EPAPER

Shahid Afridi: బాబర్ నీకంత స్వార్థం పనికిరాదు: షాహిద్ ఆఫ్రిది

Shahid Afridi: బాబర్ నీకంత స్వార్థం పనికిరాదు: షాహిద్ ఆఫ్రిది

Shahid Afridi Accuses Babar Azam for Pakistan poor performance in World Cup 2024: 2023 వన్డే వరల్డ్ కప్ జరిగి ఆరునెలలైంది అంతే.. మళ్లీ టీ 20 వరల్డ్ కప్ వచ్చింది. కప్ లు మారుతున్నాయి. వేదికలు మారుతున్నాయి.. కానీ పాకిస్తాన్ ఆట తీరులో మాత్రం మార్పు రావడం లేదని సీనియర్లు విమర్శిస్తున్నారు. వీరిలా అంటూనే ఉంటారు. వారలాగే ఆడుతుంటారని మరికొందరు అంటున్నారు. పాకిస్తాన్ క్రికెటర్లకి ఇవన్నీ అలవాటైపోయాయని, వారు పట్టించుకోడం మానేశారని కొందరంటున్నారు.


ఇంతకీ విషయం ఏమిటంటే, టీమ్ ఇండియా సూపర్ 8కి వెళ్లిపోవడం, పాకిస్తాన్ గ్రూప్ దశ నుంచే ఇంటి దారి పట్టడంతో ఆదేశంలో అందరికి పుండు మీద కారం జల్లినట్టుగా ఉంది. దీంతో ఆ అక్కసునంతా పాకిస్తాన్ జట్టుపై, ముఖ్యంగా బాబర్ అజామ్ పై చూపిస్తున్నారు.

ముఖ్యంగా పాక్ సీనియర్ క్రికెటర్ షాషిద్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతని స్వార్థమే పాకిస్థాన్ జట్టును నాశనం చేసిందని మండిపడ్డాడు. నీకంత స్వార్థం పనికిరాదని అన్నాడు. బాబర్ ఆజామ్ చెత్త కెప్టెన్సీ కారణంగానే టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ దారుణంగా విఫలమైందని, గ్రూప్ దశలోనే ఇంటి దారిపట్టిందని ఆరోపించాడు. తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ.. షహిన్ అఫ్రిది నుంచి బాబర్ ఆజామ్ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాల్సింది కాదని అభిప్రాయపడ్డాడు.


సెలెక్షన్ కమిటీలోని కొందరు బాబర్ ఆజమ్‌కు కెప్టెన్సీ చేయడమే రాదని చెప్పారు. మళ్లీ అతనికే సారథ్య బాధ్యతలు అప్పగించారని అఫ్రిది ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో బాబర్ ఆజామ్‌ ఒక్కడినే తప్పుబట్టాల్సిన పనిలేదని అన్నాడు. సెలెక్షన్ కమిటీకి కూడా ఇందులో భాగం ఉందని ఘాటు విమర్శలు చేశాడు. షహీన్ ఆఫ్రిది తన అల్లుడు కావడంతో ఇలా మాట్లాడుతున్నాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Also Read: పాక్ జట్టులో వాళ్లని తీసేయండి: షెహజాద్ ఆగ్రహం

ఎందుకంటే టీ20 ప్రపంచకప్ టోర్నీలో బాబర్ ఆజామ్ సారథ్యంలో పాకిస్థాన్ విఫలమవడం ఇదే తొలిసారి. టీ20 ప్రపంచకప్ 2021లో సెమీస్ చేరిన పాకిస్థాన్.. 2022 లో ఫైనల్ కి చేరింది. కానీ 2024లో మాత్రం లీగ్ దశ నుంచి ఇంటిదారి పట్టింది.

కెప్టెన్ ఒక్కడేం చేస్తాడు? 11 మంది కలిసికట్టుగా ఆడితేనే క్రికెట్ ఆట.. ఒక్క కెప్టెన్ వ్యూహాలతో గ్రౌండులో అద్భుతాలు జరగవని కొందరు బాబర్ ని వెనకేసుకు వస్తున్నారు. మొత్తానికి టీ 20 ప్రపంచకప్ వైఫల్యంతో పాకిస్తాన్ లో కొంతకాలం.. ఈ తంతు తప్పదని కొందరంటున్నారు.

Tags

Related News

Rohit Sharma: 2027 వరకు రోహిత్ శర్మనే కెప్టెన్..కాంగ్రెస్ ప్రకటన

Mohammed Shami: మహమ్మద్ షమీది దొంగ ప్రేమ..మాజీ భార్య హాసిన్ సంచలనం!

Ind vs Ban: హైదరాబాద్‌లో భారత్-బంగ్లాదేశ్‌ మ్యాచ్.. నేటి నుంచి టికెట్ల విక్రయం

Ms Dhoni: RCBపై కోపంతో ధోనీ… TV పగలగొట్టేశాడు..క్లారిటీ ఇదే?

Rashid Khan: పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్‌..ఒకే రోజూ 4 గురికి !

T20 World Cup: నేడు మహిళా టీ20 ప్రపంచకప్‌లో ఇండియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌

Telangana BIG TV Cricket League : తమన్ ఊచకోత.. 34 బంతుల్లో సెంచరీ

Big Stories

×