EPAPER

Bajaj CNG Bike Teaser: ప్రపంచలోనే తొలి సీఎన్‌జీ బైక్ టీజర్ రిలీజ్.. లుక్ ఏముంది బాసూ.. అదిరిపోయిందంతే..?

Bajaj CNG Bike Teaser: ప్రపంచలోనే తొలి సీఎన్‌జీ బైక్ టీజర్ రిలీజ్.. లుక్ ఏముంది బాసూ.. అదిరిపోయిందంతే..?

Bajaj CNG Bike Teaser: ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్ బజాజ్ నుంచి రాబోతుంది. ఈ బైక్ కోసం యావత్ వాహన ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ రేపు అనగా జూలై 5న ఈ తొలి సీఎన్‌జీ బైక్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేయబోతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ బైక్‌కి సంబంధించిన టీజర్‌ను ఆ సంస్థ రిలీజ్ చేసింది. ఈ టీజర్ ప్రకారం చూస్తే.. ఈ బైక్ చాలా సింపుల్ అండ్ స్టైలిష్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.


అయితే ఈ టీజర్‌లో బైక్‌కి సంబంధించిన పూర్తి వ్యూ చూపించనప్పటికీ ఇది మంచి లుక్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది రెండు ఆప్షన్లుగా రాబోతుంది. అందులో ఒకటి సీఎన్‌జీ వెర్షన్.. మరొకటి పెట్రోల్ వెర్షన్. వీటి వల్ల ప్రయోజనం ఏంటంటే.. సీఎన్‌జీ ఆప్షన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు అది అయిపోతే వెంటనే పెట్రోల్ ఆప్షన్‌లోకి వెళ్లవచ్చు. అలాగే పెట్రోల్ ఆప్షన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు అది అయిపోతే సీఎన్‌జీ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. వీటికోమే బైక్‌లో ప్రత్యేక స్విచ్‌ను అందించారు.

ఈ స్విచ్ సహాయంతో మీరు దేనికైనా మారవచ్చు. ఆపై దీని ఫ్రంట్ లుక్‌ చూపించారు. అందులో హెడ్ లైట్ ఉంది. అయితే అది ఎల్‌ఈడీ హెడ్‌లైటా లేక ఇంకెదైనా అని తెలియాల్సి ఉంది. అనంతరం బైక్ తయారీదారు బజాజ్ లోగోను చాలా స్టైలిష్‌గా చూపించారు. ఇలా మొత్తంగా ఈ బైక్‌కి సంబంధించి టీజర్ రిలీజ్ చేస్తూ వాహన ప్రియుల్లో ఆసక్తి రేకెత్తించారు.


Also Read: జులై 5 లాంచ్ కానున్న ప్ప్రపంచపు తొలి సీఎన్‌జీ బైక్.. రిజిస్ట్రేషన్స్ ఓపెన్.. ధర ఎంతంటే..?

ఇకపోతే ఈ సీఎన్‌జీ బైక్‌ను రిలీజ్ చేస్తున్నట్లు బజాజ్ గతంలో ప్రకటించినప్పటి నుంచి వాహన ప్రియుల్లో ఒకటే ఉత్కంఠ మొదలైంది. దీంతో ఈ బైక్ ఎప్పుడెప్పుడు మార్కెట్‌లోకి వస్తుందా అని అంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ టీజర్ రిలీజ్ చేసి అందరిలోకి ఫుల్ ఎనర్జీని అందించింది. ఇక ఈ బైక్ ఇంజిన్ పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే.. ఇందులో 100 నుంచి 125సిసి ఇంజిన్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ బైక్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాహన ప్రియులను దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు సమాచారం. ఇప్పటికే బజాజ్ కంపెనీ ఇలాంటి రెండు మూడు బైక్‌లను టెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ బైక్ ధర విషయానికొస్తే.. ఇది భారతీయ మార్కెట్‌లో రూ.90,000 ధరలో లాంచ్ అవ్వొచ్చని అంటున్నారు. అయితే మరిన్ని అదనపు ఫీచర్లతో వచ్చే బైక్‌ మరింత ధర కలిగి ఉంటుందని తెలుస్తోంది.

కాగా ప్రపంచంలో తొలి సీఎన్‌జీ బైక్ ఇదే కావడంతో దీనికి పోటీ ఏదీ నిలవలేదనే చెప్పాలి. అందువల్ల తక్కువ ధరలో ఎక్కువ మైలేజీని ఇచ్చే బైక్‌ కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఇదే మంచి అవకాశం. కాగా ఈ బైక్‌ను రేపు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా లాంచ్ చేయనున్నారు. ఈ బైక్‌తో బజాజ్ ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయాలని చూస్తోంది. మరి ఈ బైక్ లాంచ్ అనంతరం ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

Tags

Related News

Indian Railways: సినిమా టికెట్ల తరహాలోనే రైలులో మీకు నచ్చిన సీట్‌ను బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Washing meshine Usage : ఆఫర్లో వాషింగ్ మెషీన్‌ కొంటున్నారా.. దుస్తులే కాదు ఇవి కూడా ఎంచక్కా ఉతికేయొచ్చు!

Railway Employees Diwali Bonus| రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. రూ.2029 కోట్ల దీపావళి బోనస్!

VIKALP Yojana: పండుగల వేళ ఈజీగా రైలు టికెట్ పొందే VIKALP స్కీమ్ గురించి మీకు తెలుసా? ఇంతకీ ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే?

India’s Slowest Train: 46 కి.మీ దూరం.. 5 గంటల ప్రయాణం, ఈ రైలు ఎంత నెమ్మదిగా వెళ్లినా మీకు విసుగురాదు.. ఎందుకంటే?

IRCTC Special Discounts: రైళ్లలో ఈ ప్రయాణీకులకు ఏకంగా 75 శాతానికి పైగా టికెట్ ధర తగ్గింపు, ఎందుకో తెలుసా?

IRCTC Tatkal Ticket Bookings: తత్కాల్ టికెట్ బుక్ చేస్తున్నారా? ఇలా చేస్తే ఈజీగా టికెట్ కన్ఫామ్ కావడం ఖాయం!

Big Stories

×