EPAPER

PM Modi Congratulates Starmer: బ్రిటన్ ఎన్నికలు.. స్టార్మర్‌కు ప్రధాని మోదీ అభినందనలు..

PM Modi Congratulates Starmer: బ్రిటన్ ఎన్నికలు.. స్టార్మర్‌కు ప్రధాని మోదీ అభినందనలు..

PM Modi Congratulates Starmer: బ్రిటన్ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించిన లేబర్ పార్టీ ప్రధాని అభ్యర్థి కీర్ స్టార్మర్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అలాగే కన్జర్వేటీవ్ పార్టీ ఓటమికి సంబంధించి బ్రిటన్ మాజీ పీఎం రిషి సునాక్‌ నాయకత్వాన్ని కొనియాడారు. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో రిషి సునాక్ కీలక పాత్ర పోషించారని మోదీ పేర్కొన్నారు.


బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అద్భుత విజయం సాధించింది. 14 సంవత్సరాల కన్జర్వేటీవ్ పార్టీ పాలన ముగిసింది. లేబర్ పార్టీ విజయంలో ప్రధాని అభ్యర్థి కీర్ స్టార్మర్ కీలక పాత్ర పోషించారు. 650 సీట్లు ఉన్న పార్లమెంట్‌లో లేబర్ పార్టీ ఇప్పటివరకు 412 స్థానాలను గెలుచుకుంది. రెండు శతాబ్దాల చరిత్రలో కన్సర్వేటీవ్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది.

లేబర్ పార్టీ విజయంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. కీర్ స్టార్మర్ అద్భుతమైన విజయం సాధించారని.. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి నిర్మాణాత్మక సహకారం కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.


గత ప్రధాని రిషి సునాక్‌పై ప్రశంసల వర్షం కురిపించారు ప్రధాని మోదీ. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు రిషి సునాక్ క్రియాశీలక సహకారం అందించారని.. అతని నాయకత్వం అద్భుతమైనదని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు ప్రధాని మోదీ.

బ్రిటన్ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు కన్జర్వేటీవ్ పార్టీ నేత రిషి సునాక్ చెప్పారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన లేబర్ పార్టీకి అభినందనలు తెలిపారాయన. లేబర్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన కీర్ స్టార్మర్‌కు అభినందనలు తెలియజేశారు.

Related News

Continent Turns Green: అక్కడ మొక్కలు మొలిచాయంటే.. భూమి అంతమైనట్లే, శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది ఇదే!

Conflict: మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..?

Dominica Citizenship: ‘ఎవరైనా రావొచ్చు’.. తక్కువ ధరకే పౌరసత్వం విక్రయిస్తున్న దేశం ఇదే..

Elon Musk Brazil: బ్రెజిల్‌లో ట్విట్టర్ ఎక్స్ ఆగని కష్టాలు.. తప్పుడు బ్యాంకులో ఫైన్ చెల్లింపులు!

India’s Iron Dome: ఇండియాపై శత్రువులు మిసైల్ దాడి చేస్తే పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్ తరహా యాంటి మిసైల్ టెక్నాలజీ మన దగ్గర ఉందా?

Trump Advice To Israel: ‘ఇరాన్ అణు స్థావారాలపై వెంటనే దాడి చేయండి’.. ఇజ్రాయెల్ కు ట్రంప్ సలహా

Israel India Iran: ‘దాడి చేయవద్దని ఇండియా ద్వారా ఇరాన్‌కు ముందే హెచ్చరించాం’.. ఇజ్రాయెల్ అంబాసిడర్

×