EPAPER

Brain Tumor Diseases: తలనొప్పిని నిర్లక్ష్యం చేస్తున్నారా.. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు కావొచ్చు..

Brain Tumor Diseases: తలనొప్పిని నిర్లక్ష్యం చేస్తున్నారా.. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు కావొచ్చు..

Brain Tumor Diseases Symptoms and Causes: ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి తలనొప్పి రావడం కామన్ అయిపోయింది. అయితే తలనొప్పిని నిర్లక్ష్యం చేస్తే బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెదడులోని అనియంత్రిత కణాల పెరుగుదల వలన బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.


బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏమిటి?

మెదడులో కణిితి అనేది సాధారంణంగా రెండురకాలుగా ఉంటుంది. ఒకటి నిరపాయమైనది.. ఇది సాధారణమైన కణితి రెండవది ప్రాణాంతకమైనది.. ఇది కాన్సర్ కు కారకమయ్యే కణితి.


బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు

ఈ వ్యాధి లక్షణాలు సాధారణంగా.. తీవ్రమైన తలనొప్పి, వికారం, జ్ఞాపకశక్తి బలహీనపడటం, కంటి చూపు సన్నగిల్లడం, ఆలోచన సామర్ధ్యం తగ్గిపోవడం, శరీరంలోని బలహీనత ఏర్పడటం, రుచి వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

బ్రెయిన్ ట్యూమర్ ఏ వయసు వాళ్లకి వస్తుంది.
బ్రెయిన్ ట్యూమర్ అనేది ఏ వయసు వాళ్లకైనా రావచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలకు, వృద్దులకు సంభవిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మగవారి కంటే స్త్రీలకు ఎక్కవగా వ్యాప్తి చెందుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా ఆకు కూరలు, ఫ్రూట్స్ వంటివి తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో అనేక రకమైన పోషకాలు ఉంటాయి. అలాగే ప్రతిరోజు డ్రైఫ్రూట్స్ తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. మెదడు కణితను నివారించడానికి ఇవి చాలా సహాయపడతాయి. మరీ ముఖ్యంగా ప్రతి రోజు వ్యాయామం చేయడం ద్వారా మెదడు పని తీరు చురుగ్గా.. ఆరోగ్యంగా ఉంటుంది.

Also Read: బరువు తగ్గించే ఇంజెక్షన్ తీసుకోవడం.. ఆరోగ్యానికి మంచిదేనా?

రేడియో థెరఫీ
మెదడులోని కణిత కణాలు నిరోధించేందుకు రేడియో థెరపీ ఉపయోగపడుతుంది.

రసాయనాలను తక్కువ ఉపయోగించండి..
బ్రెయిన్ క్యాన్సర్ దరిచేరకుండా ఉండాలంటే వీలైంనంత వరకు నేచురల్ ఫుడ్ వాడాలి. ప్లాస్టిక్ వినియోగం తగ్గించండి. అలాగే రసాయనాలకు దూరంగా ఉంటే చాలా మంచిది.

రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు చేయించుకోండి

బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి ప్రాణాంతక వ్యాధి. ప్రస్తుత పరిస్తితుల్లో జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్ల వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వంటి వ్యాధులు  వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. కాబట్టి తలనొప్పి వంటివి రోజు వస్తుంటే అసలు నిర్లక్ష్యం చేయొద్దు. రెగ్యులర్ గా హెల్త్  చెకప్ లు చేయించుకోవడం ద్వారా కొన్ని వ్యాధులను నివారించవచ్చు.

 

Related News

Curry Leaves Hair Oil: కరివేపాకుతో ఇలా చేస్తే.. తెల్లజుట్టు నల్లగా మారడం పక్కా

Beetroot Face Pack: బీట్ రూట్ ఫేస్ ప్యాక్.. ఎలాంటి మచ్చలైనా మాయం

Wife and Husband: మీ జీవిత భాగస్వామి మీకు అబద్ధం చెబుతున్నా, మోసం చేస్తున్నా తెలుసుకోవడం చాలా ఈజీ, ఈ టిప్స్ పాటించండి

Panasa Curry: ఆవపెట్టిన పనస కూర ఇలా వండారంటే ఆ రుచికి ఎవరైనా దాసోహమే, రెసిపీ తెలుసుకోండి

Hibiscus Hair Mask: మందారంలో వీటిని కలిపి ఈ హెయిర్ మాస్క్ ట్రై చేశారంటే.. పట్టులాంటి జుట్టు మీ సొంతం

Instant Glow Facial: పండుగ వేళ.. ఇంట్లో దొరికే వస్తువులతో ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. ఇన్‌స్టంట్‌ గ్లో ఖాయం

Relationships: మీ మాజీ లవర్‌తో ఇప్పటికీ స్నేహంగా ఉంటున్నారా? ఇది మంచి ఆలోచనేనా?

×