EPAPER

Miyapur: మియాపూర్‌లో ఉద్రిక్తత..

Miyapur: మియాపూర్‌లో ఉద్రిక్తత..

People attacked police and officials: మియాపూర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నవారిని హెచ్ఎండీఏ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు పోలీసులు, హెచ్ఎండీఏ అధికారులపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. పలువురు అధికారులకు గాయాలయ్యాయి. తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ కబ్జాదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. భూకబ్జాదారులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


Also Read: కేటీఆర్ వ్యాఖ్యలపై జాలి చూపించాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

అయితే, మియాపూర్ 100, 101 సర్వే నెంబర్ లో ఉన్న దాదాపు 504 ఎకరాల్లో ప్రజలు గుడిసెలు వేశారు. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ప్రలోభాలతోనే పేదలు గుడిసెలు వేసుకున్నారని వారు పేర్కొన్నారు. గుడిసెలు ఖాళీ చేయకపోతే పీడీయాక్ట్ కేసులు పెడుతామంటూ పోలీసులు స్పష్టం చేశారు. సామాన్యులను రెచ్చగొట్టి ప్రభుత్వ భూములను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. అయితే, ఎట్టిపరిస్థితుల్లో అక్కడి నుంచి కదలబోమంటూ గుడిసెలు తీసేందుకు నిరాకరిస్తున్నారు. ఈ క్రమంలో మియాపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.


Tags

Related News

Minister Seethakka: వారి మరణానికి కారణం మీరు కాదా..? : ప్రధాని మోదీకి మంత్రి సీతక్క కౌంటర్

Scircilla: నేతన్నలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం… దసరా కానుకగా మీకు…

Narsingi: నార్సింగిలో బంగారు గని..?

CM Revanth Reddy: మా ప్రభుత్వానికి ఎవరిమీద కోపం లేదు.. కానీ,… : సీఎం రేవంత్ రెడ్డి

KTR: ఉన్న సిటీకే దిక్కులేదు.. ఫోర్త్ సిటీనా? : కేటీఆర్

TPCC Chief: కేటీఆర్.. అతి తెలివిగా ప్రశ్నలు వేయకు: మహేష్ కుమార్ గౌడ్

Telangana Rice: దసరా పండుగ వేళ తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త… త్వరలోనే..

×