ఆరోగ్య ప్రయోజనాలను అందించే హెల్దీ డ్రింక్స్ లో బార్లీ నీళ్లు కూడా ఒకటి.

బార్లీలో తేలికగా జీర్ణమయ్యే బీటా గ్లూకాన్ అనే ఫైబర్ ఉంటుంది.

యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి.

పరగడుపునే బార్లీ నీళ్లు తాగితే.. బ్లడ్ లో చక్కెరను నిరోధిస్తుంది.

కీళ్లనొప్పులు, గౌట్ వంటి ఇన్ఫ్లమేటరీ వ్యాధుల్ని దూరం చేస్తుంది.

మలబద్ధకం, అపానవాయువు వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

గుండె సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది.

బార్లీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి.

క్యాన్సర్, గుండె సమస్యలు, నరాల సమస్యలను దరిచేరనీయవు.

బార్లీలో కేలరీలు తక్కువ. కాబట్టి అధిక బరువు కూడా తేలికగా తగ్గుతారు.

రాత్రిపూట నీటిలో బార్లీని నానబెట్టి.. ఉదయాన్నే అందులో నీరు కలిపి 10 నిమిషాలు ఉడికించుకోవాలి.

ఆ గింజల్ని తినడం ఇష్టంలేనివారు వడకట్టుకుని నిమ్మరసం కలుపుకుని తాగొచ్చు.