EPAPER
Kirrak Couples Episode 1

Ganta Srinivas : గంటా టీడీపీకి షాక్ ఇస్తారా?.. ఆ పార్టీలో చేరడం ఖాయమా?

Ganta Srinivas : గంటా టీడీపీకి షాక్ ఇస్తారా?.. ఆ పార్టీలో చేరడం ఖాయమా?

Ganta Srinivas :


గంటా శ్రీనివాసరావు ఎక్కడ ఉంటే గెలుపు అక్కడే ఉంటుంది. ఏపీ రాజకీయాల్లో ఇదో సెంటిమెంట్. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసినా…ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగినా విజయం మాత్రం ఖాయం. ఎంపీగా బరిలోకి దిగినా.. ఎమ్మెల్యేగా పోటీ చేసినా గెలుపు ఆయనదే. గంటా పార్టీ మారుతున్నారంటే పక్కాలెక్కలుంటాయి. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యారు . అది కూడా నాలుగు వేర్వేరు నియోజకవర్గాల నుంచి కావడం విశేషం. ఆ స్థానాలన్నీ ఉమ్మడి విశాఖలో జిల్లాలోనివే. అంటే విశాఖను గంటా తన అడ్డగా మార్చేసుకున్నారు.

ప్రకాశం జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు విశాఖ కేంద్రం వ్యాపారం చేస్తూ రాజకీయాల్లో ప్రవేశించారు. తొలిసారిగా 1999లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2004లో చోడవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో సైకిల్ దిగి ప్రజారాజ్యం పార్టీలో చేరి.. అనకాపల్లి ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగురవేశారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో కొన్నాళ్లు కాంగ్రెస్ కొనసాగారు. అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగానూ గంటా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు అంచనా వేసిన గంటా…వెంటనే టీడీపీలో చేరిపోయారు. 2014లో భీమిలి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చంద్రబాబు కేబినెట్ లో స్థానం దక్కించుకున్నారు.


గెలిచినా టీడీపీకి దూరం
ఎప్పుడూ పోటీ చేసిన స్థానం నుంచి తిరిగి పోటీ చేసే అలవాటు లేని గంటా 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నుంచి విజయం సాధించారు. వైఎస్ఆర్ సీపీ ప్రభంజనంలోనూ 2 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.

వైసీపీలో చేరతారని ప్రచారం
వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంటా పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. వైఎస్ఆర్ సీపీ కండువా కప్పుకోవడం లాంఛనమే అనే ప్రచారం సాగింది. అయినా సరే రాజకీయ లెక్కలు పక్కాగా వేసే గంటా మౌనంగానే ఉన్నారు.

ఆచితూచి అడుగులు

గంటా గతంలో రెండు సందర్భాల్లో ఎన్నికలకు కొద్దికాలం ముందు మాత్రమే పార్టీ మారారు. టీడీపీ నుంచి ప్రజారాజ్యంలోకి వచ్చినప్పుడు కానీ…కాంగ్రెస్ నుంచి తిరిగి టీడీపీకి వచ్చినప్పుడు కానీ ఎన్నికలకు కాస్త ముందు మాత్రమే నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. మరి గంటా ఇప్పుడే పార్టీ మారతారా మరో ఏడాది ఆగుతారనే అనేది చూడాలి. మరోవైపు ఆయనతోపాటు టీడీపీ నేతలు మీసాల గీత, అప్పలన్నాయుడును వైఎస్ఆ ర్సీ పీలోకి తీసుకెళతారని ప్రచారం సాగుతోంది. మరి గంటా టీడీపీకి షాక్ ఇస్తారా? కొంతకాలం ఆగుతారా అనేది ఆసక్తికరంగా మారింది.

గంటా పొలిటికల్ కెరీర్
1999లో అనకాపల్లి ఎంపీగా గెలుపు ( టీడీపీ)
2004లో చోడవరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపు ( టీడీపీ)
2009లో అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలుపు( ప్రజారాజ్యం)
2014 భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపు ( టీడీపీ)
2019 విశాఖ ఉత్తరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపు ( టీడీపీ)

Related News

Tirumala Laddu issue: వైసీపీ పాపప్రక్షాళన? తిరుమలకు జగన్, అన్ని ఆలయాల్లో పూజలు చేయాలంటూ పిలుపు!

Ys Sharmila: మా అన్న ముంచాడు.. మీరైనా ఆ పని చేయండి.. షర్మిళ కామెంట్స్

Political Heat: కూటమికి తలనొప్పిగా మారిన ఆ జిల్లా.. తన్నుకుంటున్న తమ్ముళ్ళు.. సైనికులు ?

Tirumala Laddu: సెటైరికల్ ట్వీట్ తో డిప్యూటీ సీఎం పవన్ కి షాక్.. రిప్లై కూడా అదిరింది

Payyavula Keshav: మీరు చేసిన పాపాలు చాలు.. మళ్లీ మీ పూజలెందుకు?.. వైసీపీపై పయ్యావుల సీరియస్

Perni Nani: లడ్డూ వివాదంపై వైసీపీ సీరియస్.. రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేయాలని పిలుపు.. ఏ రోజున అంటే..?

Sajjala Arrest: బిగిస్తున్న ఉచ్చు.. జైలుకి సజ్జల రామకృష్ణా రెడ్డి?

Big Stories

×