EPAPER

Roja: మంచి చేసి ఓడిపోయాం.. గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం: రోజా

Roja: మంచి చేసి ఓడిపోయాం.. గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం: రోజా

AP Ex- Minister Roja: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రోజా తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. అందులో ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో మంచి చేశాం.. అయినా కూడా తాము ఓడిపోయాం.. ఓడిపోయినంత మాత్రాన ఎందుకు సిగ్గుపడాలన్నారు. మనం మంచి చేసి ఓడిపోయాం.. అలాంటప్పుడు ఎందుకు సిగ్గుపడాలి..? గౌరవంగా తలెత్తుకు తిరుగుదామంటూ ఆమె అందులో పేర్కొన్నారు.


శుక్రవారం ఆమె సోషల్ మీడియా(ఎక్స్)లో ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేస్తూ తమ నేతలకు, కార్యకర్తలకు ఉత్తేజాన్ని నింపారు. ‘చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాల! కానీ.. మంచి చేసి ఓడిపోయాం! గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం! ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం!’ అంటూ రోజా ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. తన ఫొటోను షేర్ చేసి ఈ విధంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ పలు విధాలుగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

ఇటు ఏపీ మంత్రులకు చంద్రబాబు శాఖలు కూడా కేటాయించిన విషయం తెలిసిందే. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడినవారిని ఎట్టి పరిస్థితుల్లో వదలబోమంటూ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చంటూ పలువురు చర్చిస్తున్నారు.


Also Read: జగన్ వ్యూహాత్మక తప్పిదం.. వైసీపీ నుంచి బీసీలు అవుట్!

కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించింది. అయితే, గతంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు వస్తాయని ఆశించిన వైస్సార్ సీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. కనీసం ప్రతిపక్ష హోదా వచ్చేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. వైసీపీ తరఫున నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి రోజా ఓటమి పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి గాలి భాను చేతిలో దారుణంగా ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తరువాత సోషల్ మీడియాలో పలు పోస్ట్ లు పెడుతూ వస్తోంది. తాజాగా కూడా ఈ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

Related News

Deputy Cm Pawan: పవన్ కల్యాణ్‌కు బిగ్‌షాక్.. కేసు నమోదు, ఎందుకంటే..

TDP vs YCP: ధర్మారెడ్డి, భూమన.. జగన్ బంధువులే, ఇదిగో వంశవృక్షం, ఆ వివరాలన్నీ లీక్!

Minister Satyakumar: జగన్ కు షాక్.. వైఎస్సార్ జిల్లా పేరు మార్చాలంటూ సీఎంకు లేఖ రాసిన మంత్రి

Kalasha Naidu: ‘బిగ్ బాస్’ నూతన్ నాయుడు కూతురికి ప్రతిష్టాత్మక అవార్డు, 11 ఏళ్లకే సమాజ సేవ.. సెల్యూట్ కలశా!

AP Ministers: నూతన విచారణ కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నాం.. హోం మంత్రి వంగలపూడి అనిత

CM Chandrababu: తన రికార్డ్ తనే తిరగరాసిన సీఎం చంద్రబాబు.. 10 సార్లు పైగానే శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ

Ys Jagan: బాబుకు భయం లేదు.. భక్తి లేదు.. అన్నీ అబద్దాలే.. సుప్రీం ఆదేశాలపై జగన్ స్పందన

Big Stories

×