EPAPER

Infinix Note 40 5G: వీళ్లు తెగించారు..108 MP కెమెరాతో ఇన్ఫినిక్స్ ఆల్ రౌండర్ ఫోన్.. పూనకాలు రావాల్సిందే..!

Infinix Note 40 5G: వీళ్లు తెగించారు..108 MP కెమెరాతో ఇన్ఫినిక్స్ ఆల్ రౌండర్ ఫోన్.. పూనకాలు రావాల్సిందే..!

Infinix Note 40 5G Launch: స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇన్ఫీనిక్స్ త్వరలో భారతదేశంలో ఇన్ఫీనిక్స్ Note 40 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. రాబోయే స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది ఏప్రిల్‌లో లాంచ్ చేసిన ఇన్ఫీనిక్స్ Note 40 Pro 5G స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో రానుంది. కంపెనీ భారతదేశంలో ఇన్ఫీనిక్స్ Note 40 5G యొక్క లాంచ్ తేదీని, హ్యాండ్‌సెట్ డిజైన్, కలర్ వేరియంట్లను వెల్లడించింది.గత నెలలో ఫిలిప్పీన్స్‌లో లాంచ్ అయిన ఈ మొబైల్ ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి ఇన్ఫినిక్స్ విడుదల చేయనున్న స్మార్ట్‌ఫోన్ గురించి తెలుసుకుందాం.


ఇన్ఫినిక్స్ Note 40 5G జూన్ 21న భారతదేశంలో లాంచ్ అవుతుందని కంపెనీ శుక్రవారం నిర్ధారించింది. స్మార్ట్‌ఫోన్‌లో కొద్దిగా పొడవైన రౌండ్ మాడ్యూల్‌లో ఉండే ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ ఉంది. డిస్‌ప్లే చాలా స్లిమ్ బెజెల్స్‌తో కనిపిస్తుంది. ఫ్రంట్ కెమెరా కోసం డిస్‌ప్లే మధ్యలో పంచ్ హోల్ కటౌట్‌ ఉంటుంది. USB టైప్ C ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ గ్రిల్స్ హ్యాండ్‌సెట్ కింద ఎడ్జ్‌లో కనిపిస్తాయి. అయితే రైట్ ఎడ్జ్‌లో వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో అబ్సిడియన్ బ్లాక్, టైటాన్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో విడుదల చేయనున్నారు.

Also Read: ఒక్క రోజు మాత్రమే.. 3 లక్షల మంది కొన్న ఫోన్‌పై భారీ ఆఫర్.. దద్దరిల్లే డీల్!


ఇన్ఫినిక్స్ Note 40 5G ఫీచర్ల విషయానికి వస్తే ఇండియన్ వేరియంట్ 120Hz రిఫ్రెష్ రేట్, 93.8 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో 6.78-అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్  33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ మాగ్ ఛార్జ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్‌ను కలిగి ఉంటుది.

ఇన్పినిక్స్ Note 40 Pro+ 5G, Note 40 Pro 5G మోడల్‌లానే ఇది కూడా JBL పాట్నర్షిప్‌తో డెవలప్ చేయబడిన సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. సిస్టమ్ మెరుగైన ఆడియో, 360-డిగ్రీల సౌండ్, బూస్ట్ బాస్‌ని అందజేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 8GB RAM+ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్‌తో వస్తుంది. MediaTek డైమెన్సిటీ 7020 SoC చిప్‌సెట్ ఉంటుంది.

Also Read: దిమాక్ కరాబ్ డీల్స్.. ఐఫోన్, సామ్‌సంగ్ ఫోన్‌పై వేలల్లో డిస్కౌంట్స్.. కొంటే ఇప్పుడే కొను!

ఫోన్ డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP53 రేటింగ్‌తో Android 14 బేస్‌డ్ XOS 14లో రన్ అవుతుంది. ఇందులో ఫోటోల కోసం ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంటుంది. ఇది 108-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు డ్యూయల్ 2-మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలను కలిగి ఉంది.  ఈ ఫోన్‌ సెల్ఫీల కోసం 32-మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాను కలిగి ఉంటుంది.

Tags

Related News

DigiYatra Airport : విదేశాల్లో ప్రయాణానికీ ‘డిజియాత్ర’ ఎఫ్‌ఆర్‌టీ..

Online Shopping : టాప్ సీక్రెట్… అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ నిజమైన ధరలు తెలుసుకోండిలా!

Google Storage : గూగుల్‌ స్టోరేజీ నిండిపోయిందా? – ఇలా చేస్తే డబ్బులు కట్టకుండానే స్టోరేజీ పెంచుకోవచ్చు!

Oppo : రియల్ మీ, సామ్ సాంగ్, వివోలను వెనక్కి నెట్టేసిన ఒప్పో..

Linkedin Jobs : డ్రీమ్ జాబ్​ కోసం ఎదురుచూస్తున్నారా? – ​ లింక్డ్ ఇన్ ప్రొఫైల్​లో ఇలా చేస్తే చాలు!

Oura Ring 4 : స్మార్ట్‌ రింగారే – 6 రంగులతో 12 సైజుల్లో… తక్కువ ధరకే, సూపర్ ఫీచర్స్​తో!

Disable Slow Charging : అయ్యో.. స్మార్ట్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ సరిగ్గా ఎక్కట్లేదా!

Big Stories

×