EPAPER

Jagan Promise: ఇదేం తలనొప్పి.. జగన్ ప్రామిస్, త్వరలో..!

Jagan Promise: ఇదేం తలనొప్పి.. జగన్ ప్రామిస్, త్వరలో..!

YCP Jagan Promised to Polavaram Contractors: రాష్ట్రంలో అధికారం పోయిన తర్వాత మానసిక ప్రశాంతత కోసం నాలుగైదు రోజులు పులివెందులకు టూర్ వేశారు వైసీపీ అధినేత జగన్. అక్కడి వెళ్లిన తర్వాత లోకల్ సమస్యలు ఆయన్ని వెంటాడుతున్నాయి. ఇప్పుడేం చేయ్యాలో సతమతమవుతున్నారట జగన్. అసలేం జరిగిందంటే..


వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పులివెందుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. వైసీపీ అధికారంలో ఉంటుందని భావించి సొంత నిధులు పెట్టి పనులు చేశారు కొంతమంది కాంట్రాక్టర్లు. తీరా ప్రభుత్వం మారిపోయింది. మా బిల్లులు మాటేంటని జగన్ దగ్గర మొరపెట్టుకున్నారట. ఇంట్లో ఉన్నదంతా పెట్టేశామని, చేతిలో చిల్లిగవ్వ లేదని వాపోయారట.

శనివారం పులివెందుల వెళ్లారు వైసీపీ అధినేత జగన్. అక్కడ అడుగుపెట్టగానే కార్యకర్తలతోపాటు కాంట్రాక్టర్లు వెళ్లి ఆయనను కలిశారు. పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ అధారిటీ(పాడా) అభివృద్ధి పనులు చేసిన బిల్లులు రాలేదని మొరపెట్టుకున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నామని, కొంతలో కొంతైనా మనీ సర్దుబాటు చేయాలని రిక్వెస్ట్ చేశారట. ఈ విషయంలో మీరు అధైర్యపడవద్దని జగన్ భరోసా ఇచ్చినట్టు సమాచారం. కోర్టుకు వెళ్లి బిల్లులు తెచ్చుకుందామని వాళ్లతో అన్నారు.


Also Read: ఏపీలో డయేరియా కలకలం.. ఇద్దరు మృతి

గతంలో మనం నీరు-చెట్టు కింద పని చేసినవారికి బిల్లులను చెల్లించామని గుర్తు చేశారట జగన్. కొద్దిరోజులు ఓపిక పడితే అంతా సెట్ అవుతుందని అన్నారు. అనంతరం పులివెందుల పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు జగన్. కార్యకర్తలు పలు అంశాలు లేవనెత్తారు. త్వరలో మనకు మంచిరోజులు వస్తున్నాయని, తిరిగి అధికారంలోకి వస్తామని కార్యకర్తలను ఉత్సాహ పరిచే ప్రయత్నం చేశారాయన.

బిల్లుల వ్యవహారంపై సచివాలయంలో ఉన్న అధికారులతో జగన్ మద్దతుదారులు మాట్లాడినట్టు తెలుస్తోం ది. ఒక్కసారి ఐదేళ్ల వెనక్కి వెళ్తే.. అప్పటి టీడీపీ హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదు జగన్ సర్కార్. చివరకు కాంట్రాక్టర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయినా ఫలితం దక్కలేదు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. కాకపోతే బాధితులు వైసీపీ కాంట్రాక్టర్ల వంతైంది. ఈ గండం నుంచి వాళ్లు ఎలా గట్టెక్కుతారో చూడాలి.

Related News

TDP vs YCP: ధర్మారెడ్డి, భూమన.. జగన్ బంధువులే, ఇదిగో వంశవృక్షం, ఆ వివరాలన్నీ లీక్!

Minister Satyakumar: జగన్ కు షాక్.. వైఎస్సార్ జిల్లా పేరు మార్చాలంటూ సీఎంకు లేఖ రాసిన మంత్రి

Kalasha Naidu: ‘బిగ్ బాస్’ నూతన్ నాయుడు కూతురికి ప్రతిష్టాత్మక అవార్డు, 11 ఏళ్లకే సమాజ సేవ.. సెల్యూట్ కలశా!

AP Ministers: నూతన విచారణ కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నాం.. హోం మంత్రి వంగలపూడి అనిత

CM Chandrababu: తన రికార్డ్ తనే తిరగరాసిన సీఎం చంద్రబాబు.. 10 సార్లు పైగానే శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ

Ys Jagan: బాబుకు భయం లేదు.. భక్తి లేదు.. అన్నీ అబద్దాలే.. సుప్రీం ఆదేశాలపై జగన్ స్పందన

Ys Sharmila: వేషం మార్చారు.. భాష మార్చారు.. ఇది మీకు తగునా పవన్.. షర్మిళ సంచలన కామెంట్స్

Big Stories

×