EPAPER

AP New Cabinet Ministers: ఏపీ మంత్రి వర్గం ఖరారు.. 17మంది కొత్తవారే.. పవన్ కల్యాణ్‌కు ఆ శాఖ..?

AP New Cabinet Ministers: ఏపీ మంత్రి వర్గం ఖరారు.. 17మంది కొత్తవారే.. పవన్ కల్యాణ్‌కు ఆ శాఖ..?

AP New Cabinet Ministers: టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలోని 24మందితో రాష్ట్ర కేబినేట్ కొలువుదీరనుంది. 24మందితో మంత్రివర్గ జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఇందులో జనసేనకు 3, బీజేపీకి ఒక పదవి కేటాయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితోపాటు మరో 22 మంది ప్రమాణ స్వీకారం చేస్తారు. పవన్ కల్యాణ్‌తో పాటు 24 మంది మంత్రుల జాబితాను అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ప్రకటించారు. ఇందులో 17మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. వీరంతా తొలిసారి మంత్రి పదవి చేపట్టనున్నారు. ఎనిమిది మంది బీసీలు, నలుగురు కమ్మ, నలుగురు కాపు, ముగ్గురు రెడ్డి, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనార్టీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి పదవి వరించింది. అలాగే ముగ్గురు మహిళలకు చోటు లభించింది.


బీజేపీ నుంచి సత్యకుమార్..

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చంద్రబాబు చర్చించారు. బీజేపీ నుంచి ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న విషయంపై సుదీర్ఘంగా చర్చించడంతో జాబితా ప్రకటించడంలో జాప్యం జరిగింది. చివరికి సత్యకుమార్ యాదవ్‌కు చోటు లభించింది. అలాగే టీడీపీ నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంత్రి వర్గంలో చేరారు. జనసేన నుంచి ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌, నాదేండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లకు మంత్రి వర్గంలో చోటు దక్కింది.


Also Read: Real Hero Pawan Kalyan : రియల్ హీరో పవన్ కల్యాణ్.. ప్రశంసల వర్షం కురిపించిన చంద్రబాబు, మోదీ

కొత్త మంత్రులు వీళ్లే..

1. కొణిదెల పవన్ కల్యాణ్(జనసేన – కాపు)
2. కింజరాపు అచ్చెనాయుడు(బీసీ)
3. కొల్లు రవీంద్ర(బీసీ)
4. నాదెండ్ల మనోహర్(జనసేన – కమ్మ)
5. పి. నారాయణ(కాపు)
6. వంగలపూడి అనిత(ఎస్సీ)
7. సత్యకుమార్ యాదవ్(బీజేపీ – బీసీ)
8. నిమ్మల రామానాయుడు (కాపు)
9. ఎన్.ఎమ్.డీ.ఫరూక్(మైనార్టీ)
10. ఆనం రామనారాయణరెడ్డి(రెడ్డి)
11.పయ్యావుల కేశవ్(కమ్మ)
12.అనగాని సత్యప్రసాద్(బీసీ)
13.కొలుసు పార్థసారధి(బీసీ)
14.డోలా బాలవీరాంజనేయస్వామి(ఎస్సీ)
15. గట్టిపాటి రవి(కమ్మ)
16.కందుల దుర్గేష్(జనసేన – కాపు)
17. గుమ్మడి సంధ్యారాణి(ఎస్టీ)
18. బీసీ జనార్దన్ రెడ్డి(రెడ్డి)
19. టీజీ భరత్(వైశ్య)
20. ఎస్.సవిత(బీసీ)
21.వాసంశెట్టి సుభాష్(బీసీ)
22. కొండపల్లి శ్రీవివాస్(బీసీ)
23. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి(రెడ్డి)
24. నారా లోకేశ్( కమ్మ)

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×