EPAPER

Best Fruits to Boost Immunity: వర్షాకాలంలో ఈ ఫ్రూట్స్ తింటే ఇన్ఫెక్షన్లకు గుడ్ బై చెప్పొచ్చు..!

Best Fruits to Boost Immunity: వర్షాకాలంలో ఈ ఫ్రూట్స్ తింటే ఇన్ఫెక్షన్లకు గుడ్ బై చెప్పొచ్చు..!

Best Fruits to Boost Immunity in Monsoon Season: వర్షాకాలం మొదలు అయిందంటే చాలు అనేక రకాల వ్యాధులు ఎటాక్ చేస్తుంటాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. జలుబు, దగ్గు మొదలు డెంగ్యూ, జ్వరాలు, మలేరియా, సీజనల్ ఫీవర్స్ ఇబ్బంది పెడుతుంటాయి. వివిధ రకాల పండ్లు తింటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా కొన్ని పండ్లు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. అలాంటి పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


బ్లూ బెర్రీ:

వర్షాకాలంలో వచ్చే పలు రకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి బ్లూ బెర్రీలు సహాయపడతాయి. వీటిని తినడం వల్ల తక్కువ క్యాలరీలు, ఐరన్,ఫెలేట్, పొటాషియం, మిటమిన్ల వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి చిన్న చిన్న వ్యాధులతో పోరాడటానికి ఉపయోగపడతాయి.


బొప్పాయి:

విటమిన్ సి బొప్పాయిలో పుష్కలంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఇది చాలా బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా వీటిలో ఉండే పీచు పదార్థం వ్యాధులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. కాబట్టి వర్షాకాలంలో బొప్పాయి తినమని నిపుణులు సలహా ఇస్తున్నారు.

Also Read: Kidney Stones: ఈ ఆహారాలు తింటున్నారా ? అయితే కిడ్నీ స్టోన్స్ గ్యారంటీ !

చెర్రీస్:

వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అంటు వ్యాధులు రాకుండా నివారిస్తాయి. అంతే కాకుండా మెదడుకు ప్రశాంతత, విశ్రాంతిని అందిస్తాయి.

పియర్స్:

వర్షాకాలంలో అనేక ఇన్ఫెక్షతో పోరాడటానికి మనకు విటమిన్లు అవసరం. అందుకే ఈ విటమిన్లు ఉంటే ఫ్రూట్స్ తినాలి. పియర్స్ పండ్లలో పుష్కలంగా విటమిన్లు ఉంటాయి. కాబట్టి క్రమం తప్పకుండా పియర్స్ తినడం మంచిది.

లిచీ:

వర్షాకాలంలో లిచీ పండ్లను కచ్చితంగా తినాలని నిపుణులు చెబతున్నారు. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో శక్తి సామర్థ్యాలను పెంచడంతో పాటు రోగ నిరోదక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇవి తినడం వల్ల జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లును కూడా ఇవి అందించి బరువు తగ్గడంలో సహాయపడతాయి.

Also Read: బరువు పెరుగుతున్నామని బ్రేక్‌ఫాస్ట్ తినడం మానేస్తున్నారా ?

దానిమ్మ:

వర్షాకాలంలో ఎక్కువగా లభించే పండ్లలో దానిమ్మ ఒకటి. దానిమ్మ గింజలు అనేక పోషక విలువలు కలిగి ఉంటాయి. ముఖ్యంగా దానిమ్మ గింజల్లో ఉండే విటమిన్ సి రోగ నిరోదక శక్తిని బలోపేతం చేయడంతో పాటు జలుబు ,దగ్గులను దూరం చేస్తుంది. సీజనల్ వ్యాధులు రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.

యాపిల్స్:

రోజుకు ఒక్క యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదంటారు. కారణం అందులోని పోషకాలు, ఎందుకంటే ఇవి అనేక వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి.

Tags

Related News

Relationships: మీ మాజీ లవర్‌తో ఇప్పటికీ స్నేహంగా ఉంటున్నారా? ఇది మంచి ఆలోచనేనా?

Amla Rice: ఉసిరికాయ అన్నం ఇలా చేసుకొని తింటే లంచ్ బాక్స్‌కు బాగుంటుంది, ఇది ఎంతో ఆరోగ్యం కూడా

Youthful Glow: ఎప్పటికీ యవ్వనంగా ఉండాలా? డైలీ, ఈ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ తింటే చాలు.. వయస్సే తెలియదు

Rice Water: గంజి వచ్చేలా అన్నం వండి ఆ గంజినీళ్లను ప్రతిరోజూ తాగండి, మీరు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి

Thyroid: వీటితో ఇంట్లోనే థైరాయిడ్‌కు చెక్ !

Hair Spa: ఇంట్లోనే హెయిర్ స్పా.. ఎలా చేసుకోవాలో తెలుసా ?

Henna For Hair: జుట్టుకు హెన్నా పెడుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Big Stories

×