EPAPER

Malaria Fever: వానాకాలంలో దోమల బెడద.. మలేరియా వ్యాపిస్తే ఈ జాగ్రత్తలు పాటించండి

Malaria Fever: వానాకాలంలో దోమల బెడద.. మలేరియా వ్యాపిస్తే ఈ జాగ్రత్తలు పాటించండి

Malaria Fever: వర్షాకాలం వచ్చింది అంటే చాలు వైరస్, అంటువ్యాధులు వ్యాపిస్తుంటాయి. అంటువ్యాధులలో ప్రమాదకరమైన వాటిలో మలేరియా కూడా ఒకటి ఇది దోమలు కుట్టడం వల్ల వ్యాపిస్తుంది. ఇది శరీరంలోని రక్తంలోకి ప్రవేశించి నేరుగా కాలేయానికి వెళుతుంది. ఇలా అక్కడ అభివృద్ధి చెంది మలేరియా వ్యాపిస్తుంది. ఒక్కసారి ఈ మలేరియా సోకితే ఆ వ్యక్తికి పుట్టబోయే బిడ్డకు కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. అంతేకాదు మలేరియా సోకిన వ్యక్తి నుంచి అవయవ దానం, రక్త దానం వంటివి చేసినా కూడా గ్రహితకు కూడా ఈ అంటువ్యాధి వ్యాపిస్తుంది.


సాధారణంగా మలేరియా వర్షాకాలంలోనే వ్యాపిస్తుంది. వర్షం కారణంగా రోడ్లు, ఇళ్ల పక్కన గుంతల్లో నీరు నిలవడం వల్ల కీటకాలు, దోమలు వ్యాపించి మలేరియా సోకుతుంది. అందువల్ల తరచూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

దాల్చిన చెక్క:


మలేరియా లక్షణాలు ఉన్న వ్యక్తి దాల్చినచెక్క, నల్ల మిరియాలు వాడడం వల్ల కాస్త ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మలేరియా చికిత్సకు సహకరిస్తాయి. అందువల్ల దాల్చిన చెక్క, నల్ల మిరియాలు పొడిని వేసిన నీటిలో తేనెను కలుపుకుని తాగాలి.

పసుపు:

పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని విషపదార్థాలను తొలగించడానికి పసుపు సహాయపడుతుంది. అందువల్ల పసుపుతో మలేరియా వంటి అంటువ్యాధిని నశింపజేయవచ్చు.

ఆరెంజ్ జ్యూస్:

ఆరెంజ్ జ్యూస్‌లో విటమిన్ సి ఉండడం వల్ల ఇది రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. అంతేకాదు జ్వరాన్ని తగ్గించడంలోను ముఖ్య పాత్ర పోషిస్తుంది. మలేరియా వ్యాపించిన సమయంలో ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

తులసి:

తులసి ఆయుర్వేదంలో ఔషధంలా పనిచేస్తుంది. తులసి నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మలేరియా జ్వరం వ్యాపించిన సమయంలో దాని తీవ్రతను తగ్గించేందుకు తులసి చక్కగా పనిచేస్తుంది.

Related News

Instant Glow Facial: పండుగ వేళ.. ఇంట్లో దొరికే వస్తువులతో ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. ఇన్‌స్టంట్‌ గ్లో ఖాయం

Relationships: మీ మాజీ లవర్‌తో ఇప్పటికీ స్నేహంగా ఉంటున్నారా? ఇది మంచి ఆలోచనేనా?

Amla Rice: ఉసిరికాయ అన్నం ఇలా చేసుకొని తింటే లంచ్ బాక్స్‌కు బాగుంటుంది, ఇది ఎంతో ఆరోగ్యం కూడా

Youthful Glow: ఎప్పటికీ యవ్వనంగా ఉండాలా? డైలీ, ఈ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ తింటే చాలు.. వయస్సే తెలియదు

Rice Water: గంజి వచ్చేలా అన్నం వండి ఆ గంజినీళ్లను ప్రతిరోజూ తాగండి, మీరు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి

Thyroid: వీటితో ఇంట్లోనే థైరాయిడ్‌కు చెక్ !

Hair Spa: ఇంట్లోనే హెయిర్ స్పా.. ఎలా చేసుకోవాలో తెలుసా ?

Big Stories

×