EPAPER

YS Sharmila on Sonia Gandhi Family: సోనియా ఫ్యామిలీతో వైఎస్ షర్మిల.. ఏపీ రాజకీయాలపై చర్చలు.. ఆ విధంగా ముందుకు ..

YS Sharmila on Sonia Gandhi Family: సోనియా ఫ్యామిలీతో వైఎస్ షర్మిల.. ఏపీ రాజకీయాలపై చర్చలు.. ఆ విధంగా ముందుకు ..

YS Sharmila Meeting with Sonia Gandhi, Rahul and Priyanka Gandhi: ఎన్నికల ముగియడంతో రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులు ఏఐసీసీ పెద్దలను కలుస్తున్నారు. ఈ జాబితాలో ముందున్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. సోమవారం ఢిల్లీ వెళ్లిన ఆమె, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకలతో భేటీ అయ్యారు. ఏపీ రాజకీయాలపై దాదాపు గంటపాటు చర్చించారు.


ఏపీలో పార్టీ పరిస్థితి గురించి ఆరా తీశారు సోనియాగాంధీ ఫ్యామిలీ. తమ పార్టీకి ఏపీలో పాజిటివ్ సంకేతాలు ఉన్నాయని, ఇదే దూకుడు కంటిన్యూ చేస్తే, పార్టీ పుంజుకోవచ్చని అన్నట్లు తెలుస్తోంది. మోదీ విధానాల పై విసిగిపోయిన ఏపీ ప్రజలు.. కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నారన్నది అసలు పాయింట్. ముఖ్యంగా భవిష్యత్తు ప్రణాళికలు, తదుపరి కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి కావడంతో కీలక నేతలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశముందని ఏఐసీసీ పెద్దల అంచనా.

వీలు ఉన్నప్పుడు ఏపీలో పర్యటిస్తే పార్టీ పుంజుకోవడానికి అవకాశాలు ఉన్నాయని సోనియా ఫ్యామిలీకి వైఎస్ షర్మిల సూచన చేశారట. రాబోయే ఐదేళ్లలో బలపడవచ్చని అంచనాలు వేస్తున్నారు. మొత్తానికి ఏ నేతకు ఇవ్వని ప్రయార్టీ వైఎస్ షర్మిలకు ఇవ్వడంతో ఏపీ కాంగ్రెస్ కేడర్‌లో ఉత్సాహం రెట్టింపయ్యింది.


Also Read:  వైసీపీకి షాక్.. మాజీమంత్రి శిద్దా రాఘవరావు రాజీనామా

మరోవైపు ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఈనెల 20, 21 తేదీల్లో నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ సమీక్షలు నిర్వహించనుంది. రెండురోజులపాటు లోక్‌సభ నియోజకవర్గాలపై చర్చించనున్నారు వైఎస్ షర్మిల. ఈ సమావేశానికి కొందరు సీనియర్ నేతలు హాజరుకానున్నారు. ఇదిలావుండగా పార్టీ ఓటమిపై కొందరు నేతలు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. వీటిపై కూడా ఈ సమావేశాల్లో చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

Swiggy Services Ban: ఏపీలో స్విగ్గీ సేవలు బ్యాన్, హోటల్స్ యాజమాన్యాలు కీలక నిర్ణయం, కారణం తెలుసా?

SIT inquiry: తిరుమల లడ్డూ వివాదం.. ఈ వారం రంగంలోకి సిట్, తొలుత..

Deputy Cm Pawan: పవన్ కల్యాణ్‌కు బిగ్‌షాక్.. కేసు నమోదు, ఎందుకంటే..

TDP vs YCP: ధర్మారెడ్డి, భూమన.. జగన్ బంధువులే, ఇదిగో వంశవృక్షం, ఆ వివరాలన్నీ లీక్!

Minister Satyakumar: జగన్ కు షాక్.. వైఎస్సార్ జిల్లా పేరు మార్చాలంటూ సీఎంకు లేఖ రాసిన మంత్రి

Kalasha Naidu: ‘బిగ్ బాస్’ నూతన్ నాయుడు కూతురికి ప్రతిష్టాత్మక అవార్డు, 11 ఏళ్లకే సమాజ సేవ.. సెల్యూట్ కలశా!

AP Ministers: నూతన విచారణ కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నాం.. హోం మంత్రి వంగలపూడి అనిత

Big Stories

×