EPAPER

Maruti Suzuki Celerio : మారుతీ పిచ్చెక్కించే ఆఫర్లు.. సెలెరియోపై భారీ డిస్కౌంట్లు..!

Maruti Suzuki Celerio : మారుతీ పిచ్చెక్కించే ఆఫర్లు.. సెలెరియోపై భారీ డిస్కౌంట్లు..!

Huge Discount on Maruti Suzuki Celerio: కొత్త హ్యాచ్‌బ్యాక్ కారు కొనాలని చూస్తున్నారా?.. అయితే మీకో శుభవార్త  ఉంది. అదేంటంటే నిజానికి దేశంలోని అతిపెద్ద కార్ల విక్రయ సంస్థ మారుతీ సుజుకి భారీ ఆఫర్లు ప్రకటించింది. జూలై 2024లో దాని ఫేమస్ హ్యాచ్‌బ్యాక్ సెలెరియోపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. వినియోగదారులు జూలై నెలలో మారుతి సుజుకి సెలెరియోని కొనుగోలు చేయడం ద్వారా రూ. 75,000 కంటే ఎక్కువ డబ్బును సేవ్ చేసుకోవచ్చు.


ఈ ఆఫర్‌లో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. డిస్కౌంట్ గురించి మరిన్ని వివరాల కోసం కస్టమర్‌లు తమ సమీపంలోని డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. మారుతి సుజుకి సెలెరియో డిస్కౌంట్ ఆఫర్, ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.

Also Read: అసలు ఊహించలేదు.. బజాజ్ CNG అదిరింది.. లుక్ చూస్తే పిచ్చెక్కిపోద్ది!


మారుతి సుజుకి సెలెరియో LXi (డ్రీమ్ ఎడిషన్) పై జూలై నెలలో గరిష్టంగా రూ. 75,084 తగ్గింపు లభిస్తుంది. ఇది కాకుండా మారుతి సుజుకి సెలెరియో (పి) మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌పై కంపెనీ రూ.55,100 తగ్గింపును అందిస్తోంది. మరోవైపు మారుతి సుజుకి సెలెరియో (పి) ఎజిఎస్ వేరియంట్‌పై కంపెనీ మొత్తం రూ.60,100 తగ్గింపును ఇస్తోంది.

ఇది కాకుండా వినియోగదారులు మారుతి సుజుకి సెలెరియో CNG వేరియంట్‌ను 55,100 రూపాయల తగ్గింపుతో జూలై నెలలో కొనుగోలు చేయవచ్చు. మారుతి సుజుకి సెలెరియో తన సొంత కంపెనీ మారుతి సుజుకి ఆల్టో కె10, రెనాల్ట్ క్విడ్ వంటి హ్యాచ్‌బ్యాక్ కార్లతో మార్కెట్లో పోటీ పడుతుంది.

Also Read: నంబర్ వన్‌గా బలెనో.. సేల్స్‌లో రికార్డులే రికార్డులు!

మారుతి సుజుకి సెలెరియోలో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది గరిష్టంగా 67bhp పవర్‌, 89Nm పీక్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఇది కాకుండా కారులో CNG పవర్‌ట్రెయిన్ ఆప్షన్ కూడా ఉంది. ఇది గరిష్టంగా 56.7bhp పవర్, 82Nm గరిష్ట టార్క్‌ను రిలీజ్ చేయగలదు. మారుతి సుజుకి సెలెరియోసిఎన్‌జి వేరియంట్‌లో లీటరుకు గరిష్టంగా 35.6 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. మారుతి సుజుకి సెలెరియో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్ కోసం రూ. 4.99 లక్షల నుండి రూ. 7.09 లక్షల వరకు ఉంది.

Related News

Hydrogen Train: వందేభారత్ కు మించిన వేగం, త్వరలో పట్టాల మీదికి సరికొత్త రైలు, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Abhishek Bachchan: అభిషేక్ అకౌంట్లోకి ప్రతి నెల రూ.18 లక్షలు వేస్తున్న SBI, కారణం ఏంటో తెలుసా?

Train Missing: రైలు మిస్సైతే టికెట్ వేస్ట్ అయినట్లేనా? అదే టికెట్‌తో మరో రైలులో ప్రయాణించవచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయ్?

GST: ఎల్ఐసీ ప్రపంచంలోనే 10వ అతిపెద్ద సంస్థ… కానీ,…

సికింద్రాబాద్ నుంచి గోవాకు రైలు.. ఎంజాయ్ పండుగో, ఎప్పటి నుంచంటే..

Indian Railways: సినిమా టికెట్ల తరహాలోనే రైలులో మీకు నచ్చిన సీట్‌ను బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Washing meshine Usage : ఆఫర్లో వాషింగ్ మెషీన్‌ కొంటున్నారా.. దుస్తులే కాదు ఇవి కూడా ఎంచక్కా ఉతికేయొచ్చు!

×