EPAPER

Viral Video: ప్రాణాలు పోయే సమయంలోను.. కలిసి కట్టుగా ఉన్నారండి ఆ ముగ్గురు

Viral Video: ప్రాణాలు పోయే సమయంలోను.. కలిసి కట్టుగా ఉన్నారండి ఆ ముగ్గురు

Viral Video: స్నేహం అంటే ప్రాణాలు ఇచ్చే వారు చాలా మంది ఉంటారు. కానీ ఒకప్పటిలా ఈ కాలంలో అలాంటి నిజమైన స్నేహితులు దొరకడం లేదు. స్నేహం కోసం ఏదైనా చేస్తూ ప్రాణాలైనా ఇచ్చేవారు.. కానీ ఇప్పుడున్న కాలంలో కేవలం ఎదుటి వ్యక్తి దగ్గర ఉన్న డబ్బు కోసం మాత్రమే స్నేహం చేసి అవసరాలకు వాడుకుంటున్నారు. తాజాగా స్నేహం అంటే ఇదేరా అని అనిపించేలా ముగ్గురు స్నేహితులు చేసిన పనికి ప్రపంచం అంతా ఆశ్చర్యపోతుంది. స్నేహితులు అంటే కేవలం సంతోషంలోనే కాదు, కష్టాల్లోను తోడుండేవారు అని నిరూపించారు.


ప్రాణాలు కోల్పోతామనే భయం లేకుండా తోటి స్నేహితుడిని కాపాడుకోవాలని ఒకరికి ఒకరై ముగ్గురు కలిసి నిలబడ్డారు. ఈ ఘటన ఇటలీలో వెలుగుచూసింది. అనుకోకుండా ముగ్గురు స్నేహితులు వరదలో చిక్కుకున్నారు. నదిలోని మధ్యలో ఉండే బండపై నిల్చుని ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకుని ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నించారు. ఒక్కసారిగా నదిలోని వరద ఉధృతి పెరగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే వీరిని కాపాడేందుకు ప్రయత్నించినా కూడా అధికారులు ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. వరదలో కొట్టుకుపోవడం వల్ల చివరికి ముగ్గురి మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రాణాలు కోల్పోయే సమయంలోను తోటి స్నేహితుడి కోసం ఆలోచించిన తీరుకు అందరూ వారిని ప్రశంసిస్తున్నారు.


Related News

Viral video: ఈ బుడ్డోళ్లు తెల్లవారుజాము 3.50కే నిద్రలేస్తారట, వారి పేరెంట్స్‌ ను తిట్టాలా? పొగడాలా?

Divorce Man Carry Wife: విడాకుల విచారణ జరుగుతుండగా.. భార్యను కోర్టు నుంచి ఎత్తుకెళ్లిన భర్త.. చివరికి ఏమైదంటే..

Viral News: ఇల్లు అగ్గి పెట్టె అంత.. అద్దె రూ.45 వేలు, ఎక్కడో తెలుసా?

Viral Video: ‘బతుకు బండి‘ మీదే ప్రాణాలు విడిచి.. కంటతడి పెట్టిస్తున్న వైరల్ వీడియో!

Viral News: ట్రైన్ ఫర్ సేల్.. సీరియస్ బయ్యర్స్ మాత్రమే ట్రై చేయండి- సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో!

Vegetable Buying Guide: ‘ఇంత బతుకు బతికి చివరికి ఈ పని చేయాలా!’.. వైరల్ అవుతున్నరిటైర్డ్ అధికారి ఫన్నీ పోస్ట్

Bus Train Crash Just Miss: బస్సును ఢీ కొట్టబోయిన రెండు రైళ్లు జస్ట్ మిస్.. అంతా గేట్ మెన్ నిర్వాకం..

×