EPAPER

APMDC, PCB Documents burn: ఏపీలో.. ఏపీఎండీసీ, పీసీబీ కీలక పేపర్స్ దహనం, ఎవరి పని?

APMDC, PCB Documents burn: ఏపీలో..  ఏపీఎండీసీ, పీసీబీ కీలక పేపర్స్ దహనం, ఎవరి పని?

APMDC, PCB Documents burn in AP(Latest news in Andhra Pradesh): ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది? ఈ మధ్యకాలంలో ప్రభుత్వానికి సంబంధించిన పేపర్స్ ఎందుకు దహనం చేస్తున్నారు? కావాలనే చేస్తున్నారా? చేసిన అవినీతిని కప్పి పుచ్చు కునేందుకు ఈ పని చేస్తున్నారా? ప్రస్తుత ప్రభుత్వానికి ఎలాంటి ఆనవాళ్లు దొరక్కకుండా చేస్తున్నా రా? నిన్న సీఐడీ, నేడు ఏపీ ఖనిజాభివృద్ధి, పొల్యూషన్ నియంత్రణ మండలికి సంబంధించిన పేపర్స్ వంతైంది. మరి రేపు ఏ శాఖ అన్నది ఆసక్తికరంగా మారింది.


విజయవాడ- అవనిగడ్డ కరకట్టపై బుధవారం రాత్రి ప్రభుత్వానికి సంబంధించిన కీలక పత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. కొన్ని పేపర్స్‌ను గమనించిన చుట్టు పక్కల వాళ్లు కొన్ని ఫైళ్లపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఫోటోలు కనిపించాయి. అలాగే కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన బస్తాల కొద్దీ పేపర్లను తగలబెట్టడం కలకలం రేపుతోంది.

బుధవారం రాత్రి 9 గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు ఇన్నోవా కారులో కరకట్టపైకి వచ్చారు. కారుపై ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్ ఉంది. పెనమలూరు మండలం పెదపులిపాక సమీపంలో బస్తాల్లోని దస్త్రాలను తగలపెట్టారు. అటువైపు వెళ్తున్న కొంతమంది వాటిని గమనించారు. దస్త్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కాలుష్య మండలి మాజీ ఛైర్మన్ సమీర్‌శర్మ ఫోటోలు కనిపించాయి.


ఈ విషయం తెలియగానే స్థానిక టీడీపీ నేతలు అక్కడికి చేరుకుని కారులో వచ్చినవారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. యనమలకుదురులో టీడీపీ నేతలు ఆ వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అధికారుల సూచనతోనే పేపర్స్ తీసుకొచ్చి తగలబెట్టినట్టు కారు డ్రైవర్ నాగరాజు చెబుతున్న మాట.

ALSO READ: జగన్‌ హాట్ కామెంట్స్, ఎంతకాలం ఆపగలం, వెనక్కి తగ్గొద్దు..

రెండు విభాగాలకు చెందిన పేపర్లను రాత్రివేళ సీక్రెట్‌గా తగల బెట్టాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? దీని వెనుక అధికారుల పాత్ర ఉందా? పేపర్స్ కీలకమైనవి కాకపోతే.. అమరావతి పరిసర ప్రాంతాల్లో ఎందుకు తగలబెట్టలేదు? ఇవే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. ఇవేకాదు గతంలో సిట్ దర్యాప్తు చేసిన పత్రాలను ఇలాగే తగలబెట్టారు. అప్పటి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు రావడంతో చివరకు అధికారులు క్లారిఫికేషన్ ఇచ్చుకున్నారు.

 

Tags

Related News

CM Chandrababu: ఆ విషయంలో వెనక్కి తగ్గం.. సీఎం చంద్రబాబు క్లారిటీ

Perni Nani: నా వెంట్రుక కూడ పీకలేరు.. కోసి కారం పెట్టండి.. మాజీ మంత్రి నాని సెన్సేషనల్ కామెంట్స్

AP Politics: లోకేష్ కి పోటీగా అంబటి.. గ్రీన్ బుక్ ఓపెన్.. పేర్లన్నీ రాస్తున్నా.. ఎవ్వరినీ వదలనంటూ కామెంట్

Swiggy Services Ban: ఏపీలో స్విగ్గీ సేవలు బ్యాన్, హోటల్స్ యాజమాన్యాలు కీలక నిర్ణయం, కారణం తెలుసా?

SIT inquiry: తిరుమల లడ్డూ వివాదం.. ఈ వారం రంగంలోకి సిట్, తొలుత..

Deputy Cm Pawan: పవన్ కల్యాణ్‌కు బిగ్‌షాక్.. కేసు నమోదు, ఎందుకంటే..

TDP vs YCP: ధర్మారెడ్డి, భూమన.. జగన్ బంధువులే, ఇదిగో వంశవృక్షం, ఆ వివరాలన్నీ లీక్!

Big Stories

×