EPAPER
Kirrak Couples Episode 1

IAS Praveen prakash Farewell Message: ఆ ఐఏఎస్ అధికారి పశ్చాత్తాపం, ఎవరినీ అవమానించలేదు..

IAS Praveen prakash Farewell Message: ఆ ఐఏఎస్ అధికారి పశ్చాత్తాపం, ఎవరినీ అవమానించలేదు..

IAS Praveen prakash Farewell Message: సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ పశ్చాత్తాపం వ్యక్తంచేశారు. తాను ఎవరినీ అవమానించలేదని, ఎవరినైనా తాను బాధ పెట్టినట్టు భావిస్తే వారికి చేతులు జోడించి ప్రార్థిస్తున్నానని తెలిపారు.


జగన్ సర్కార్‌లో కీలకమైన పదవుల్లో కొనసాగారాయన. ఆయన చెప్పినట్టే ఒక్కోసారి అప్పటి సీఎం జగన్ వినేవారు. విశాఖలో జరిగిన ఓ ఈవెంట్‌లో మోకాళ్లపై పడి జగన్‌తో మాట్లాడిన సందర్భాలు చూసినవాళ్లు ఇంతలా అధికారులు దిగజారిపోతారా అని చర్చించుకున్నారు. గడిచిన ఐదేళ్లలో కీలక శాఖలు నిర్వహించారు. ఇప్పుడేకాదు వైఎస్ హయాంలో కూడా ఆయన ఇదే విధంగా వ్యవహరించారని సీనియర్ నేతలు తరచూ చెబుతుంటారు. ఏపీలో ప్రభుత్వం మారాక కొందరి అధికారుల తలరాతలు మారాయి.

రాజకీయ నేతలేకాదు.. చివరకు ఉద్యోగులు సైతం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఎవరోకాదు సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్. గడిచిన కొద్ది నెలలుగా విద్యాశాఖలో తాను ఎవర్నీ అవమానించ లేదని సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్‌ప్రకాష్ ఫేవ్‌వెల్ పేరిట వీడియో సందేశం వినిపించారు. తాను ఎవరినైనా అవమానించినట్టు అనిపిస్తే వారికి చేతులు జోడించి ప్రార్థిస్తున్నానని వెల్లడించారు. గతంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆయనను టీడీపీ ప్రభుత్వం బదిలీ చేసింది.


గురువారం సచివాలయంలో విద్యాశాఖ సెక్రటరీగా కోన శశిధర్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ప్రవీణ్ ప్రకాష్ ఓ వీడియోను విడుదల చేశారు. అందులోకి కీలకమైన పాయింట్లు. విద్యాశాఖలో తాను ఎంతో నేర్చుకున్నానని, ఆ శాఖ పురోగతి కోసమే కృషి చేశానని మనసులోని మాటను బయటపెట్టారు.

ALSO READ: నిన్న ఐఏఎస్, నేడు ఐపీఎస్.. ఈ ముగ్గురు అధికారులకు ఝలక్

పాఠశాలలో తనిఖీల పేరిట ఉపాధ్యాయులను తాను అవమానించానంటూ సోషల్ మీడియాలో వచ్చిన విషయాలను గుర్తు చేశారు. దయచేసి వాటిని మనసులోని పెట్టుకోవద్దని, మరో మనిషిని అవమానించే గుణం తనకు లేదని తెలిపారు. మొత్తానికి చెప్పాల్సిన నాలుగు ముక్కలను సూటిగా చెప్పేశారాయ. మరి ఆ శాఖ ఉద్యోగులు ఏమంటారో చూడాలి.

 

 

Tags

Related News

Nara Bhuvaneshwari: ప్లీజ్ ఈ ఒక్క మాట వినండి.. ప్రజలను కోరిన సీఎం సతీమణి

Perni Nani: మీ హాస్పిటల్ లో భజన చేసుకోండి.. ఒక్క హిందువుకైనా ఫ్రీగా వైద్యం అందించారా.. బీజేపీ మహిళా నేతకు వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్

Jagan Tirumala Tour : జగన్ తిరుమల టూర్ రద్దుకు కారణాలు ఇవేనా… కూటమికి ఛాన్స్ ఇచ్చినట్టేనా ?

Union Minister Comments On Tirumala Laddu: తిరుమల లడ్డు వివాదం.. బాంబ్ పేల్చిన కేంద్ర మంత్రి

BJP Vs YCP: బీజేపీతో తాడో పేడో.. జగన్ సాహసం చేస్తున్నారా?

YS Jagan: వైఎస్ జగన్‌‌కు కామ్రెడ్లే దిక్కవుతారా?

Home Minister Anitha : జగన్ ను ఆడేసుకున్న హోంమంత్రి అనిత… నాలాగా నువ్వు చెప్పగలవా ?

Big Stories

×