EPAPER

Jagan: మహా అయితే నాలుగు కేసులు పెడుతారు.. అంతే తప్ప అంతకుమించి ఏం చేయలేరు: జగన్

Jagan: మహా అయితే నాలుగు కేసులు పెడుతారు.. అంతే తప్ప అంతకుమించి ఏం చేయలేరు: జగన్

Jagan Mohan Reddy Comments: ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తన కార్యాలయంలో ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఎవరెన్ని కూట్రలు చేసినా వైఎస్సీర్ సీపీ పాలనలో జరిగిన మంచి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు.


‘ఇటీవల జరిగిన పరిస్థితుల గురించి మీకు తెలిసిందే. ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసి మీరు నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. 40 శాతం ప్రజలు మనవైపే ఉన్నారు.. ఈ విషయాన్ని మనం మరిచిపోవొద్దు. మన ప్రభుత్వ హయంలో జరిగిన మంచి ఇప్పటికీ ప్రజలకు గుర్తుంది. ఎన్నికల ఫలితాలు శకుని పాచికలు మాదిరిగా ఉన్నాయి. ఈవీఎంల వ్యవహారాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ప్రస్తుతం టీడీపీ, బీజేపీ, జనసేన హనీ మూన్ నడుస్తోంది. అందువల్ల కొంత సమయం వారికి ఇద్దాం. శిశుపాలుడు మాదిరిగా చంద్రబాబు తప్పులను లెక్కించాలి. ఆ తరువాత గట్టిగా పోరాటం చేద్దాం.

2019 నుంచి 2024 వరకు ఐదేళ్లు గడిచిపోయినట్టే.. 2024 నుంచి 2029 వరకు కూడా ఈ ఐదేళ్లు ఇట్టే గడిచిపోతాయి. మనం ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే.. సినిమాలో ఫస్టాఫ్ మాత్రమే అయిపోయింది. గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఏ విధంగానైతే పైకి లేచామో అనేది మీకందరికీ తెలిసిందే. ప్రజల్లో మనం చేసిన మంచి ఇవాళ స్పష్టంగా కనిపిస్తుంది. ఇంటింటికీ మనం చేసిన మంచి బ్రతికే ఉంది.. ఉంటది. ఇవన్నీ ఉన్నప్పుడు మళ్లీ మనం పైకి లేవడం అనేది కూడా తథ్యం. కాకపోతే కొంత సమయం పడుతది. ఆ సమయం వారికి ఇవ్వాలి. ఆ టైం వచ్చినప్పుడు వాళ్ల పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా మళ్లీ మనం పైకి లేస్తాం. ఈ విషయాన్ని మనమంతా గుర్తించుకోవాలి


Also Read: ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. తొలి సంతకం ఏ ఫైల్‌పై పెట్టారంటే..?

అసెంబ్లీలో మన సంఖ్యా బలం పెద్దగా లేనందున, ఆ సభలో గొంతు విప్పే అవకాశం మనకు రాకపోవొచ్చు.. వచ్చినా మన గొంతు విప్పనివ్వకపోవొచ్చు. కానీ, మనకు మండలిలో బలం చాలా ఉంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనల్ని ఎవరూ ఏం చేయలేరు. మహా అయితే నాలుగు కేసులు పెట్టగలుగుతారు.. అంతే తప్ప అంతకుమించి ఏం చేయలేరు. చంద్రబాబు హయాంలో చాలా త్వరగా పాపాలు పండుతాయి. ఇందుకు సంబంధించి గతంలో మనం చూశాము’ అంటూ జగన్ వ్యాఖ్యానించారు.

Tags

Related News

CM Chandrababu: ఆ విషయంలో వెనక్కి తగ్గం.. సీఎం చంద్రబాబు క్లారిటీ

Perni Nani: నా వెంట్రుక కూడ పీకలేరు.. కోసి కారం పెట్టండి.. మాజీ మంత్రి నాని సెన్సేషనల్ కామెంట్స్

AP Politics: లోకేష్ కి పోటీగా అంబటి.. గ్రీన్ బుక్ ఓపెన్.. పేర్లన్నీ రాస్తున్నా.. ఎవ్వరినీ వదలనంటూ కామెంట్

Swiggy Services Ban: ఏపీలో స్విగ్గీ సేవలు బ్యాన్, హోటల్స్ యాజమాన్యాలు కీలక నిర్ణయం, కారణం తెలుసా?

SIT inquiry: తిరుమల లడ్డూ వివాదం.. ఈ వారం రంగంలోకి సిట్, తొలుత..

Deputy Cm Pawan: పవన్ కల్యాణ్‌కు బిగ్‌షాక్.. కేసు నమోదు, ఎందుకంటే..

TDP vs YCP: ధర్మారెడ్డి, భూమన.. జగన్ బంధువులే, ఇదిగో వంశవృక్షం, ఆ వివరాలన్నీ లీక్!

Big Stories

×