EPAPER

EC receives applications for EVM verification: ఈవీఎంల తనిఖీ, ఏపీ.. తెలంగాణ నుంచి కూడా..

EC receives applications for EVM verification: ఈవీఎంల తనిఖీ, ఏపీ.. తెలంగాణ నుంచి కూడా..

EC receives applications for EVM verification: దేశవ్యాప్తంగా ఈవీఎంలపై చర్చ తారాస్థాయికి చేరింది. ఎన్నికల్లో ఈవీఎంలను దూరంగా పెట్టాలని పలు రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం, ఐఐటీ నిపుణులు సైతం ఈవీఎంలు సేఫ్ అంటూ చెబుతున్నారు. అయినా సరే బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ జరగాల్సిందేనని పట్టుబడుతున్నాయి.


తాజాగా ఈవీఎంల క్రాస్ వెరిఫికేషన్ కోసం దేశవ్యాప్తంగా 11 మంది అభ్యర్థులు కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. ఆరు రాష్ట్రాల నుంచి 8 లోక్‌సభ సీట్లకు నియోజకవర్గాల అభ్యర్థులు అప్లై చేసుకున్నా రు. ఏపీలోని విజయనగరం లోక్‌సభ పరిధిలో ఒక్కో పోలింగ్ స్టేషన్ కు సంబంధించిన ఈవీఎంలను తనిఖీ చేయాలని కోరుతూ వైసీపీ అభ్యర్థి దరఖాస్తు చేశారు.

తెలంగాణలోని జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు పోలింగ్ స్టేషన్లకు సంబంధించి బీజేపీ అభ్యర్థి దరఖాస్తు చేశారు. ఇదేకాకుండా ఛత్తీస్‌గఢ్ లోకి కాంకేర్ లోక్‌‌సభ పరిధిలో నాలుగు, హర్యానాలోని కర్నాల్, ఫరీదాబాద్ లోక్‌సభ పరిధిలో ఆరు పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలను తనిఖీ చేయనున్నారు.


ALSO READ:  లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్, అన్నిపార్టీలకు చెందిన..

కాంగ్రెస్ అభ్యర్థులు మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్, బీజేపీ అభ్యర్థి తమిళనాడులోని వేలూరు పరిధి ఈవీఎం లను తనిఖీ చేపట్టాలని అప్లై చేశాయి. కోర్టుల్లో దాఖలయ్యే ఎన్నికల పిటిషన్ల స్థితిగతుల ఆధారంగా వీటిని తనిఖీ చేపడతామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

Tags

Related News

Biryani For Prisoners: మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ – ఖైదీలకు స్పెషల్ మెనూ.. 4 రోజులు పండగే పండుగ!

Maldives Flight Bookings: మల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ ఆరంభం.. 9 నెలల తర్వాత మళ్లీ దోస్తీ, కానీ..

Naveen Jindal: గుర్రంపై వచ్చి ఓటేసిన నవీన్ జిందాల్, వీడియో వైరల్

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Amethi Family Murder: అమేఠీలో కుటుంబాన్ని హత్య చేసిన సైకో.. హత్యకు ముందే పోలీసులకు సమాచారం… అయినా..

Haryana Elections: హర్యానాలో పోలింగ్ మొదలు.. ఆ పార్టీల మధ్యే ప్రధాన పోటీ, ఫలితాలు ఎప్పుడంటే?

Toilet Tax: ఆ రాష్ట్రంలో టాయిలెట్ ట్యాక్స్ అమలు.. ఇది చెత్త పన్ను కంటే చెత్త నిర్ణయం!

×