EPAPER

Cessation of Farmers’ Protest : అమరావతే రాజధాని.. నాలుగున్నరేళ్ల తర్వాత రైతుల దీక్ష విరమణ

Cessation of Farmers’ Protest : అమరావతే రాజధాని.. నాలుగున్నరేళ్ల తర్వాత రైతుల దీక్ష విరమణ

Amaravati Farmers’ Protest(Latest news in Andhra Pradesh): నాలుగున్నరేళ్ల తర్వాత అమరావతి రైతులు దీక్షను విరమించారు. అంతేకాదు.. దీక్షా శిబిరాలను కూడా ఎత్తివేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని కోసం భూమిని ఇచ్చిన రైతులకు అమరావతిపై ఆశలు చిరుగురించాయి. దానికి తోడు.. అమరావతే ఏపీకి ఏకైక రాజధానిగా ఉంటుందని చంద్రబాబు ప్రకటించడం.. నిన్న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో రైతులు దీక్షను విరమించారు.


2014లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత అమరావతి రైతులు రాజధాని కోసం 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారు. అక్కడ నిర్మాణాలు, పనులు వేగవంతం అవుతున్న సమయంలో రాష్ట్రంలో అధికారం చేతులు మారింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. దీంతో.. అమరావతికి భూమి ఇచ్చిన రైతులు ఆందోళనలు, నిరసనల బాట పట్టారు. మళ్లీ ప్రభుత్వం మారే వరకూ ఓ వైపు న్యాయపోరాటం చేస్తూనే.. మరోవైపు దీక్షలు చేశారు. రైతులు కోరుకున్నట్టు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. అమరావతే రాజధానిగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇవ్వడంతో దీక్షను విరమించారు.

ఇప్పటికే అమరావతిలో పనులు వేగవంతం అయ్యాయి. రాజధానిలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు పూర్తి అయ్యాయి. వందకు పైగా జేసీబీ యంత్రాలు కంప, పిచ్చి చెట్లను తొలగించాయి. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 217 చదరపు కిలోమీటర్ల రాజధాని అమరావతిలో 32 పెద్ద రోడ్‌లను నిర్మాణం చేయటానికి ప్లాన్ రెడీ అయింది. ప్రధాన రోడ్ల నిర్మాణం పూర్తి చేసి రైతుల ప్లాట్లలో అభివృద్ధి పనులు చేసేందుకు సీఆర్డీఏ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే స్ట్రీట్‌ లైట్లతో రాజధానిలో కొత్త వెలుగులు వచ్చాయి.


Tags

Related News

TTD: అన్నప్రసాదంలో జెర్రి.. తీవ్ర స్థాయిలో ఖండించిన టీటీడీ.. నమ్మొద్దు అంటూ ప్రకటన

Biryani Offer: రండి బాబు రండి.. రూ.3కే చికెన్ బిర్యానీ, ఎక్కడో తెలుసా?

Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్నారా.. టీటీడీ కీలక ప్రకటన మీకోసమే..

Trolling War: సాయంత్రం 6 దాటితే జగన్‌కు కళ్లు కనిపించవా? వైసీపీ సమాధానం ఇదే!

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వర్షాలు దంచుడే.. దంచుడు..

Tirumala: తిరుమలలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు – టీటీడీ మరో సంచలన నిర్ణయం

TTD: తిరుమల వెళుతున్నారా.. ఇక అసలు అస్త్రం మీ చేతిలోనే.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

×