EPAPER

PM Modi with Pawan, Chiranjeevi: చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమం.. మోదీ, పవన్, చిరంజీవి అభివాదం వెనుక ఏముంది..?

PM Modi with Pawan, Chiranjeevi: చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమం.. మోదీ, పవన్, చిరంజీవి అభివాదం వెనుక ఏముంది..?

PM Modi with Pawan, Chiranjeevi on Chandrababu Oath: సందట్లో సడేమియా అంటే ఇదేనేమో. రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి మనసు మారుతుందా? తాను సాధించలేనిది తన తమ్ముడు పవన్ కల్యాణ్ సాధించడం ఆశ్చర్య పోతున్నారా? కేంద్ర ప్రభుత్వ పెద్దల మధ్య తమ్ముడు పవన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చూసి మళ్లీ రాజకీయాల్లోకి రావాలని చిరంజీవి భావిస్తున్నారా? ఇవే ప్రశ్నలు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోంది.


విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం జరిగింది. కార్యక్రమం ఊహించని విధంగా సాగింది. వేదికపైనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అతిధుల గ్యాలరీలో చిరంజీవి ఉన్నారు. ప్రధాని నరేంద్రమోదీ వేదికపై సీఎం చంద్రబాబుతో మాట్లాడు తుండగా అక్కడికి పవన్‌కల్యాణ్ వచ్చారు. ప్రధానికి చెవిలో ఏదో చెప్పారు. వెంటనే పవన్ చేయి పట్టుకుని మోదీ.. చిరంజీవి దగ్గరకు వెళ్లారు.

ఈ ముగ్గురు నేతలు కలిసి ఒక్కసారిగా చేతులు పైకెత్తారు. తర్వాత పవన్‌ను చెక్కిళ్లు పట్టుకుని ఆనందంతో పొంగిపోయారు చిరంజీవి. ఏదో మాట్లాడే ఉంటారనుకోండి.. అది తర్వాత విషయం. అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రధాని నరేంద్రమోదీ ఆ సన్నివేశాన్ని చూసి ఆనందపడిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సన్నివేశంపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.


Also Read: Nara Lokesh : పవన్ కాళ్లు మొక్కిన నారా లోకేష్.. నెట్టింట వీడియో వైరల్

PM Modi with Pawan Kalyan and Chiranjeevi Interesting scene on Stage at chandrababu Oath
PM Modi with Pawan Kalyan and Chiranjeevi Interesting scene on Stage at chandrababu Oath

చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం వేదికపై ఉన్నది ఆషామాషీ వ్యక్తి కాదు.. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ. సందర్భాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంతో ఆయనకు తిరుగులేదంటారు. ఏమో రేపటి రోజున చిరంజీవిని రాజకీయాల్లోకి ప్రధాని మోదీ ఆహ్వానించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు అక్కడి చూసిన నేతలు, వీఐపీలు.

Also Read: “చంద్రబాబు నాయుడు అనే నేను..” హోరెత్తిన సభా ప్రాంగణం

తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని పలుమార్లు చిరంజీవి చెప్పకనే చెప్పారు. అంతేకాదు తన తమ్ముడు పవన్ పోటీ చేసినా, కేవలం వీడియో సందేశంతో మాత్రమే సరిపెట్టారు. కానీ ప్రచారం చేసిన సందర్భం లేదు. ఇవాళ సన్నివేశం చేసి చిరు మనసు మార్చుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం.

Tags

Related News

TTD: అన్నప్రసాదంలో జెర్రి.. తీవ్ర స్థాయిలో ఖండించిన టీటీడీ.. నమ్మొద్దు అంటూ ప్రకటన

Biryani Offer: రండి బాబు రండి.. రూ.3కే చికెన్ బిర్యానీ, ఎక్కడో తెలుసా?

Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్నారా.. టీటీడీ కీలక ప్రకటన మీకోసమే..

Trolling War: సాయంత్రం 6 దాటితే జగన్‌కు కళ్లు కనిపించవా? వైసీపీ సమాధానం ఇదే!

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వర్షాలు దంచుడే.. దంచుడు..

Tirumala: తిరుమలలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు – టీటీడీ మరో సంచలన నిర్ణయం

TTD: తిరుమల వెళుతున్నారా.. ఇక అసలు అస్త్రం మీ చేతిలోనే.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

×