EPAPER

Abhishek manu singhvi: తెలంగాణలో రాజ్యసభ సీటుపై చర్చ, రేసులో అభిషేక్‌ మనుసింఘ్వీ!

Abhishek manu singhvi: తెలంగాణలో రాజ్యసభ సీటుపై చర్చ, రేసులో అభిషేక్‌ మనుసింఘ్వీ!

Abhishek manu singhvi: తెలంగాణలో రాజ్యసభ సీటు ఎవరికి దక్కనుంది? తెలంగాణలో కాంగ్రెస్ నేతలకు ఆ సీటు ఇస్తారా? లేకా సీనియర్లకు ఇస్తారా? ఇదే చర్చ తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో మొదలైంది. రాజ్యసభ సభ్యత్వానికి కే కేశవరావు రాజీనామా చేయడంతో ఆ సీటు ఎవరికి ఇస్తారన్న దానిపై నేతలు చర్చించుకోవడం మొదలైంది.


తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడవాళ్లకు సీటు ఇవ్వడం ఖాయమన్నది కొందరి నేతల వాదన. కానీ ఈ సీటును పార్టీలోని కీలక నేతకు ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన చేస్తుందనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఏఐసీసీ అధికార ప్రతినిధి, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్‌మను సింఘ్వీకి ఆ సీటు ఇవ్వడం ఖాయమంటూ వార్తలు వస్తున్నాయి.

పార్టీ హైకమాండ్ ఆయనకు దాదాపుగా గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్టు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్. ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో అభిషేక్ మనుసింఘ్వీ అనుకోకుండా ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనను మరో చోట నుంచి పెద్దల సభకు పంపాలని భావిస్తోంది. ఈ సమయంలో బీఆర్ఎస్ నుంచి కేశవరావు కాంగ్రెస్‌లోకి వచ్చారు. కేకే రూపంలో సింఘ్వీకి అదృష్టం కలిసి వచ్చిందని అంటున్నారు.


ALSO READ: బీఆర్ఎస్‌కు కోలుకోలేని దెబ్బ..కాంగ్రెస్‌లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు

ఇప్పటికే కేకే తన రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కడ్‌కు అందజేశారు. ఒక పార్టీ నుంచి పదవి పొంది మరో పార్టీలో చేరినప్పుడు రాజీనామా చేయడం నైతిక బాధ్యతను ఆ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత కేశవరావుకు కేబినెట్ హోదాతో కూడిన ప్రత్యేక సలహాదారు పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సూచన ప్రాయంగా చెప్పినట్టు తెలుస్తోంది.

Tags

Related News

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

×