EPAPER

Former CM KCR Politics: ఓ రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదో కేసీఆర్ ఓ ఉదాహరణ

Former CM KCR Politics: ఓ రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదో కేసీఆర్ ఓ ఉదాహరణ

KCR is the Best Example for Politicians: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పరిస్థితి అగమ్యగోచరం తయారైంది. ఓ రకంగా చెప్పాలంటే.. కేసీఆర్ రాజకీయ జీవితంలో ఇంతటి దారుణమైన పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా కేసీఆర్ తన మార్క్ రాజకీయం చూపించేవారు. కానీ.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడంతో కేసీఆర్ ను తెలంగాణ సమాజమే మర్చిపోయే ప్రమాదం కనిపిస్తోంది. కూతురు తీహార్ జైల్లో, మరోవైపు కేసీఆర్ ను కూడా చుట్టూ ముడుతున్న కేసులు. ఏ క్షణం ఏ కేసులో నోటీసులు వస్తాయో తెలియదు. ఇప్పటి యాదాద్రి విద్యుత్ ప్లాంట్ నిర్మాణంలో అవకతవకలపై సమాధానం చెప్పాలని నోటీసులు అందాయి.


25 ఏళ్లు తెలంగాణ రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేసిన కేసీఆర్.. ఇప్పుడు ఉన్నారా? లేరా అన్నట్టు తయారైంది. అయితే.. వరుస ఓటముల కారణంగానే కేసీఆర్‌కు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పలేం. అధికారంలో ఉన్నపుడు ఆయన వ్యవహరించిన తీరు.. ఓడిపోయిన తర్వాత ఆయన్ని అధ:పాతాళానికి తొక్కేసిందని చెప్పాలి. అధికారంలో ఉన్నపుడు నిరంకుశత్వంగా వ్యవహరిస్తూ శత్రువులను పెంచుకుంటూ పోతే ఇలాంటి పరిస్థితే వస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షమే ఉండకూడదనే ఆలోచనకు మించి నిరంకుశత్వం మరొకటి ఉండదు. 2014 తర్వాత టీడీపీని, 2018 తర్వాత కాంగ్రెస్ ను లేకుండా చేయాలని చాలా ప్రయత్నించారు.

Also Read: విద్యుత్ కొనుగోళ్ల ఇష్యూ, కేసీఆర్‌కు నోటీస్, వచ్చేనెల 30 తర్వాతే అంటూ


కానీ.. ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యం ఉండదు. అందుకే.. తెలంగాణలో ఉండదు అనుకున్న కాంగ్రెస్ ను ప్రజలు ఆదరించారు. దానికి తోడు ప్రతిపక్షనేతలపై కేసీఆర్ వ్యవహించిన తీరు ఇప్పుడు ఆయనకు శత్రువులను తెచ్చి పెట్టింది. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని.. బీఆర్ఎస్ హయాంలో ఎంత ఇబ్బంది పెట్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ దెబ్బ కొట్టిన ప్రతీసారి రేవంత్ రెడ్డి గోడకు తగిలిన బంతి లాగా అంతే వేగంగా వెనక్కి వచ్చేవారు. ఓ రకంగా చెప్పాలంటే.. రేవంత్ రెడ్డి సీఎం అవ్వడానికి కేసీఆర్ కూడా ఓ కారణమని చెప్పాలి.

మరోవైపు అధికారం ఉంది కదా అని కేసీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడేవారు. వ్యక్తిగా కాకపోయినా.. ప్రధాని పదవికి అయినా గౌవరం ఇవ్వాలి. కానీ, కేసీఆర్ మోడీపై చాలా సార్లు దురుసుగా మాట్లాడారు. ఇక.. చంద్రబాబు విషయంలో కక్ష గట్టి మరీ 2019లో ఏపీలో టీడీపీని ఓడించారు. దేశవ్యాప్తంగా చంద్రబాబుకి ఓ గౌరవం ఉంది. కానీ, కేసీఆర్ మాత్రం ఆయన్ని ఓ లీడర్ గా చూడటానికి కూడా ఇష్టపడే వారు కాదు. సన్నాసి, సుంట అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడేవారు. కానీ.. కేసీఆర్ తిట్టిన వారంతా ఇప్పుడు బాగానే ఉన్నారు. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం.. చంద్రబాబును, రేవంత్ రెడ్డిని విజయం వరించింది. కానీ.. కేసీఆర్ ను ప్రతిపక్ష నేతగా కూడా ప్రజలు కానీ.. సహచర రాజకీయ నాయకులు కానీ గుర్తించడం లేదు.

Also Read: కేటీఆర్ సీన్ రివర్స్.. ఇక చాల్లే.. తప్పుకో.. అని ట్రోలింగ్

చంద్రబాబుకి ప్రతిపక్షం కానీ, అధికార పక్షం కానీ.. కొత్త కాదు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయనకు ఉన్న క్రెడిబిలిటీ ఎప్పుడూ తగ్గిపోలేదు. రాజకీయ ప్రత్యర్థులు కూడా వ్యక్తిగతంగా చంద్రబాబును గౌరవిస్తారు. హైదరాబాద్ లో అభివృద్దికి బీజం వేసింది చంద్రబాబే అని ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తారు. కానీ.. కేసీఆర్ మాత్రం ఆ మాట చెప్పడానికి ఇష్టపడలేదు. అయితే.. తాను మొదలు పెట్టిన అభివృద్దిని వైఎస్ఆర్, కేసీఆర్ కొనసాగించారని చంద్రబాబు చాలా సార్లు చెప్పారు. ఇదే చంద్రబాబు, కేసీఆర్ కు ఉన్న తేడా. ఆ తేడాయే పదవితో సంబంధం లేకుండా చంద్రబాబు గౌరవాన్ని పెంచింది. అధికారం కోల్పోగానే కేసీఆర్ ను తొక్కిపెట్టింది.

కేసీఆర్ ఎవరిని అయితే.. శత్రువులుగా చూశారో వాళ్లంతా ఇప్పుడు అధికారంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు, మోడీ. అధికారం శాశ్వతం కాదు కాబట్టి.. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా? అంటే.. ప్రజలు కేసీఆర్ ను రాజకీయ నాయకుడిగా చూడలేదు. ఓ నియంతలా చూశారు. అందుకే టైం చూసి ఇంటికి పరిమితం చేశారు. కాబట్టి కేసీఆర్ రాజకీయ జీవితం చరిత్రలో కలిసిపోవడమే తప్ప.. భవిష్యత్ మాత్రం లేదు. ఓ రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదో కేసీఆర్ ఒక ఉదాహరణ.

Tags

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×