EPAPER

Jairam ramesh comments: ప్రధాని మోదీ తొలుత మణిపూర్ ఆ తర్వాతే.. జైరాంరమేష్ కామెంట్స్

Jairam ramesh comments: ప్రధాని మోదీ తొలుత మణిపూర్ ఆ తర్వాతే..  జైరాంరమేష్ కామెంట్స్

Jairam ramesh comments(Telugu news headlines today): ప్రధాని నరేంద్రమోదీపై సెటైర్లు వేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. ప్రధాని మోదీని స్పేస్‌లోకి పంపించడం తాము గొప్పగా భావిస్తామన్నారు. కాకపోతే అంతకుముందు మణిపూర్ వెళ్లాలని సూచన చేశారు.


2025లో భారత్ ప్రయోగించనున్న తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీని పంపిస్తామని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వ్యాఖ్యానించారు. ఈ విషయం జరిగి నాలుగైదు రోజులైంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాంరమేష్ తనదైన శైలిలో X వేదికగా రియాక్ట్ అయ్యారు. ప్రధాని అంతరిక్షంలోకి వెళ్లే ముందు ఒక్కసారి మణిపూర్ వెళ్లి రావాలని సూచన చేశారు.

గతేడాది మణిపూర్‌లో తెగల మధ్య హింస చెలరేగింది. దాదాపు 225 మంది మరణించినట్టు నివేదికలు చెబుతున్నాయి. అక్కడ చాలామంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. బుధవారం రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోదీ మణిపూర్ అంశంపై మాట్లాడారు.


మణిపూర్ అంశాన్ని రాజకీయ చేయవద్దని, శాంతి స్థాపనకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు ప్రధాని మోదీ. ఇప్పటివరకు దాదాపు 500 మందిని అరెస్ట్ చేసినట్టు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ హయాంలో మణిపూర్‌లో పదిసార్లు రాష్ట్రపతి పాలన విధించారని గుర్తు చేశారు.

ALSO READ: వణుకుతున్న ఉత్తరభారతం.. వర్షాలు లేకున్నా వరదలు.. 56 మంది మృతి

మరోవైపు మణిపూర్‌లో ప్రత్యేక పరిపాలన డిమాండ్ చేస్తూ ఆందోళనలు తీవ్రమయ్యాయి. నాలుగు రోజుల కిందట చురచంద్‌పూర్ జిల్లాలో భారీ ర్యాలీ జరిగింది. వేలాది మంది ప్రజలు పాల్గొన్న ఈ ఆందోళనను కుకీ తెగ చేపట్టింది.

Tags

Related News

Naveen Jindal: గుర్రంపై వచ్చి ఓటేసిన నవీన్ జిందాల్, వీడియో వైరల్

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Amethi Family Murder: అమేఠీలో కుటుంబాన్ని హత్య చేసిన సైకో.. హత్యకు ముందే పోలీసులకు సమాచారం… అయినా..

Haryana Elections: హర్యానాలో పోలింగ్ మొదలు.. ఆ పార్టీల మధ్యే ప్రధాన పోటీ, ఫలితాలు ఎప్పుడంటే?

Toilet Tax: ఆ రాష్ట్రంలో టాయిలెట్ ట్యాక్స్ అమలు.. ఇది చెత్త పన్ను కంటే చెత్త నిర్ణయం!

Gurmeet Ram Rahim: ‘ధనవంతులకో న్యాయం.. పేదవారికో న్యాయం’.. 2 సంవత్సరాలలో రేపిస్టు డేరా బాబాకు 10 సార్లు పెరోల్

Viral Video: సెక్రటేరియట్ మూడో అంతస్తు నుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్.. ఎమ్మెల్యేలు, ఎందుకో తెలుసా?

Big Stories

×