మారుతున్న ఆధునిక జీవన విధానం, శైలి, ఆహారపు అలవాట్లు ఊబకాయానికి దారితీస్తాయి

క్రమం తప్పని వ్యాయామం, ఆహార నియమాలతో బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు

ఆహారంలో వామును తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి

ప్రాచీన భారతీయ ఆయుర్వేద వైద్య విధానం ఆయుర్వేదంలో వాముకు అధిక ప్రాధాన్యత ఉంది

ప్రతిరోజూ ఖాళీ కడుపుతో వామును తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారని పలు నివేదికలు చెబుతున్నాయి

వేడి నీటిలో వామును కలిపి తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వు కరుగుతుంది

ఒక టీ స్పూన్ వామును ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయం తేనెతో తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది

వాము తీసుకోవడం వలన శరీరంలో జీర్ణవ్యవస్థ బాగా పని చేస్తుందంటారు నిపుణులు

వాము తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ సమస్యను కూడా అధిగమించవచ్చు