EPAPER

26 Indian-origin candidates Won in UK: బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతిదే హవా.. మొత్తం ఎంతమంది గెలిచారంటే..?

26 Indian-origin candidates Won in UK: బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతిదే హవా.. మొత్తం ఎంతమంది గెలిచారంటే..?

Indian-origin candidates Won in 2024 UK general elections: బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో భారత సంతతి హవా కొనసాగింది. భారత మూలాలున్న 26 మంది అభ్యర్థులు అక్కడి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించిన భారత సంతతి అభ్యర్థుల్లో రిషి సునాక్ ముందున్నారు. రిచ్ మండ్ అండ్ నార్తర్న్ అలర్టన్ స్థానం నుంచి రిషి మరోసారి గెలుపొందారు. మాజీ హోంమంత్రులు ప్రీతి పటేల్, సుయెల్లా బ్రేవర్మన్ లు కూడా గెలుపొందారు.


భారత సంతతికి చెందిన క్లెయిర్ కౌటిన్హో సైతం ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. సౌత్‌వెస్ట్ హెర్ట్‌ఫోర్డ్ షైర్ స్థానం నుంచి కన్జర్వేటివ్ నేత గగన్ మొహీంద్ర, లైసెస్టర్ ఈస్ట్ నుంచి శివాని రాజా విజయ దుందుబి మోగించారు. లేబర్ పార్టీకి చెందిన రాజేశ్ అగర్వాల్ పై శివాని గెలుపొందారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన శైలేష్ వారా, మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేసిన అమీత్ జోగియాలు స్వల్ప తేడాతో ఓటమిని చవిచూశారు.

లేబర్ పార్టీ నుంచే ఎక్కువ మంది..


లేబర్ పార్టీ నుంచే భారత సంతతి అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో బ్రిటన్ పార్లమెటులో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. వీరిలో వాల్‌సాల్ నియోజకవర్గం నుంచి సీమా మల్హోత్రా, బ్లోక్స్‌విచ్ నుంచి వాలెరీ వాజ్.. ఆమె సోది కీత్ వాజ్, విగాన్ స్థానం నుంచి లీసా నాండీలు భారీ మెజార్టీతో విజయం సాధించారు. బ్రిటిష్ సిక్కు ఎంపీలు ప్రీత్ కౌర్ గిల్, తన్‌మంజిత్ సింగ్ ధేహిలు కూడా మరోసారి గెలుపొందారు. రదిమా విటోమ్, నావెందు మిశ్రాలు లేబర్ పార్టీ నుంచి భారీ మెజార్టీతో తమ స్థానాను పదిలపరుచుకోగలిగారు.

మొదటిసారిగా బ్రిటన్ పార్లమెంటుకు..

బాగీ శంకర్, సత్వీర్ కౌర్, జాస్ అథ్వాల్, హర్ ప్రీత్ ఉప్పల్, వారిందర్ జస్, కనిష్క నారాయణ్, సోనియా కుమార్, గురిందర్ జోసన్, కిరిత్ ఎంట్ విజిల్, సురీనా బ్రాకెన్ బ్రిడ్జ్, సోజాన్ జోసెఫ్, జీవన్ సంధేర్ లు తొలిసారిగా బ్రిటన్ పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు. లేబర్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందిన వీరంతా కూడా భారత సంతతికి చెందినవారే కావడం గమనార్హం. వీరితోపాటు లిబరల్ డెమోక్రాట్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన మునిరా విల్సన్ కూడా మరోసారి బ్రిటన్ పార్లమెంటుకు వెళ్లబోతున్నారు.

Also Read: జోబైడెన్ కీలక వ్యాఖ్యలు.. ‘నిద్ర సరిపోతలేదు.. అందుకే నేను..’

అయితే, ఇంగ్లాండ్, నార్తర్న్ ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ వ్యాప్తంగా మొత్తం 650 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. బ్రిటన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజార్టీ మార్కు 326 సీట్లు. కాగా, లేబర్ పార్టీ ఏకంగా 410 స్థానాలను కైవసం చేసేకుంది. కన్జర్వేటివ్ పార్టీ కేవలం 118 చోట్ల మాత్రమే విజయం సాధించింది. రిషి సునాక్ విజయం సాధించగా.. గతంలో ప్రధానిగా పనిచేసిన లిజ్ ట్రస్ ఈ ఎన్నికల్లో ఓటమిని చవి చూశారు.

Related News

Elon Musk: ట్రంప్ ర్యాలీలో మస్క్ మామ డ్యాన్స్.. ఇలా తయారయ్యావేంటి సామి

Continent Turns Green: అక్కడ మొక్కలు మొలిచాయంటే.. భూమి అంతమైనట్లే, శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది ఇదే!

Conflict: మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..?

Dominica Citizenship: ‘ఎవరైనా రావొచ్చు’.. తక్కువ ధరకే పౌరసత్వం విక్రయిస్తున్న దేశం ఇదే..

Elon Musk Brazil: బ్రెజిల్‌లో ట్విట్టర్ ఎక్స్ ఆగని కష్టాలు.. తప్పుడు బ్యాంకులో ఫైన్ చెల్లింపులు!

India’s Iron Dome: ఇండియాపై శత్రువులు మిసైల్ దాడి చేస్తే పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్ తరహా యాంటి మిసైల్ టెక్నాలజీ మన దగ్గర ఉందా?

Trump Advice To Israel: ‘ఇరాన్ అణు స్థావారాలపై వెంటనే దాడి చేయండి’.. ఇజ్రాయెల్ కు ట్రంప్ సలహా

×