EPAPER

HMD Ridge 5G Launched: బడ్జెట్ లెజెండ్.. HMD నుంచి చీపెస్ట్ 5G ఫోన్.. ఇదొక రేంజ్‌లో ఉంటది!

HMD Ridge 5G Launched: బడ్జెట్ లెజెండ్.. HMD నుంచి చీపెస్ట్ 5G ఫోన్.. ఇదొక రేంజ్‌లో ఉంటది!

HMD Ridge Budget 5G Phone: HMD గ్యాప్ లేకుండా వరుసగా స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తోంది. కంపెనీకి చెందిన అనేక స్మార్ట్‌ఫోన్‌లు బడ్జెట్ ధరలో తీసుకొస్తుంది. వీటిలో అట్లాస్, స్కైలైన్ స్మార్ట్‌ఫోన్లు ఇటీవల లీక్ అయ్యాయి. ఇప్పుడు అలాంటిదే మరో స్మార్ట్ ఫోన్ రాబోతోంది. హెచ్‌ఎండీ రిడ్జ్ పేరుతో దీన్ని విడుదల చేయనున్నారు. దీని డిజైన్ మరియు కీలక స్పెసిఫికేషన్‌లు లీక్‌లో వెల్లడయ్యాయి. హెచ్‌ఎమ్‌డి సంస్థ త‌న సొంత బ్రాండింగ్‌తో ఈ ఫోన్ విడుదల చేస్తోంది. ఈ ఫోన్‌లో ఎటువంటి ఫీచర్లు ఉంటాయి? ధర, తదితర వివరాలు గురించి తెలుసుకుందాం.


HMD రిడ్జ్ కంపెనీకి చెందిన మరో స్మార్ట్‌ఫోన్ రివీల్ అయింది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో రానుంది. HMD_MEME’S అనే వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఈ ఫోన్ గురించి సమాచారాన్ని వెల్లడించాడు. HMD స్కైలైన్ గురించి కూడా కొన్ని స్పెసిఫికేషన్లు లీక్ చేశారు. HMD రిడ్జ్ రౌండ్ షేపుడ్ కెమెరా మాడ్యూల్‌ని కలిగి ఉంటుంది. ఇందులో ఎల్‌ఈడీ ఫ్లాష్‌తోపాటు రెండు కెమెరాలు ఉంటాయి. ముందు వైపు ఫోన్ మధ్యలో పంచ్ హోల్ కటౌట్ ఉంది. ఫోన్ పింక్ కలర్‌లో కనిపిస్తుంది.

Also Read: మోటో నుంచి వేరే లెవల్ ఫోన్.. మైండ్ బ్లాక్ చేస్తున్న ఫీచర్లు.. మామూలు స్కెచ్ కాదిది..!


HMD రిడ్జ్ 6.4-అంగుళాల FullHD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌‌కు సపోర్ట్ ఇస్తుంది. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ డిస్‌ప్లేలో కనిపిస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కనిపిస్తుంది.

HMD రిడ్జ్ ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 480+ చిప్‌సెట్‌తో ఉంటుంది. ఇందులో 5G కనెక్టివిటీ కూడా కనిపిస్తుంది. 4GB, 6GB, 8GB RAM వేరియంట్‌లను ఫోన్‌లో చూడవచ్చు. స్టోరేజ్ కోసం దీనిని 128GB, 256GB వేరియంట్లలో లాంచ్ చేయవచ్చు. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Also Read: చాలా రోజులకు.. ఒప్పో నుంచి కిరాక్ ఫోన్లు.. మొబైల్ అంటే ఇలా ఉండాలి!

ఈ ఫోన్ హెచ్‌ఎమ్‌డి అట్లాస్‌కి లైటర్ వెర్షన్‌గా తీసుకురానున్నారు. అంటే ఇందులో స్పెసిఫికేషన్స్‌ కొన్ని తక్కువగా కనిపిస్తాయి. అందువల్ల కంపెనీ దీని ధరను కూడా చాలా తక్కువగా ఉంచుతుంది. రాబోయే రోజుల్లో HMD  అనేక స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. అయితే హెచ్‌ఎమ్‌డీ అట్లాస్ చాలా స్పెషల్ స్మార్ట్‌ఫోన్. ఇప్పుడు అవి సేల్‌కు వస్తాయో చూడాల్సి ఉంది.

Tags

Related News

DigiYatra Airport : విదేశాల్లో ప్రయాణానికీ ‘డిజియాత్ర’ ఎఫ్‌ఆర్‌టీ..

Online Shopping : టాప్ సీక్రెట్… అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ నిజమైన ధరలు తెలుసుకోండిలా!

Google Storage : గూగుల్‌ స్టోరేజీ నిండిపోయిందా? – ఇలా చేస్తే డబ్బులు కట్టకుండానే స్టోరేజీ పెంచుకోవచ్చు!

Oppo : రియల్ మీ, సామ్ సాంగ్, వివోలను వెనక్కి నెట్టేసిన ఒప్పో..

Linkedin Jobs : డ్రీమ్ జాబ్​ కోసం ఎదురుచూస్తున్నారా? – ​ లింక్డ్ ఇన్ ప్రొఫైల్​లో ఇలా చేస్తే చాలు!

Oura Ring 4 : స్మార్ట్‌ రింగారే – 6 రంగులతో 12 సైజుల్లో… తక్కువ ధరకే, సూపర్ ఫీచర్స్​తో!

Disable Slow Charging : అయ్యో.. స్మార్ట్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ సరిగ్గా ఎక్కట్లేదా!

Big Stories

×