EPAPER

Tomatoes: పచ్చి టమాటలతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

Tomatoes: పచ్చి టమాటలతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

Tomatoes: టమాట అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. ప్రతి వంటల్లో టమాటను వేసుకోవడం చాలా మందికి ఇష్టం, టమాట పచ్చడి, టమాట రసం, టమాట కూర వంటి రకరకాల వంటకాలు చేస్తూ ఆస్వాదిస్తుంటారు. ముఖ్యంగా ఎర్రటి టమాటోలను వీటి కోసం వాడుతూ ఉంటారు. సాంబార్, కూరలు వంటి వంటకాల్లో టమాటలు వేస్తే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. అయితే ఎర్రటి టమాటలే కాకుండా, వీటిలో చాలా రకాలు ఉంటాయి. పచ్చి టమాటలు, చిన్న టమాటలు కూడా వంటకాలకు అద్భుతంగా పనిచేస్తాయి.


ముఖ్యంగా పచ్చి టమాటలను కూర వండుకుని తిన్నా కూడా చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. పచ్చి టమాటల్లో కాల్షియం, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. అంతేకాదు వీటిలో విటమిన్లు ఏ,సీ కూడా ఉంటాయి. అయితే ఈ పచ్చి టమాటలను తినడం వల్ల శరీరానికి కాల్షియం, విటమని కె శరీరానికి అందుతాయి. వీటి వల్ల ఎముకలు ధృడంగా మారుతాయి. అంతేకాదు చిన్న పిల్లలకు పచ్చి టమాటలను తినిపస్తే వారు చాలా బలంగా ఉంటారు.

పచ్చి టమాటల్లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండడం వల్ల కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు విటమిన్ ఏ ఇందులో ఉండడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండేలా సంరక్షిస్తుంది. టమాటల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉండడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతకర వ్యాధుల నుండి నివారణ కల్పిస్తాయి. ముఖ్యంగా అధిక రక్తపోటుతో బాధపడే వారికి పచ్చి టమాటలు తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాదు డయాబెటీస్ తో బాధపడే వారికి పచ్చి టమాటలు ఓ మంచి మెడిసిన్ అని నిపుణులు అంటున్నారు.


Related News

Instant Glow Facial: పండుగ వేళ.. ఇంట్లో దొరికే వస్తువులతో ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. ఇన్‌స్టంట్‌ గ్లో ఖాయం

Relationships: మీ మాజీ లవర్‌తో ఇప్పటికీ స్నేహంగా ఉంటున్నారా? ఇది మంచి ఆలోచనేనా?

Amla Rice: ఉసిరికాయ అన్నం ఇలా చేసుకొని తింటే లంచ్ బాక్స్‌కు బాగుంటుంది, ఇది ఎంతో ఆరోగ్యం కూడా

Youthful Glow: ఎప్పటికీ యవ్వనంగా ఉండాలా? డైలీ, ఈ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ తింటే చాలు.. వయస్సే తెలియదు

Rice Water: గంజి వచ్చేలా అన్నం వండి ఆ గంజినీళ్లను ప్రతిరోజూ తాగండి, మీరు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి

Thyroid: వీటితో ఇంట్లోనే థైరాయిడ్‌కు చెక్ !

Hair Spa: ఇంట్లోనే హెయిర్ స్పా.. ఎలా చేసుకోవాలో తెలుసా ?

Big Stories

×