EPAPER

Son Kills Mother & Brother: డిగ్రీలో ఫెయిల్.. తల్లి, తమ్ముడిని దారుణంగా చంపిన యువకుడు!

Son Kills Mother & Brother: డిగ్రీలో ఫెయిల్.. తల్లి, తమ్ముడిని దారుణంగా చంపిన యువకుడు!

Son Kills Mother and Brother: చిన్న చిన్న కారణాలకే చనిపోవడం లేదా చంపడం.. ఇదే పరిష్కారమనుకుంటున్నారు. క్షణికావేశంలో అయిన వారి ప్రాణాలనే బలి తీసుకుంటున్నారు. తాజాగా చెన్నైలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఆ విద్యార్థి డిగ్రీ పరీక్షల్లో ఫెయిలయ్యాడు. నీకు చదవు అబ్బట్లేదు. ఇలాగైతే ఎలా ఉద్యోగం వస్తుందని తల్లి, తమ్ముడు మందలించారు. సరే నా మంచికే చెప్పారు కదా అని మళ్లీ పరీక్షలు రాసి ఉంటే సరిపోయేది. తిట్టిందన్న కోపంతో తల్లిని, తల్లిలేకపోతే తమ్ముడు ఒక్కడే అవుతాడని అతడినీ గొంతుకోసి చంపేశాడు నితీష్ (20). చెన్నై తిరువొట్రియూర్ తిరునగర్ లో జరిగిందీ ఘటన.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మ (45) ఆక్యుపంక్చర్ డాక్టర్. భర్త మురుగన్ ఒమన్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. నితీష్ (20) బీఎస్సీ, సంజయ్ (14) 10వ తరగతి చదువుతున్నారు. నితీష్ డిగ్రీ ఫెయిల్ అయినందుకు తల్లి పద్మ తిట్టిందని ఈ నెల 19న రాత్రి గొంతుకోసి చంపేశాడు. తమ్ముడు ఒంటరవుతాడని అతడినీ చంపేసి.. శుక్రవారం రాత్రి పెద్దమ్మ కూతురు మహాలక్ష్మి ఇంటికి వెళ్లాడు.

అక్కడ ఒక సంచిని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఆ సంచిలో ఏమున్నాయో అని మహాలక్ష్మి తీసి చూడగా.. ఇంటి తాళాలు, ఒక మొబైల్ కనిపించాయి. మొబైల్ ఓపెన్ చేయగా.. ఒక ఆడియో ఉంది. అందులో ఇంటికెళ్లి చూడు అని రికార్డ్ చేసిన నితీష్ వాయిస్ వినిపించింది. ఇంటికెళ్లి చూసిన మహాలక్ష్మికి పద్మ, సంజయ్ ల మృతదేహాలు కనిపించాయి. విషయం పోలీసులకు చెప్పడంతో.. వారు మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.


Also Read: మంత్రికి సన్నిహితుడు.. బీజేపీ యువనేత దారుణ హత్య

నితీష్ కోసం గాలించగా.. కాశిమేడు ఫిషింగ్ హార్బర్ వద్ద పట్టుబడ్డాడు. డిగ్రీ ఫెయిల్ అవ్వడంతో 2 నెలల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయానని, తన స్నేహితులు సర్దిచెప్పగా తిరిగి ఇంటికి వచ్చానని పోలీసులకు చెప్పాడు. అయినా తన తల్లి పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు తిడుతూనే ఉందని, అందుకే ఆమెను చంపేశానని అంగీకరించాడు. నితీష్ పై హత్య కేసులు నమోదు చేసి.. జైలుకు పంపారు.

Tags

Related News

Amethi Family Murder: అమేఠీలో కుటుంబాన్ని హత్య చేసిన సైకో.. హత్యకు ముందే పోలీసులకు సమాచారం… అయినా..

Haryana Elections: హర్యానాలో పోలింగ్ మొదలు.. ఆ పార్టీల మధ్యే ప్రధాన పోటీ, ఫలితాలు ఎప్పుడంటే?

Toilet Tax: ఆ రాష్ట్రంలో టాయిలెట్ ట్యాక్స్ అమలు.. ఇది చెత్త పన్ను కంటే చెత్త నిర్ణయం!

Gurmeet Ram Rahim: ‘ధనవంతులకో న్యాయం.. పేదవారికో న్యాయం’.. 2 సంవత్సరాలలో రేపిస్టు డేరా బాబాకు 10 సార్లు పెరోల్

Viral Video: సెక్రటేరియట్ మూడో అంతస్తు నుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్.. ఎమ్మెల్యేలు, ఎందుకో తెలుసా?

Chhattisgarh Encounter: మావోలకు షాక్, చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్.. 36 మంది మృతి, తప్పించుకున్న అగ్రనేతలు?

Spam Call Death : ‘మీ కూతురు వ్యభిచారం చేస్తోంది’.. సైబర్ మోసగాళ్లు చెప్పిన అబద్ధం విని చనిపోయిన టీచర్..

Big Stories

×