EPAPER

Parliament 1st Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు..నేడు, రేపు సభ్యుల ప్రమాణ స్వీకారం..!

Parliament 1st Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు..నేడు, రేపు సభ్యుల ప్రమాణ స్వీకారం..!

Parliament First Session of 18th Lok Sabha: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 18వ లోక్ సభకు ఎన్నికైన సభ్యులు సోమవారం, మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత 26న లోక్ సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అలాగే 27న రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఉభయ సభలను ఉద్ధేశించి ప్రసంగించనున్నారు.


రాష్ట్రపతి భవన్‌లో సోమవారం లోక్ సభ స్పీకర్‌గా భర్తృహరితో రాష్ట్రపతి ద్రౌపరి ముర్ము ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మహతాబ్ తర్వాత పార్లమెంట్ హౌస్‌కు చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు లోక్ సభను ప్రారంభిస్తారు. 18వ లోక్ సభ తొలి సమావేశం సందర్భంగా ఇటీవల మరణించిన వారికి సభ్యులు కాసేపు మౌనం పాటించడంతో ప్రక్రియ ప్రారంభమవుతోంది.

లోక్ సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ లోక్ సభకు ఎన్నికైన సభ్యుల జాబితాను సభ ముందు ఉంచుతారు. అనంతరం లోక్ సభకు ఎన్నికైన సభ్యులతో ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్‌తో ప్రయాణ స్వీకారం చేయిస్తారు. తొలుత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ తర్వాత సీనియారిటీ ఆధారంగా మంత్రులు, ఎంపీలు ప్రమాణం చేస్తారు. ఆంగ్లవర్ణక్రమంలో రెండు రోజులు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత లోక్ సభ సభ్యులందరూ నూతన స్పీకర్‌ను ఎన్నుకుంటారు.


Also Read: Protest in Manipur: మరోసారి మణిపూర్‌లో ‘ప్రత్యేక పరిపాలన’కు డిమాండ్.. కుకీ సంఘాల నిరసన

జూన్ 27న పార్లమెంట్ ఉభయ సభలను ఉద్ధేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జూన్ 28న చర్చ ప్రారంభం కానుంది. అనంతరం జులై 2, 3న చర్చకు ప్రధాని సమాధానం ఇస్తారు. తర్వాత 3వ తేదీన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ముగియనున్నాయి. కొన్ని రోజుల విరామం తర్వాత జులై 22న కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.

Related News

Spam Call Death : ‘మీ కూతురు వ్యభిచారం చేస్తోంది’.. సైబర్ మోసగాళ్లు చెప్పిన అబద్ధం విని చనిపోయిన టీచర్..

Sadhguru Isha Foundation Row: సద్గురు పై కామరాజ్ ఆరోపణలు ఎంతవరకు నిజం ?

PM Internship Scheme: ‘నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త’.. ఉద్యోగశిక్షణతోపాటు ప్రతినెల రూ.5000 ఆర్థికసాయం..

UP Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది కూలీలు మృతి

PM Modi Cabinet Committee: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు.. భద్రతా వ్యవహారాల భేటీలో ప్రధాని ఏమన్నారు?

Train Derailed: మధ్యప్రదేశ్ రత్లామ్ లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్

Isha Foundation: ఈషా ఫౌండేషన్‌‌లో పోలీసుల సోదాలు.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

Big Stories

×