EPAPER

Revanth Reddy cabinet expansion: రేవంత్ కేబినెట్ విస్తరణ, ఐదుగురుకి చోటు! ఎప్పుడంటే..

Revanth Reddy cabinet expansion: రేవంత్ కేబినెట్ విస్తరణ, ఐదుగురుకి చోటు! ఎప్పుడంటే..

Revanth Reddy cabinet expansion: స్థానిక సంస్థల ఎన్నికల వేళ కేబినెట్ విస్తరణ దృష్టి సారించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ వ్యవహారంపై ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్‌తో మంతనాలు జరిపారు. దాదాపు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు అంతర్గత సమాచారం. తెలంగాణలోని ముఖ్యనేతలు ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో తమకున్న సంబందాల ద్వారా లాబీయింగ్ మొదలుపెట్టారు. అంతా అనుకున్నట్లు జరిగితే జులై మొదటివారంలో కేబినెట్ విస్తరణ ఉంచవచ్చని అంటున్నారు.


ప్రస్తుతం ముఖ్యమంత్రితోపాటు 12 మంది మంత్రివర్గంలో ఉన్నారు. మరో ఐదారుగురు ఛాన్స్ ఉన్నా, ఈసారి ఐదుగురుకి చోటు కల్పించాలని భావిస్తున్నారట. రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో కొన్ని జిల్లాలకు ఎక్కువ ప్రాతినిధ్యం దక్కగా, కొన్ని జిల్లాలకు అసలు చోటు లేదు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన నేతలెవ్వరూ లేరు.

ఈసారి ఆయా జిల్లాలకు ఛాన్స్ ఇవ్వాలన్నది అసలు పాయింట్. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి చాలామంది జాయిన్ అయ్యారు.. మరికొందరు రేపోమాపో కాంగ్రెస్‌లోకి రావాలని భావిస్తున్నారు. తమకు మంత్రివర్గం లో చోటు లేకపోయినా, మిగతా పదవులు ఇవ్వాలని కోరుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ సమాచారం.


ALSO READ: నో వర్క్ .. నో పోస్ట్.. డైలమాలో కేటీఆర్ ఫ్యూచర్

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ముదిరాజ్‌లకు ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పెద్దలు.  వారిలో ముక్తల్ నుంచి శ్రీహరికి రావచ్చని అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, ప్రేమసాగర్, సుదర్శన్‌రెడ్డి, మైనార్టీల నుంచి ఒకరు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక స్థానాన్ని ఖాళీగా ఉంచి, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత దాన్ని భర్తీ చేయాలని భావిస్తున్నారట సీఎం రేవంత్‌రెడ్డి. కేబినెట్ విస్తరణ తర్వాత నాలుగైదు నెలల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం.

Tags

Related News

KTR: ఉన్న సిటీకే దిక్కులేదు.. ఫోర్త్ సిటీనా? : కేటీఆర్

TPCC Chief: కేటీఆర్.. అతి తెలివిగా ప్రశ్నలు వేయకు: మహేష్ కుమార్ గౌడ్

Telangana Rice: దసరా పండుగ వేళ తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త… త్వరలోనే..

Hydra: కబ్జాగాళ్ల గుండె జారే న్యూస్.. హైడ్రా‌కు చట్టబద్దత, గవర్నర్ గ్రీన్ సిగ్నల్, కానీ..

Bathukamma Celebrations: గాంధీ భవన్‌లో బతుకమ్మ సంబరాలు.. పాల్గొన్న జగ్గారెడ్డి

Man on Charminar: చార్మినార్‌ పైకి ఎక్కిన వ్యక్తి… స్టంట్స్ చేస్తున్నాడా..?

Jaggareddy: నువ్వు ఢిల్లీ వెళ్లు… నేను మీ మామ ఫాం హౌస్‌ కు వెళ్తా.. హరీష్ రావుకు జగ్గారెడ్డి సవాల్

×