్త ప్రధాని.. ఎవరీ కైర్ స్టార్మర్?

Britain New Prime Minister Keir Starmer(Current news in World): అధికారం కోసం చాలా సంవత్సరాలు వేచి చూసిన లేబర్ పార్టీకి ఫైనల్‌గా పవర్ దక్కింది. అయితే, ఇది అంత సులువుగా ఏమీ రాలేదు. కన్జర్వేటీవ్ పార్టీ వైఫల్యాలతో పాటు సొంత పార్టీని గాడిలో పెట్టడానికి స్టార్మర్ పడ్డ శ్రమ కూడా చాలానే ఉంది. అయితే, దీని కోసం స్టార్మర్ ఏం చేశారు..? అధికారమైతే దక్కింది కానీ.. లేబర్ పార్టీ ముందున్న సవాళ్ల మాటేంటీ..?


బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ ప్రారంభానికి ముందు, కీర్ స్టార్మర్ నాలుగున్నర సంవత్సరాల లేబర్ పార్టీ నాయకుడిగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కున్నారు. అప్పట్లో ఆ పార్టీ 100 ఏళ్ల చరిత్రలో ఘోర పరాజయాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈస్ట్ మిడ్‌ల్యాండ్స్‌లో చివరి ప్రచార ర్యాలీకి ముందు విలేకరులతో మాట్లాడుతూ “ఈ పార్టీని సరిదిద్దడానికి, అధికారాన్ని తిరిగి పొందడానికి 10 సంవత్సరాలు పడుతుందని కొందరు అన్నారనీ.. మీరు ఈ పార్టీని ఎప్పటికీ గట్టెక్కించలేరనీ కొందరు వెక్కిరించారనీ.. అయితే, మళ్లీ ప్రభుత్వంలోకి వస్తున్నామనే సంకేతాల మధ్య లేబర్ పార్టీ భారీ విజయం అంచుల్లో ఉందని” చెప్పారు. నిజానికి, 1997లో టోనీ బ్లెయిర్ న్యూ లేబర్ ల్యాండ్‌స్లైడ్ విక్టరీ తర్వాత… బ్రిటన్ పార్లమెంట్‌లో అతిపెద్ద మెజారిటీ కోసం లేబర్ పార్టీని విజయపథంలో నడిపిన ఏకైక వ్యక్తి స్టార్మర్‌ అని విశ్లేషకులు చెబుతున్నారు.

2020లో కరడుగట్టిన లెఫ్ట్ లేబర్ నాయకుడు జెరెమీ కార్బిన్ నుండి బాధ్యతలు స్వీకరించినప్పుడు యూకేలోని ఊహాజనిత ప్రధాన మంత్రిగా తన అవకాశాల అంచనాలను స్టార్మర్ అధిగమించేశారు. ఎలాగూ యూకే రాజకీయ పరిస్థితులు కొంతవరకూ ప్రతిపక్షానికి అనుకూలంగా ఉండటంతో ఈ విజయం మరింత సులువయ్యింది. బోరిస్ జాన్సన్ “పార్టీగేట్” కుంభకోణం, లిజ్ ట్రస్ “మినీ-బడ్జెట్” మరింత ఊపునిచ్చింది. బ్రిటీష్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఆశించిన ఫలితానికి అన్ని అంశాలూ సహకరించాయి. కానీ స్టార్మర్ తన పార్టీని ప్రక్షాళన చేయడంలో, కార్బిన్‌ను స్వయంగా బహిష్కరించడంలో, మళ్లీ గెలిచి పాలించే స్థితికి తీసుకురావడంలో మౌనంగా భారీ పోరాటాన్ని చేశారు.


హౌస్ ఆఫ్ కామన్స్‌లో పార్టీ కీలకమైన 326 సీట్ల థ్రెషోల్డ్‌ను దాటిన తర్వాత “ఇది మంచి అనుభూతి, నేను నిజాయితీగా ఉండాలి” అని స్టార్మర్ లండన్‌లోని లేబర్ మద్దతుదారులతో అన్నారు.”సర్ కీర్” అని ముద్దుపేరున్న స్టార్మర్ రాజకీయాల్లోకి రాకముందు న్యాయవాద వృత్తిలో కూడా గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఎన్నికల ప్రచారం అంతటా ఓటర్లను ఆకర్షించడానికి చాలా కష్టపడ్డారు. సాధారణ కుటుంబ నేపథ్యంలో ఎదిగిన స్టార్మర్ తండ్రి.. ఒక టూల్ మేకర్. అనారోగ్యంతో నర్సు ఉద్యోగం వదిలేసిన తల్లికి పుట్టిన నలుగురు పిల్లలలో ఒకడు. బిల్లు చెల్లించకపోవడం వల్ల ఇంట్లో ఫోన్ కట్ అయిన పరిస్థితులను కూడా స్టార్మర్ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు. “జీవితాలను తీర్చిదిద్దడం ఎంత కష్టమో” తనకు తెలుసునంటూ లేబర్ పార్టీ అభిమానులతో పాటు జీవన సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న బ్రిటన్ ప్రజలను భారీగా ఆకర్షించారు.

Also Read: బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతిదే హవా.. మొత్తం ఎంతమంది గెలిచారంటే..?

1980ల చివరలో లండన్‌లో యువకుడిగా, స్టార్మర్ వామపక్ష సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. రాడికల్ గ్రంథాలను వ్రాసేవాడు. తర్వాత, మానవ హక్కుల న్యాయవాదిగా ఎంతో ఎత్తుకు ఎదిగారు.
ఫాస్ట్ ఫుడ్ చైన్‌ను విమర్శిస్తూ కరపత్రాలను పంపిణీ చేసినందుకు మెక్‌డొనాల్డ్స్ నుండి పరువునష్టం దావా వేసిన హెలెన్ స్టీల్, డేవిడ్ మోరిస్ అనే ఇద్దరు కార్యకర్తలను సమర్థించిన తర్వాత స్టార్మర్ బ్రిటన్‌లో పాపులర్ అయ్యారు. తన 40 ఏళ్ల వయసులో 2002లో క్వీన్స్ కౌన్సెల్‌గా నియమించబడ్డారు. ఈ తర్వాత సంవత్సరం, ఉత్తర ఐర్లాండ్‌లోని పోలీసింగ్ బోర్డుకు మానవ హక్కుల సలహాదారుగా ఉన్నారు. 2008 నుండి 2013 వరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ అయ్యారు. ఈ పాత్ర యూకేలో క్రిమినల్ న్యాయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించింది.

దీనికి ముందు, స్టార్మర్ తనను తాను బయటి నుండి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తిగా భావించేవాడు. అయితే, మార్పు కోసం వ్యవస్థ లోపల ఉండి పనిచేయడం స్టార్మర్‌కు మొదటి అనుభవం. తర్వాత, ఈ కొత్త మార్గం చాలా ప్రభావవంతంగా ఉందని స్టార్మర్ గుర్తించారు. అది అతన్ని బ్రిటన్ ప్రధానిగా నిలబెట్టింది. రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వత స్టార్మర్ మొదటి ఓటమి నుండి ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కున్నారు. 2020లో స్టార్మర్‌కు అవకాశం వచ్చింది. స్టార్మర్ లేబర్ సభ్యులకు 10 హామీలతో ప్రచారాన్ని నిర్వహించి, గెలిచారు. ముఖ్యంగా కార్బైనైట్ ఎజెండాలో పునరుద్ధరణ, రైలు, మెయిల్, విద్యుత్తు, నీరు వంటి వాగ్దానాలతో కూడిన కీలక హామీలు అతన్ని రాజకీయంగా నిలబెట్టాయి. లేబర్ పార్టీ నాయకత్వాన్ని తీసుకున్న తర్వాత పార్టీని భ్రష్టుపట్టించిన కార్బిన్‌ను పార్టీ నుండి బహిష్కరించాడు.

తప్పనిసరి సెమిటిజం శిక్షణను ప్రవేశపెట్టాడు. తన నాయకత్వానికి విధేయత చూపించే అభ్యర్థులను మాత్రమే ప్రోత్సహించారు. వ్యక్తిగతంగానూ, పార్టీలోనూ కఠినమైన ఆర్థిక క్రమశిక్షణను అమలు చేశారు. దాదాపుగా తాను చేసిన అసలు నాయకత్వ వాగ్దానాలన్నింటినీ వదిలిపెట్టారు. ఇటీవల, స్టార్మర్ తన పార్టీలోని అగ్ర నేతల నుండి బహిరంగ విభేదాలను కూడా ఎదుర్కున్నారు. గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై సంవత్సరానికి $36 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తానని తన పార్టీ వాగ్దానాన్ని వదులుకోవాలా వద్దా అనే దానిపై, మల్లగుల్లాలు పడ్డారు. ఇది పెద్ద విమర్శలకు దారితీసింది. అలాగే, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై మాట్లాడుతూ… గాజాకు విద్యుత్, నీటిని నిలిపివేయడానికి ఇజ్రాయెల్‌కు హక్కు ఉందని చెప్పారు. అది తీవ్రమైన విమర్వలకు దారితీయడంతో ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు.

Also Read: జోబైడెన్ కీలక వ్యాఖ్యలు.. ‘నిద్ర సరిపోతలేదు.. అందుకే నేను..’

స్టార్మర్ చుట్టూ ఉన్న సలహాదారుల బృందం “పిల్లల క్లబ్” అంటూ ప్రత్యర్థులు హేళన చేశారు. అయితే… కేవలం నాలుగున్నర సంవత్సరాల క్రితం నాయకుడిగా నిలబడిన వ్యక్తి ఏం చేయగలడని అసమ్మతి నుండి విమర్శలు వస్తున్న తరుణంలో “నేను నా పార్టీ మారాను. ఇప్పుడు దేశాన్ని మార్చాలనుకుంటున్నాను” అంటూ స్థిరంగా నిలబడ్డారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ గెలిచింది. స్టార్మర్ ప్రధానిగా గద్దెనెక్కారు. అయినప్పటికీ పార్టీలో పెద్దగా ఉత్సాహం లేవనే అభిప్రాయాలు ఉన్నాయి. దేశం దారుణమైన సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో స్టార్మర్ అధికారాన్ని చేపట్టారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యునైటెడ్ కింగ్‌డమ్‌లో పన్ను భారాలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. దేశ నికర రుణం, వార్షిక ఆర్థిక ఉత్పత్తికి దాదాపు సమానంగా ఉంది.

ఇప్పుడు దేశానికి ఎలాంటి సేవింగ్స్ లేకపోవడం సమస్యలకు కారణం అవుతుంది. జీవన ప్రమాణాలు క్షీణించాయి, ప్రజాసేవలు ఒత్తిడికి గురవుతున్నాయి. ముఖ్యంగా ప్రతిష్టాత్మకమైన జాతీయ ఆరోగ్య సేవలు సమ్మేల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో.. స్టార్మర్ ఇప్పటికే లేబర్ పార్టీ ప్రతిపాదించిన , ప్రధాన గ్రీన్ ఇన్వేస్ట్‌మెంట్ హామీల వంటి కొన్ని కీలక ప్రణాళికలను తగ్గించాల్సి వచ్చింది. అయితే, శ్రామికుల కోసం మాత్రం పన్నులు పెంచమంటూ స్టార్మర్ వాగ్దానం చేసారు. ఇక, స్టార్మర్ బ్రెగ్జిట్ నుండి తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి యూరోపియన్ యూనియన్‌తో సంబంధాలను మెరుగుపరుచుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎలా చూసుకున్నా.. ఈ ఎన్నికల విజయం అటు స్టార్మర్‌కు, ఇటు లేబర్‌ పార్టీకి గొప్ప మలుపునే చెప్పాలి.

 

Tags

Related News

Israel India Iran: ‘దాడి చేయవద్దని ఇండియా ద్వారా ఇరాన్‌కు ముందే హెచ్చరించాం’.. ఇజ్రాయెల్ అంబాసిడర్

Indonesia Pleasure Marriages: వ్యభిచారానికి మారుపేరుగా టెంపరరీ పెళ్లిళు.. ఇండోనేషియాలో కొత్త బిబినెస్

Israel-Iran Impact on India: ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో భారత్ కు నష్టాలు.. అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం

World War II Bomb Japan: ఇప్పుడు పేలిన ప్రపంచ యుద్ధం బాంబు.. జపాన్ ఎయిర్‌పోర్టు మూసివేత!

Israel Iran War: ‘నెతన్యాహు ఒక హిట్లర్.. యద్ధం ఆపేందుకు ఇండియా సాయం చేయగలదు’.. ఇరాన్ రాయబారి కీలక వ్యాఖ్యలు

Iran Israel Attack: యుద్ధం మొదలైంది.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం

New Zealand: న్యూజిలాండ్‌ను వీడుతున్న ప్రజలు.. అదోగతిలో అందాల దీవి, అసలు ఏమైంది?

Big Stories

×