EPAPER

Aadi Srinivas Comments: ‘ఇప్పటికే డబుల్ సిక్సర్ కొట్టాం.. మరో సిక్సర్ రేవంత్ కొడతారు’

Aadi Srinivas Comments: ‘ఇప్పటికే డబుల్ సిక్సర్ కొట్టాం.. మరో సిక్సర్ రేవంత్ కొడతారు’

Aadi Srinivas Comments On BRS Leaders(Telangana news): ఇప్పటికే డబుల్ సిక్సర్ కొట్టామని.. మరో సిక్సర్ సీఎం రేవంత్ రెడ్డి కొడతారని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శుక్రవారం అన్నారు. గత రాత్రి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్న నేపథ్యంలో ఆది శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.


పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం హాస్యాస్పదం అని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. అసలు తెలంగాణలో ఫిరాయింపులను మొదలుపెట్టింది ఎవరో అందరికీ తెలుసని అన్నారు. మీరు ఫిరాయింపులను ప్రోత్సాహించినప్పుడు మీ సోయి ఎటుపోయిందని బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఫామ్ హౌజ్‌కే పరిమితమైన కేసీఆర్.. ఇప్పుడు కహానీలు చెప్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండలేకనే ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని.. గత రాత్రి ఆరుగురు ఎమ్మెల్సీలు హస్తం గూటికి చేరుకున్నారని.. డబుల్ సిక్సర్ కొట్టామని అన్నారు. మరో సిక్సర్ సీఎం రేవంత్ రెడ్డి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ మీద నమ్మకం లేకనే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని అన్నారు ఆది శ్రీనివాస్.


Also Read: ప్రభుత్వ ఉద్యోగుల్లో నిర్లక్ష్యం.. 11 గంటలైనా కనిపించని పనిమంతులు.. మంత్రులు ఫైర్

రైతు రుణమాఫీపై బీరాలు పలికిన హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేయడానికి రెడీగా ఉండాలన్నారాయన. ఏకకాలంలో రూ.31 కోట్లతో రుణమాఫీ చేస్తామని.. ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. అసలు హరీష్ రావుని మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీయే అని గుర్తు చేశారు ఆది శ్రీనివాస్.

Tags

Related News

Bhatti Vikramarka: రెషిడెన్షియల్ స్కూళ్లకు భట్టి విక్రమార్క గుడ్‌న్యూస్

Cyber Crime: సైబర్ నేరాలకు పాల్పడుతున్న నిందుతులు అరెస్ట్.. రూ.1.61 కోట్ల నగదు సీజ్‌

Where is KCR and Kavitha: కవిత, కేసీఆర్‌కి ఏమైంది ? బీఆర్ఎస్‌లో ఆందోళన

Vegetable Prices: సామాన్యుడిపై మరో భారం.. సెంచరీ చేరువలో ఉల్లి, టమాట

Heavy Rain: బిగ్ అలర్ట్.. నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Minister Seethakka: వారి మరణానికి కారణం మీరు కాదా..? : ప్రధాని మోదీకి మంత్రి సీతక్క కౌంటర్

Scircilla: నేతన్నలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం… దసరా కానుకగా మీకు…

×