EPAPER

Harom Hara: సినిమాలు మాత్రమే ఫ్లాప్.. యాక్టర్‌గా నేనెప్పుడూ ఫెయిల్‌ కాలేదు.. టాలీవుడ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Harom Hara: సినిమాలు మాత్రమే ఫ్లాప్.. యాక్టర్‌గా నేనెప్పుడూ ఫెయిల్‌ కాలేదు.. టాలీవుడ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Harom Hara: టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు సక్సెస్‌తో సంబంధం లేకుండా డిఫరెంట్ కథలతో ఆకట్టుకుంటున్నాడు. అయితే కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేక అల్లాడుతున్నాడు. ‘హంట్, ‘మామా మశ్చింద్ర’ సినిమాలు నిరాశపరిచాయి. తాజాగా, సుధీర్ బాబు హీరోగా దర్శకుడు జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కించిన సినిమా ‘హరోం హర’. ఇందులో మాళవిక హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా ఈ నెల 14న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను ‘మైత్రి మూవీ మేకర్స్’ నైజాంలో విడుదల చేస్తుంది. ఈ సినిమా సందర్బంగా సుధీర్ బాబు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.


స్టోరీ విని షాక్ అయ్యా..
జ్ఞానసాగర్‌ కథను చెప్పేందుకు తొలిసారి కలిసినప్పుడు ఏదైనా లవ్ స్టోరీ చెబుతాడని అనుకున్నా. అయితే ఈ స్టోరీ చెప్పగానే షాక్‌కు గురయ్యా. ఇలాంటి పీరియాడిక్ యాక్షన్ స్టోరీ వినగానే చేయాలని అనుకున్నానని సుధీర్ బాబు వెల్లడించారు. ఈ స్టోరీ 1980లో అప్పటి కుప్పం నేపథ్యంలో సాగుతోంది. డైరెక్టర్ చాలా ఆలోచించి తీశాడు. అప్పటి వాస్తవ సంఘటనల ఆధారంగా తీసుకొని స్టోరీ సిద్ధం చేసుకున్నాడు. సినిమాను రియాల్టీగా తెరకెక్కించాడు. ఈ సినిమా ట్రైలర్ చూసి మహేశ్ బాబు చాలా బాగుందని చెప్పినట్లు చెప్పాడు.
తప్పులు చేశా..
నేను నటించిన సినిమాల్లో కొన్ని తప్పులు జరిగాయి. అయితే ఈ సినిమాలో గతంలో జరిగిన తప్పులు లేకుండా సరిచేసుకున్నాం. ఈ సినిమాలో నా పాత్రకు మ్యానరిజం ఉంటుంది. ముఖ్యంగా కుప్పం ప్రాంతం సంభాషణ ఆకట్టుకుంటుంది. తెలుగులో మొదటి పది చిత్రాల్లో ‘హరోం హర’ ఉంటుంది. యాక్షన్ తో పాటు ఎమోషనల్ ఉన్న సినిమా అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు సీక్వెల్ ఉండే అవకాశం ఉందని, ఫలితం ఆధారంగా సీక్వెల్ విషయాన్ని ప్రకటిస్తామన్నారు.
హీరోగా ఫెయిల్ కాలేదు
విభిన్న కథల్లో నటించాలని కోరుకుంటానని, అందుకే కొన్ని సక్సెస్ అవుతుంటే.. మరికొన్ని ఫ్లాప్ అవుతున్నాయని సుధీర్ బాబు చెప్పారు. అయితే నా సినిమాలు విజయం సాధించనప్పటీకీ నటుడిగా ఫెయిల్ కాలేదనే అనుకుంటున్నానన్నారు. ఎప్పుడూ నటుడిగా నన్ను నేను నిరూపించుకోవాలని అనుకుంటానని చెప్పారు. అయితే ఇటీవల కొత్త సీఎం చంద్రబాబును కలిసి విషెస్ చెప్పానని, కుప్పం నేపథ్యంలో సినిమా చేశానని ఆయన దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. ఇందులో ‘ఇంక సెప్పెదేమ్ లేద.. సేసేదే’ అనే డైలాగ్ చెప్పగానే నవ్వేశారన్నారు. ఇక ప్రస్తుతం ‘మా నాన్న  సూపర్ హీరో’తో నటిస్తున్నానని, మరో రెండు సినిమాలకు ఓకే చేశానని వెల్లడించారు.


Tags

Related News

Harsha Sai : హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ… అవన్నీ రూమర్లేనా?

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ స్కామ్ లో మెహబూబ్… ఎంతకు తెగించార్రా!?

Sudheer Babu : మంచు హీరోను మోసం చేసిన సుధీర్ బాబు… వాడుకున్నంత వాడుకుని సారీ చెప్పేస్తే సరిపోతుందా?

Posani Murali Krishna : కొండా సురేఖ వివాదంపై స్పందించని బాలయ్య… పోసాని షాకింగ్ కామెంట్స్

Rocking Rakesh – Sujatha : పండండి బిడ్డకు జన్మనిచ్చిన జబర్దస్త్ సుజాత

Sai Rajesh : మా ప్రొడ్యూసర్ తిట్టుకున్న పర్లేదు, చెప్తే ఇది కాంట్రవర్సీ అవుతుంది

Trump Advice To Israel: ‘ఇరాన్ అణు స్థావారాలపై వెంటనే దాడి చేయండి’.. ఇజ్రాయెల్ కు ట్రంప్ సలహా

Big Stories

×