EPAPER
Kirrak Couples Episode 1

Weight Loss Tips : చపాతీలు తింటే నిజంగా బరువు తగ్గుతారా?

Weight Loss Tips : చపాతీలు తింటే నిజంగా బరువు తగ్గుతారా?

Weight Loss Tips : ప్రస్తుత కాలంలో జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రతిఒక్కరూ బరువు పెరుగుతున్నారు. ఆ బరువును తగ్గించుకోవడం పెద్ద సవాల్‌గా మారింది. అందుకే చాలా మంది ఆహారాన్ని తగ్గించి తినడం, లేకపోతే ఆహారానికి బదులుగా చపాతీలు తినడం చేస్తుంటారు. నిజానికి చ‌పాతీల‌కు, బ‌రువు త‌గ్గేందుకు సంబంధం లేదంటున్నారు నిపుణులు. అలాగే అన్నం తింటూ బ‌రువు త‌గ్గవచ్చని చెబుతున్నారు. ఎందుకంటే అన్నం, చ‌పాతీలు చేసేందుకు వినియోగించే గోధుమ పిండిలో పిండి ప‌దార్థాలు దాదాపు స‌మానంగా ఉంటాయట. అందుకే వేటిని తిన్నా మ‌న బాడీకి కార్బొహైడ్రేట్లు అందుతాయి. కానీ ప్రతిరోజు కార్బొహైడ్రేట్లతో పాటు కొవ్వులు, ప్రోటీన్లు ఉండే ఆహారాల‌ను స‌మానంగా తీసుకోవాలి. స‌మ‌తుల ఆహారంతో పాటుగా ఎన్ని క్యాల‌రీల ఆహారాన్ని తింటున్నాం, ఎంత మేరకు ఆ క్యాల‌రీల‌ను వినియోగిస్తున్నామనేది చూసుకోవాలి. శారీరక వ్యాయామం చేయ‌ని వారికి నిత్యం 1500 క్యాల‌రీల శ‌క్తిని ఇచ్చే ఆహారం స‌రిపోతుంది. నిజానికి మాత్రం అంతకంటే ఎక్కువ‌ క్యాల‌రీల‌ను ఇచ్చే ఆహారాల‌ను తీసుకుంటారు. దీంతో ఆ అధిక క్యాల‌రీల శ‌క్తి అంతా కొవ్వుగా మారిపోతుంది. అందుకే బ‌రువు పెరుగుతారు. కాబట్టి మ‌నం తీసుకునే ఆహారం వల్ల వచ్చే క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేయాలి. ప్రతిరోజు 2 వేల క్యాల‌రీల ఆహారం తీసుకుంటే అందులో 200 నుంచి 300 క్యాల‌రీలు ఖ‌ర్చు చేయాలని నిపుణులు అంటున్నారు. దీంతో అధిక బ‌రువు త‌గ్గవ‌చ్చు. ఏం తిన్నా శారీర‌క శ్రమ చేయ‌కపోతే మాత్రం మితంగా తీసుకోవడమే మంచిది.



Related News

Horoscope 27 September 2024: ఈ రాశి వారికి ఊహించని ధన లాభం.. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం!

Bigg Boss 8 Telugu Promo: విష్ణుప్రియాకు నైనికా వెన్నుపోటు, సీత చేతికి ఆయుధం.. ఈసారి చీఫ్ అయ్యేది ఎవరు?

Medigadda: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మేడిగడ్డ నిర్మాణ సంస్థకు ఊహించని షాక్.. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ రద్దు!

Monkeypox Virus: డేంజర్ బెల్స్.. మరో మంకీపాక్స్‌ కేసు.. ఎమర్జెనీకి దారితీసిన వైరస్ ఇదే!

Heavy Rain: రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. కీలక సూచనలు!

Animal Oil Making: జంతుల కొవ్వుతో నూనె ఎలా తయారు చేస్తారు? కల్తీని ఎలా గుర్తించాలి? ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు!

Rhea Singha: ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’.. ఎవరో తెలుసా?

Big Stories

×