EPAPER

Astrology: రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్ని పనుల్లో విజయం!

Astrology: రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్ని పనుల్లో విజయం!
Astrology: 12 రాశుల్లో గురువారం ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది? ఎవరికి విజయం వరిస్తుంది? ఎవరికి దైవానుగ్రహం ఉందో వంటి విషయాలను తెలుసుకుందాం.
మేషం:
మేష రాశి వారికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో మనస్సు నియంత్రణ అవసరం. పెద్దల సలహాలు తీసుకోవాలి. వేంకటేశ్వరుడిని పూజించాలి.
వృషభం:
ఈ రాశి వారు ముఖ్యమైన పనుల్లో ఆచిచూతి వ్యవహరించాలి. కీలక సమయాల్లో జాగ్రత్తలు పాటిస్తే వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు.చేపట్టిన పనుల్లో తప్పకుండా విజయం సాధిస్తారు. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కోపం తగ్గించుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇష్టమైన దేవ నామాన్ని జపించాలి.
 మిథునం: 
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి విజయం సాధిస్తారు.సమస్యల నుంచి సమయస్ఫూర్తితో బయటపడతారు. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది.ఇతరుల నుంచి అవమానాలు ఎదురవుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆదిత్య హృదయం చదవాలి.
కర్కాటకం:
ఈ రాశి వారికి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అనుకున్నది సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గట్లు లాభాలు వస్తాయి. ఆర్థికంగా ఎదుగుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆదరాభిమానాలు ఉంటాయి. రావాల్సిన డబ్బు అందుతుంది. ఇష్టదైవాన్ని ప్రార్థించాలి.
సింహం:
ఈ రాశి వారకికి చంద్రబలం అనుకూలంగా ఉంది. చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సోదరులతో ఆస్తి వ్యవహారంలో ఉహించని విభేదాలు వస్తాయి. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఇష్టదైవాన్ని ప్రార్థించాలి.
కన్యరాశి:
ఈ రాశివారికి అనుకూలంగా ఉంది. చేసిన పని ఫలిస్తుంది. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగాలు మారే ప్రయత్నాలకు సానుకూల స్పందర ఉంటుంది. తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. గొడవలకు పోకపోవడం మంచింది. శ్రీలలితాదేవి స్తుతి చేయాలి.
తులరాశి:
ఈ రాశి వారికి అనుకున్న పనులు సులభంగా జరుగుతాయి. మీ పట్టుదలే మిమ్మల్ని నడిపిస్తుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కాతాయి. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. విష్ణు ధ్యానం చేయాలి.
వృశ్చికం
ఈ రాశి వారికి ఉద్యోగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. భక్తిశ్రద్ధలతో పనులను పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
ధనుస్సు: 
అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తే ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. శుభకార్యక్రమాల్లోపాల్గొంటారు. వృత్తి,  వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండదు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. విష్ణు  సహస్రనామ పారాయణ చేయాలి.
మకరం:
ఈ రాశి వారికి ఆదాయానికి లోటు ఉండదు. సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ప్రారంభించిన పనుల్లో అంతరాయం లేకుండా చూడాలి. విఘ్నాలు ఎదురవుతాయి. చంచల బుద్ధి ఇబ్బంది పెడుతుంది. శుభకార్యాల్లో ఖర్చు చేస్తారు. బంధువులతో ఆచిచూచి వ్యవహరించాలి. శ్రీహరిని ఆరాధించాలి.
కుంభం:
ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకొవద్దు. మీ మీ రంగాల్లో అనుకున్న ఫలితాలు వస్తాయి. కుటుంబం ఆనందంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలం. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. బంధువులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కనకధారాస్తవం చదవాలి.
మీనం: 
మీనం రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. గృహ, వాహన సంబంధమైన ప్రణాళికలు వేస్తారు. మానసిక సౌఖ్యం కలదు. బంధు, మిత్రులతో సహకారం లభిస్తుంది. కీలక వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయరాదు. గోసేవ చేయాలి.


Related News

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Big Stories

×